Infinix Hot 10s: మొదటి రోజు సేల్ పైన భారీ అఫర్

Infinix Hot 10s: మొదటి రోజు సేల్ పైన భారీ అఫర్
HIGHLIGHTS

బడ్జెట్ లో గేమింగ్ ప్రాసెసర్ పెద్ద బ్యాటరీ తో Infinix Hot 10s లాంచ్

చాలా తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లతో చాలా స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టిన ఇన్ఫినిక్స్

మొదటి సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ ను 500 రూపాయల డిస్కౌంట్ ధరతో కొనుగోలు చెయ్యవచ్చు

10 వేల రూపాయల బడ్జెట్ లో గేమింగ్ ప్రాసెసర్ పెద్ద బ్యాటరీ తో Infinix Hot 10s స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ చెయ్యబడింది. ఈ స్మార్ట్ ఫోన్ ముఖ్యంగా చాలా మంచి స్టైలిష్ డిజైన్ తో లాంచ్ చెయ్యబడింది. అంతేకాదు, ఇప్పటి వరకూ ఇండియన్ మార్కెట్లో చాలా తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లతో చాలా స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టిన ఇన్ఫినిక్స్, ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ నుండి భారీ సేల్ ఆఫర్ ను కూడా ప్రకటించింది. మొదటి సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ ను 500 రూపాయల డిస్కౌంట్ ధరతో కొనుగోలు చెయ్యవచ్చు.      

Infinix Hot 10s : ధర

Infinix Hot 10s స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్ లలో ప్రకటించింది. వీటిలో, Infinix Hot 10s  (4జీబీ + 64 జీబీ ) స్టార్టింగ్ వేరియంట్ ను రూ.9,999 ధరతో, మరియు (6జీబీ + 64 జీబీ ) వేరియంట్ ను రూ.10,999 ధరతో ప్రవేశపెట్టింది. మే 27 న Flipkart నుండి మొదటి సేల్ జరుగుతుంది. అంతేకాదు, ఫ్యాన్స్ కోసం స్పెషల్ సేల్ లాంచ్ డిస్కౌంట్ అఫర్ క్రింద రూ.500 రూపాయల తగ్గింపును కూడా అఫర్ చేస్తోంది.    

Infinix Hot 10s : ప్రత్యేకతలు

Infinix Hot 10s స్మార్ట్ ఫోన్ పెద్ద 6.82 -అంగుళాల HD + రిజల్యూషన్ గల డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శ్యాంప్లింగ్ రేట్ గల డిస్ప్లే. ఇది 90.6% స్క్రీన్ టూ బాడీ రేషియాతో వస్తుంది మరియు NEG Dinorex  గ్లాస్ ప్రొటక్షన్ తో పైన చిన్న నోచ్ డిజైన్ ని అందించింది.

ఈ ఫోన్ మీడియా టెక్  హీలియో G85 గేమింగ్ ప్రాసెసర్ శక్తితో వస్తుంది మరియు ఇది ఆక్టా-కోర్ CPU. ఇది 6GB RAM మరియు 64GB స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. ఇది COD, PUBG, Free Fire వంటి గేమ్స్ ని కూడా చక్కగా నిర్వహించగలదు. అలాగే, ఇది XOS  7.6 ఆధారితంగా ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది.

ఇక కెమెరాల విషయంలో, ఈ ఇన్ఫినిక్స్ హాట్ 10s వెనుక భాగంలో ట్రిపుల్-కెమెరా సెటప్ తో వస్తుంది. దీనిలో, ప్రధాన కెమెరాని 48MP సెన్సార్ తో అందించింది. దీనికి జతగా 2MP డెప్త్ సెన్సార్ మరియు AI లెన్స్ కెమెరాలను జతచేసింది. ముందు భాగంలో, 8MP సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ పెద్ద 6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంటుంది.  ఆడియో పరంగా కూడా ఇందులో DTS Surround సౌండ్ ని కూడా అందించింది. ఓవరాల్ గా చెప్పాలంటే తక్కువ ధరలో మంచి ఫోన్ అందుకోవచ్చు.                          

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo