బడ్జెట్ ధరలో మంచి ప్రాసెసర్ కలిగిన రియల్మీ 3 ప్రో ఎన్నడూ చూడనంత చౌక ధరకు అమ్ముడవుతోంది

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది Oct 25 2019
బడ్జెట్ ధరలో మంచి ప్రాసెసర్ కలిగిన రియల్మీ 3 ప్రో ఎన్నడూ చూడనంత చౌక ధరకు అమ్ముడవుతోంది

#TimeSmartsNow with super power-efficient #HONORMagicWatch2

A timepiece so advanced yet personal, the #HONORMagicWatch2 has style, substance and a superb battery life of 2 weeks! Sale starts on 18th Jan

Click here to know more

HIGHLIGHTS

ఇది ఒక స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రాసెసర్, హైపర్ బూస్ట్ 2.0 తో వస్తుంది

దీపావళి సందర్భంగా, ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన బిగ్ దివాళి సేల్ ఈ రోజుతో ముగియనుండగా, అనేకమైన స్మార్ట్ ఫోన్లు మరియు ఇతర ప్రొడక్స్ పైన గొప్ప డిస్కౌంట్ ప్రకటించింది. అయితే, వాటిలో ముఖ్యంగా రియల్మీ మీద ప్రకటించిన డిస్కౌంట్ నిజంగా మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఇప్పటి వరకు 13,999 ధరతో అమ్ముడవుతున్న ఈ స్మార్ట్ ఫోన్ పైన 4000 రుపాయ డిస్కౌంట్ తో కేవలం రూ. 9,999 రూపాయల ధరకే అమ్ముడు చేస్తోంది.

అంతేకాదు, మీరు గనుక SBI డెబిట్ కార్డు నుండి అంటే ATM కార్డు ఉపయోగించి ఈ ఫోన్ను కొనుగోలు చేస్తే కనుక మరొక 10% డిస్కౌంట్ దొరుకుతుంది. అంటే, 9,999 రూపాయల ఫోన్ను SBI డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే, అది కేవలం రూ. 9,000 రూపాయలకే మీకు దొరుకుతుంది. ఇప్పటి వరకూ మనం చెప్పుకుంది కేవలం ఈ ఫోన్ కొనడానికి మనల్ని ప్రోత్సహించే ఆఫర్లు.

అయితే, వాస్తవానికి ఈ ఫోన్ గురించి చూస్తే ఫోన్ కూడా చాలా మంచి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది ఒక స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రాసెసర్, హైపర్ బూస్ట్ 2.0 తో వస్తుంది కాబట్టి, PUBG మొబైల్ వంటి గేమ్స్ చక్కగా ఆడుకోవచ్చు. గేమ్ మరియు కెమేరా బాగా పనిచేయాలంటే దాని ప్రాసెసర్ కూడా ఒక ప్రధానమైన విషయం అని గుర్తుంచుకోండి.

REALME 3 PRO -  ధరలు      

రియల్మీ 3 ప్రో (4GB ర్యామ్ + 64GB స్టోరేజి) - Rs. 9,999

రియల్మీ 3 ప్రో (6GB ర్యామ్ + 64GB స్టోరేజి) - Rs. 11,999

రియల్మీ 3 ప్రో (6GB ర్యామ్ + 128GB స్టోరేజి) - Rs. 12,999

REALME 3 PRO ప్రత్యేకతలు

రియల్మీ 3 ప్రో  స్మార్ట్ ఫోన్, 1080 x 2340 రిజల్యూషన్ కలిగిన ఒక 6.3 అంగుళాల వాటర్ నోచ్ డిస్ప్లేతో ఉంటుంది. ఇది 90.8%  స్క్రీన్-టూ-బాడీ రేషియో మరియు FHD+ రిజల్యూషన్ అందిస్తుంది. ఇది ఒక వాటర్ డ్రాప్ నోచ్ మరియు వెనుక ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది.  అంతేకాదు,ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్  2.2GHz వేగంతో క్లాక్ చేయబడిన, ఒక క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రొసెసరుకి జతగా అడ్రినో 616 మరియు 4GB మరియు 6GB ర్యామ్ శక్తితో వస్తుంది.ఇది  64GB మరియు 128GB స్టోరేజితో వస్తుంది. అలాగే డ్యూయల్ SIM కార్డులతో పాటుగా ఒక SD మెమొరీ కార్డును కూడా ఒకేసారి వాడుకునేలా ట్రిపుల్ SIM స్లాట్ ఇందులో అందించారు.            

కెమేరాల విషయానికి వస్తే, వెనుక f /1.7 అపర్చరు కలిగిన 16MP కెమేరాకు జతగా f/2.4 అపర్చరు కలిగిన మరొక 5MP సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమేరాతో ఉంటుంది. ఈ ప్రాధాన 16MP కెమెరా ఒక SonyIMX519  సెన్సారుతో వస్తుంది. ఇక సెల్ఫీ కెమేరా విషయానికి వస్తే, ముందుభాగంలో ఒక 25MP AI సెల్ఫీ కెమెరాతో ఉంటుంది.  ఇది ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారితంగా కలర్ OS 6 పైన నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక పెద్ద 4045mAh బ్యాటరీతో వస్తుంది మరియు ఇది బాక్స్ నుండి 20వాట్స్ వేగవంతమైన చార్జరుతో వస్తుంది. ఇందులో వేగవంతమైన ఛార్జింగ్ కోసం VooC 3.0 ఛార్జింగ్ సాంకేతికతను అందిచారు, దీనితో అత్యంత వేగవంతంగా ఛార్జ్ చెయ్యవచ్చని సంస్థ చెబుతోంది.

ఇక ఇందులో అందించిన ప్రత్యేకమైన ఫీచరుగా 960fps స్లో మోషన్ మరియు 4K వీడియో రికార్డింగ్ వంటి వాటిని గురించి చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో అందించిన కెమెరాతో 64MP రిజల్యూషన్ అందించగల అల్ట్రా HDR ఫోటోలను తీసుకోవచ్చని రియల్మీ ప్రకటించింది.అలాగే, లైటనింగ్ పర్పల్ , నైట్రో బ్లూ మరియు కార్బన్ గ్రే వంటి రెండు రంగుల ఎంపికలతో లభిస్తుంది. 

logo
Raja Pullagura

Realme 3 Pro 128GB

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

టాప్ -ప్రోడక్టులు

హాట్ డీల్స్

మొత్తం చూపించు

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.