50X Zoom ఫోన్, హువావే P 30 ప్రో ఇండియా ఏప్రిల్ 9 అధికారికంగా రానుంది.

50X Zoom ఫోన్, హువావే P 30 ప్రో ఇండియా ఏప్రిల్ 9 అధికారికంగా రానుంది.
HIGHLIGHTS

ఈ ఫోన్లు సూపర్ స్పెక్ట్రమ్ సెన్సార్, ఒక ఆప్టికల్ సూపర్ జూమ్ లెన్స్ మరియు టైం ఆఫ్ ఫ్లయిట్ (TOF) కెమెరాతో కలగలుపుగా వస్తాయి.

 చైనీస్ టెక్ దిగ్గజం Huawei, ఈ P30 సిరీస్ ఫోన్లలో ఇప్పటివరకు ఎన్నడూ లేనటువంటి  చాలా అడ్వాన్సుడ్ కెమేరా టక్నాలజీని అందించింది. అంతేకాదు, ఇవి ప్రొఫెషనల్ కెమేరాలతో కూడా పోటీపడేలా ఉంటాయి. ఈ ఫోన్లు సూపర్ స్పెక్ట్రమ్ సెన్సార్, ఒక ఆప్టికల్ సూపర్ జూమ్ లెన్స్ మరియు టైం ఆఫ్ ఫ్లయిట్  (TOF) కెమెరాతో  కలగలుపుగా వస్తాయి. ఈ లెన్సులు మంచి OIS మరియు AIS ఇమేజ్ స్టెబిలిజేషన్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. ఇటీవల, ఈ స్మార్ట్ ఫోన్ ప్యారిస్ లో జరిగిన ఒక కార్యక్రమం ద్వారా విడుదల చెయ్యబడింది. ఇప్పుడు ఈ ఫోన్ ఇండియాలో ఏప్రిల్ 9 న అధికారికంగా రానుంది. 

కెమెరా

Huawei p30, ఒక 40MP ప్రధాన కెమెరా సూపర్ స్పెక్ట్రమ్ సెన్సార్ మరియు లెన్స్ కలిగి ఒక f1.8 అపర్చరుతో వుంటుంది మరియు ఒక f2.2 అపర్చరు గల  16MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇంకా  f2.4 అపర్చరుతో ఒక 8MP టెలిఫోటో కెమెరాతో సహా ఒక Leica ట్రిపుల్ కెమెరా వ్యవస్థను అమర్చారు . ముందు AI HDR + తో ఒక 32MP కెమెరాను అందించారు. ఇక హువావే P30 ప్రో విషయానికి వస్తే, ఇది ఒక Leica క్వాడ్ కెమెరా సెటప్పుతో వస్తుంది.  ఇందులో   f1.6 అపర్చరు యాగాల ఒక 40MP ప్రధాన కెమెరా, f2.2 అపర్చరు గల ఒక 20MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా,  f3.4 అపర్చరు గల ఒక 8MP 5X టెలిఫోటో కెమెరా మరియు ఒక టైమ్ ఆఫ్ ఫ్లైట్ (TOF) కెమెరా, AI HDR + ఒక 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

ఈ రెండు ఫోన్లు సాధారణ వాటికంటే భిన్నమైన బేయర్ ఫిల్టర్లను కలిగివుంది. ఇవి ఒక 1 / 1.7-అంగుళాల Huawei SuperSpectrum సెన్సార్ తో వస్తాయి. RGBG బేయర్ ఫిల్టర్, సంప్రదాయ సెన్సార్ల వలనే కాకుండా, సూపర్ స్పెక్ట్రమ్ సెన్సార్ ఆకుపచ్చ పిక్సెళ్ళ స్థానములో పసుపు పిక్సెళ్ళను కలిగివున్న RYYB ఫిల్టర్ ఉంది. దీనికారణంగా, ఈ సెన్సార్ 40 శాతం ఎక్కువ కాంతిని అనుమతిస్తుందని, హువావే తెలిపింది. అలాగే,  Huawei p30 మరియు Huawei p30 ప్రో వరుసగా 204.800 మరియు 409.600 అధిక గరిష్ట ISO రేటింగ్ అందిస్తాయని పేర్కొంది.

హువావే సూపర్ జూమ్ లెన్స్ 3X ఆప్టికల్ జూమ్, 5X హైబ్రిడ్ జూమ్ మరియు ఈ P30 సీరీస్ ఫోన్లలో 50X రెట్లు డిజిటల్ జూమ్ (30x రెట్లు P 30), మద్దతునిస్తాయి. రెండు ఫోన్లు కూడా AIS మరియు OIS కలిగివున్నాయి, ఒక Telephoto లెన్స్ ద్వారా ఫోటో క్లిక్ చేసినప్పుడు తక్కువ కాంతి పరిస్థితులలో కూడా స్థిరమైన షాట్ మరియు ప్రకాశవంతంగా అందిస్తుంది. రెండు ఫోన్లు, ఫ్లాష్, కలర్ టెంపరేచర్ మరియు ఫ్లికర్ సెన్సార్లను కలిగిఉంటాయి.  అయితే, P30 అధనంగా ఒక లేజర్ ట్రాన్స్మిటర్ మరియు లేజర్ రిసీవర్ తో వస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్లలోని  కెమెరాతో  60fps వద్ద 4K నాణ్యతతో వీడియోలను తీయవచ్చని, హువాయ్ చెబుతోంది. ఈ ఫోన్లో AI మూవీ ఎడిటర్ కూడా ఉంది, ఇది ఆటోమేటిగ్గా యాక్షన్ ముఖ్యాంశాలను గుర్తించి, నేపథ్య సంగీతాన్ని మరియు ప్రత్యేక ఎఫెక్టులను జోడించే టూల్స్ ని సూచిస్తుంది. అంతేకాక, ఈ ఫోన్లు ఒక డ్యూయల్ వ్యూ మోడ్ తో వస్తాయి.  ఫోన్లు అందినచిన నాలుగు కెమేరాలో రెండింటితో విడివిడిగా రెండు వీడియోలను ఒకేసారి తీసుకునేలా ఉంటుంది. అంటే,   ఒక ఆల్ట్రా-వైడ్ యాంగిల్ కెమేరా మరియు అదే సమయంలో ఒక జూమ్ షాట్ ఉపయోగించి వివిధ వీడియోలు రికార్డ్ చేయడానికి వీలుంటుంది. ఈ P30 ప్రో కెమెరా, DXOMark నుండి 112 పాయింట్లు సాధించింది, ఈ అధిక రేటింగ్ సాధించిన మొట్టమొదటి ఫోన్ ఇదొక్కటే అని చెప్పడంలో ఆశర్యం లేదు.

డిస్ప్లే

P30 సిరీస్ యొక్క డిజైన్ ప్రకృతి ద్వారా ప్రేరణ పొందిందని సంస్థ పేర్కొంది. ఈ P30 ఒక 6.1-అంగుళాల పూర్తి HD + OLED పానెల్ (DCI-P3 HDR డిస్ప్లే) 2340×1080 పిక్సెళ్ళ రిజల్యూషనుతో మరియు 19.5:9 వాటర్ డ్రాప్ నోచ్ తో వస్తుంది. మరోవైపు, హువావే P30 ప్రో ఒక 6.47-అంగుళాల పూర్తి HD + కర్వ్డ్  OLED డిస్ప్లే, ఒక 2340×1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ (DCI-P3 HDR), మరియు 19.5:9 ఆస్పెక్ట్ రేషియాతో వస్తుంది.

ఈ ఫోన్ అంబర్ సన్రైజ్, పెర్ల్ వైట్, అరోరా, బ్లాక్ మరియు ప్రత్యేక బ్రీతింగ్ క్రిస్టల్ రంగులలో లభిస్తుంది. వెనుక భాగంలో, ఈ రెండు ఫోన్లు వెనుక ప్యానెల్లో నానో ఆప్టికల్ కలర్ ముగింపుతో తొమ్మిది పొరలతో వస్తాయి. హువావే P30 ప్రో ఒక ఎకౌస్టిక్ డిస్ప్లే టెక్నాలజీ వస్తుంది.  ఇది ప్రధానంగా ఇయర్ పీస్ ఆడియో (హువావే P30 లో ఒక సాధారణ ఇయర్ పీస్ ఉంది) కోసం ఇన్-స్క్రీన్ మాగ్లేవ్ స్పీకర్ వుంది.  ఈ రెండు ఫోన్లు EMUI 9.1 పైన అమలవుతాయి.

హార్డ్వేర్

P 30 మరియు P 30 ప్రో ఒక ద్వంద్వ-NPU తో 7nm కిరిన్ 980 ప్రాసెసర్ కలిగివుంటుంది, అయితే, వీటి RAM మరియు స్టోరేజి రకాలలో తేడా ఉంది. ఇవి 8GB RAM మరియు 128GB స్టోరేజ్, 8GB RAM మరియు 256GB స్టోరేజ్ మరియు 8GB RAM మరియు 512GB స్టోరేజ్ వంటి మూడు రకాల్లో P30 ప్రో  లభిస్తుంది. అయితే, p30 కేవలం 6GB RAM మరియు 128GB స్టోరేజితో మాత్రమే అందించబడుతోంది. రెండు ఫోన్లు గ్రాఫేన్ ఫిల్మ్ కూలింగ్ సిస్టమ్ కలిగి ఉన్నాయి. ఈ P సిరీస్ స్మార్ట్ ఫోన్లు డిస్ప్లే లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉన్నాయి, ఇది ముందున్న వాటికంటే 30 శాతం వేగంగా అన్లాక్ చేయగలవని పేర్కొంది.

ఇక బ్యాటరీ విషయానికి వస్తే, P 30 ప్రో 40 వాట్స్ ఛార్జింగ్ మరియు 15 వాట్స్ వైర్ లెస్ ఛార్జింగ్ కి మద్దతును అందించగల ఒక పెద్ద 4,200mAh బ్యాటరీతో  వస్తుంది. అయితే, P 30 మాత్రం 25 వాట్స్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేయగల ఒక 3,650mAh బ్యాటరీతో వస్తుంది. కానీ, P 30 సామ్రాట్ ఫోనులో వైర్ లెస్ సపోర్ట్ మాత్రం అందించలేదు. ఇక  P 30 ఒక IP68 ద్రువీకరణతో వస్తే,  P 30 మాత్రం IP53 రేటింగుతో వస్తుంది.

ధర

హువావే  P 30 799 యూరో (సుమారు రూ.62,200) ధరతో ప్రకటించబడింది. అయితే,  P 30 ప్రో యొక్క 128GB వేరియంట్ 999 (సుమారు రూ.78,000) యూరో ధరతో ప్రారంభమవుతుంది. అలాగే, 256GB వేరియంట్ 1099 (సుమారు రూ.85,600) యూరోలకు మరియు 512GB వేరియంట్ 1249 (సుమారు రూ.97,000) యూరోల ధరతో అందుబాటులో ఉంటుంది.        

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo