హువావే Y9 ప్రైమ్ అతితక్కువ ధరలో పాప్ సెల్ఫీతో లాంచ్ అయ్యింది.
ఇది ట్రిపుల్ రియర్ కెమేరా మరియు పెద్ద బ్యాటరీతో ఆకట్టుకుంటుంది.
ఈరోజు హువావే తన మొట్టమొదటి పాప్ అప్ సెల్ఫీ కెమేరా స్మార్ట్ ఫోన్ను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. హువావే Y9 ప్రైమ్ (2019) పేరుతొ తీసుకొచ్చినటువంటి ఈ స్మార్ట్ ఫోన్ ఒక సరికొత్త డిజన్ మరియు కిరిణ్ 730F ఆక్టా కోర్ ప్రాసెసర్ తో అందించబడింది. అలాగే ఇది ట్రిపుల్ రియర్ కెమేరా మరియు పెద్ద బ్యాటరీతో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ను మిడ్ రేంజ్ ధరలో ప్రస్తుతం వున్న ఇదేరకమైన ట్రెండీ ఫోన్లకు మరొక పోటీ ఫోనుగా తీసుకొచ్చింది.
Surveyహువావే Y9 ప్రైమ్ ధరలు మరియు ఆఫర్లు
1. హువావే Y9 ప్రైమ్ 4GB + 128GB – Rs.15,990
హువావే Y9 ప్రైమ్ కేవలం 4GB ర్యామ్ + 128GB స్టోరేజి గల ఒకేఒక్క వేరియంట్ ని మాత్రమే అందించింది. అలాగే, ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ ఆగష్టు 7 వ తేది మధ్యాహ్నం 12 గంటలకి మొదటి సేల్ మొదలవుతుంది. ఇక ఆఫరల్ విషయానికి వస్తే, SBI క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్నుకొనుగోలు చేసే వారికి 10% డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, జియో భాగస్వామ్యంతో ఈ స్మార్ట్ ఫోన్ను కొనేవారికి 2.2 TB ఉచిత డేటా మరియు 2,200 రుపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది.
హువావే Y9 ప్రైమ్ ప్రత్యేకతలు
స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే, ఈ వై 9 ప్రైమ్ (2019) ఒక 6.59 అంగుళాల Full HD + డిస్ప్లేను కలిగి ఉంటుంది మరియు ఇది TFT ఎల్‌సిడి(LTPS) ప్యానెల్ తో ఉంటుంది. దీని స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి కూడా 91 శాతం ఉంటుంది మరియు 2340×1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందిస్తుంది. కొత్త ట్రెండ్ అయిన పాప్-అప్ కెమెరాని ఇందులో అందించింది. కాబట్టి, పూర్తి వ్యూ డిస్ప్లే ఇందులో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ హై సిలికాన్ కిరిన్ 710 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది 4 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్‌తో జత చేయబడుతుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారితమైన EMUI 9.0 తో నడుస్తుంది.
ఆప్టిక్స్ పరంగా, ఈ ఫోన్ వెనుక భాగంలో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాకి జతగా ఒక 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమేరా మరియు మరొక 2 MP డెప్త్ కెమెరా కలగలిపిన ఒక ట్రిపుల్ రియర్ కెమెరా సేటప్పుతో వస్తుంది. అలాగే, ముందుభాగంలో సెల్ఫీ కోసం 16 MP సెల్ఫీ కెమెరాను కూడా ఇందులో ఇచ్చారు. ఇక ఈ కెమెరా అనుభవాన్ని మెరుగుపరచడానికి AI కూడా దీనికి చేర్చబడింది. దీని ద్వారా చాల రకాలైన 22 రకాలైన కేటగిరీలు మరియు 5000 కంటే పైచిలుకు సీన్లను అదేసమయంలో అనలైజ్ చేస్తుంది. ఇక ఈ పూర్తి ప్యాకేజీకి శక్తిని అందించానికి ఒక పెద్ద 4,000 mAh బ్యాటరీని వేగవంతమైన చార్జరును టైప్ -C తో అందించారు.