తన కొత్త Harmony OS ని అధికారికంగా ప్రకటించిన Huawei సంస్థ

HIGHLIGHTS

అధికారిక ధృవీకరణను నిర్వహించే మొదటి OS కూడా ​హార్మోనిOS కావడం విశేషం

తన కొత్త Harmony OS ని అధికారికంగా ప్రకటించిన Huawei సంస్థ

హువావే డెవలపర్ కాన్ఫరెన్స్ 2019 లో హువావే తన Harmony OS ను అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను చైనాలో హాంగ్‌మెంగ్ OS  అని పిలుస్తారు. ఈ సంస్థ, తన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రోకెర్నల్ టెక్ మీద ఆధారపడి నడుస్తుందని, మరియు ఇది ప్రతిడివైజులో ఉపయోగించవచ్చు: స్మార్ట్ఫోన్లు, వేరబుల్స్ , స్మార్ట్ స్పీకర్లు మరియు ఇంకా మరెన్నో. అధనంగా, ఈ హార్మొనీ OS ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్‌గా విడుదల చేయబడుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ సమావేశంలో, హువావే హార్మొనీ OS గురించి మొదటి వివరాలను కూడా షేర్ చేసింది, కాని కంపెనీ దీన్ని ఇంకా స్మార్ట్‌ఫోన్‌లలో చూపించలేదు. అయితే, రేపు హానర్ విజన్ టీవీలో హార్మొనీ ఓఎస్ 1.0 ను ప్రదర్శించడానికి కంపెనీ సిద్ధంగా ఉంది, కాబట్టి ఆండ్రాయిడ్ మొబైల్ OS కోసం గో-టు ఎంపికగా ఉంది.

Linux, Android మరియు HTML5 ప్లాట్‌ఫారమ్‌ల కోసం నిర్మించిన అప్లికేషన్లు భవిష్యత్తులో హార్మొనీ OS లో “అమలు చేయగలవు”. హువావే తన ARK కంపైలర్‌కు డెవలపర్‌లకు యాక్సెస్ అందిస్తుంది. ఇది C/C ++, Java మరియు కోట్లిన్‌తో సహా మల్టీ లాంగ్వేజ్ ల నుండి కోడ్‌ను అమలు చేయడానికి మరియు కంపైల్ చేయడానికి ఇది సహాయపడుతుంది. కొత్త ఎస్‌డికెను కూడా ఈ సంస్థ అందిస్తుంది. అంతేకాకుండా, భవిష్యత్ భద్రతా సమస్యల కోసం రూట్ యాక్సెస్‌ను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించదని, హువావే తెలిపింది. అదనంగా, పరికరంలో అధికారిక ధృవీకరణను నిర్వహించే మొదటి OS కూడా ​హార్మోనిOS కావడం విశేషం, దీన్ని  'ట్రస్టెడ్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ (TEE)' పిలుస్తారు.

ఈ చైనా టెక్ దిగ్గజం కూడా స్మార్ట్ టీవీల్లో ఓఎస్‌ను లాంచ్ చేస్తుందని, ఇది 2020 నాటికి వేరబుల్స్ మరియు ల్యాప్‌టాప్‌లలోకి కూడా ఇది వస్తుందని చెప్పారు. గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై సిఇఒ తన నిబద్ధతను పునరుద్ఘాటించగా, ఏ సమయంలోనైనా కంపెనీ “ఆండ్రాయిడ్‌ను ఉపయోగించలేకపోతే భవిష్యత్తులో, "హువావే" వెంటనే తన హార్మొనీ OS కి మారడానికి వెనుకాడదు అని తెలిపారు.

సంస్థ ప్రకారం, "హార్మొనిOS డిటెర్మినిస్టిక్ లాటెన్సీ ఇంజిన్ మరియు హై-పెర్ఫార్మెన్స్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ (ఐపిసి) తో పనితీరు సవాళ్లను పరిష్కరిస్తుంది. ఈ డిటెర్మినిస్టిక్ లాటెన్సీ ఇంజిన్ ముందుగానే షెడ్యూల్ చేయడానికి టాస్క్ ఎగ్జిక్యూషన్ ప్రాధాన్యతలను మరియు సమయ పరిమితులను నిర్దేశిస్తుంది.  ఇది  అప్లికేషన్ల ప్రతిస్పందన జాప్యాన్ని 25.7 శాతం తగ్గిస్తాయి. "

రాబోయే మూడేళ్ల కాలంలో హార్మొనీ ఓఎస్ మరింత ఆప్టిమైజ్ చేయబడుతుంది మరియు అనేక రకాల ఉత్పత్తులపై అమలు చేయబడుతుంది

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo