మీ చుట్టూ ఉన్న సెల్ టవర్లు మరియు నెట్వర్క్ స్పీడ్ తెలుసుకోండిలా

HIGHLIGHTS

అప్లోడ్ మరియు డౌన్లోడ్ 4G/3G స్పీడ్స్ ఏయే కంపెనీలు ఎలా ఇస్తున్నాయో

మీ చుట్టూ ఉన్న సెల్ టవర్లు మరియు నెట్వర్క్ స్పీడ్ తెలుసుకోండిలా

ప్రస్తుతం మనలో చాల మందికి కూడా వారి ఫోన్లలో సరైన నెట్ వర్క్ అందనపుడు చాల ఇబ్బంది పడుతుంటాము మరియు ఈ విష్యం చిరాకు కలిగిస్తుంది. సరైన నెట్ వర్క్ స్పీడ్,  మంచి డౌన్లోడ్ స్పీడ్ మనకు వీడియోలను చూడడానికి ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి, మెయిల్స్, ఆన్లైలో సాంగ్స్ వినడానికి మరియు చాలావాటికి ఎటువంటి ఆంతరాయాన్ని కలిగించకుండా ఉండేలా ఉంటుంది. ఇక అప్లోడ్ వేగం ఎక్కువగా ఉండడం వలన, మెయిల్స్ పంపడం, ఇమేజిలను పంపడం మరియు మీ యొక్క వీడియోలను షేర్ చేసుకోవడాన్నీ సులభతరం చేస్తుంది. అటువంటి అప్లోడ్ మరియు డౌన్లోడ్ 4G/3G స్పీడ్స్ ఏయే కంపెనీలు ఎలా ఇస్తున్నాయో TRAI తెలుపుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఎలా తెలుసుకోవాలి ?

మీ ప్రాంతంలో ఏ నెట్వర్క్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడనికి క్రింద తెలిపిన విధంగా చేయాలి.  

1. ముందుగా మీరూ https://myspeed.trai.gov.in  వెబ్ పేజీ ఓపెన్ చేయాలి.

2.  ఇక్కడ మీకు అన్ని రాష్ట్రాలకు సంబంచిన 3G/4G నెట్వర్కుల యొక్క డౌన్లోడ్/అప్లోడ్  స్ప్పేడ్ వివరాలను కనుగొంటారు.

3. ఈ హోమ్ పేజీలో ఎడమవైపున పైభాగంలో Map View పైన  నొక్కాలి.

4. ఇక్కడ మీకు Explore Data Speed అని వస్తుంది మరియు ఒక మ్యాప్ కూడా కనిపిస్తుంది.

5. ఇక్కడ మీరు Operator  మీకు కావాల్సిన ఎంచుకోవాలి.

6. తరువాత మీరు మీకు కావాల్సిన Technology (3G/4G) ని ఎంచుకోవాలి.

7. తరువాత మ్యాప్ పై భాగంలో కనిపించే బాక్స్ లో మీకుకాల్సిన ప్రాంతాన్ని ఎంటర్ చేయాలి.

8. ఇప్పుడు Download/ Upload /Coverage లో మీకు కావలసిన ఎంపికను ఎంచుకోండి.

9. పైన తెలివైన అన్ని వివరాలను ఎంచుకున్న తరువాత Submit చేయండి.

10. ఇక్కడ మీరు మీకు కావాల్సిన సమాచారాన్ని పొందుతారు

మ్యాప్ పైభాగంలో కనిపించే మై లొకేషన్ చిహ్నం పైన నొక్కడం ద్వారా మీరు ఉన్న ప్రాంతం యొక్క వివరాలను పొందవచ్చు

గమనిక : వివరాలను మార్చే ప్రతిసారి Submit పైన నొక్కావాల్సివుంటుంది మ్యాప్ మార్చడానికి రిఫ్రెష్ పైన చేయాల్సి ఉంటుంది.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo