Honor X7c 5G: ప్రీమియం లుక్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!
హానర్ ఈరోజు ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ హానర్ ఎక్స్ 7c 5జి ఫోన్ లాంచ్ చేసింది
బడ్జెట్ ప్రైస్ సెగ్మెంట్ లో ఆకట్టుకునే ఫీచర్స్ తో భారత మార్కెట్లో అడుగుపెట్టింది
ఈ ఫోన్ చాలా స్లీక్ గా ఉంటుంది మరియు SGS 5 స్టార్ డ్రాప్ రెసిస్టెంట్ ఫీచర్ తో స్ట్రాంగ్ గా ఉంటుంది
Honor X7c 5G: ప్రముఖ చైనీస్ కంపెనీ హానర్ ఈరోజు ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ హానర్ ఎక్స్ 7c 5జి ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ మంచి లుక్స్ కలిగిన ప్రీమియం డిజైన్ మరియు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఆకట్టుకునే ఫీచర్స్ తో భారత మార్కెట్లో అడుగుపెట్టింది. హానర్ సరికొత్తగా విడుదల చేసిన ఈ ఫోన్ ధర మరియు ఫీచర్లు తెలుసుకుందామా.
SurveyHonor X7c 5G: ప్రైస్ అండ్ ఆఫర్స్
హానర్ ఈ ఫోన్ ను సింగల్ వేరియంట్ తో రూ. 14,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఫారెస్ట్ గ్రీన్ మరియు మూన్ లైట్ వైట్ రెండు రంగుల్లో లభిస్తుంది. ఆగస్టు 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ అమెజాన్ నుండి సేల్ అవుతుంది.
Honor X7c 5G: ఫీచర్స్
ఈ హానర్ స్మార్ట్ ఫోన్ ఆకట్టుకునే ప్రీమియం డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ ప్రీమియం లెథర్ మరియు మార్బుల్ వంటి రెండు డిజైన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ గా ఉంటుంది మరియు SGS 5 స్టార్ డ్రాప్ రెసిస్టెంట్ ఫీచర్ తో స్ట్రాంగ్ గా ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ IP 64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది. ఈ హానర్ ఫోన్ స్లీక్ డిజైన్ లో కూడా 5200 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు ఈ బ్యాటరీ ని వేగంగా ఛార్జ్ చేసే 35W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

హానర్ ఎక్స్ 7c స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ బిగ్ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్ మరియు మంచి 850 నిట్స్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 4 Gen 2 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ చిప్ సెట్ కి జతగా ఇందులో 8 జీబీ ఫిజికల్, 8 జీబీ వర్చువల్ ర్యామ్ మరియు 256 జీబీ అంతర్గత హెవీ స్టోరేజ్ కూడా అందించింది. ఈ ఫీచర్స్ తో ఈ ఫోన్ చాలా వేగంగా ఉంటుందని హానర్ ప్రకటించింది.
Also Read: Motorola Collections: క్రిస్టల్స్ పొదిగిన ప్రీమియం ఫోన్ లాంచ్ చేస్తున్న మోటోరోలా.!
ఇక కెమెరా మరియు ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 50MP AI మోషన్ డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా అందించింది. ఈ ఫోన్ 3x లాస్ లెస్ జూమ్ మరియు మంచి AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. హానర్ X7c ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు 300% హై వాల్యూమ్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో ఎక్కువ సమయం బ్యాటరీ నిలపడానికి వీలుగా అల్ట్రా పవర్ సేవింగ్ మోడ్ కూడా ఉంది. ఈ ఫోన్ లో కూడా హానర్ మ్యాజిక్ క్యాప్సూల్ ని అందించింది. ఇది మల్టీ టాస్కింగ్ కోసం చక్కగా ఉపయోగపడుతుంది.
హానర్ ఎక్స్ 7c ఫీచర్స్ ఏమిటి?
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్ సెట్
- 16 జీబీ ర్యామ్ (8 జీబీ + 8 జీబీ) + 256 జీబీ స్టోరేజ్
- SGS 5 స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ బాడీ
- 50MP AI మోషన్ కెమెరా (3x లాస్ లెస్ జూమ్)
- 5200 mAh బ్యాటరీ మరియు 35W ఫాస్ట్ ఛార్జ్
- IP 64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్
- 300% హై ఇంపాక్ట్ సౌండ్ సపోర్ట్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile