Honor X7c 5G: 5 స్టార్ డ్రాప్ రెసిస్టెంట్ వంటి భారీ ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది.!
హానర్ యొక్క సక్సెస్ ఫుల్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ X సిరీస్ నుంచి కొత్త ఫోన్ ఇండియాలో లాంచ్ చేస్తోంది
Honor X7c 5G సరికొత్తగా మరియు మరింత ఆకట్టుకునేలా ఉంటుంది
ఈ స్మార్ట్ ఫోన్ కోసం కంపెనీ అమెజాన్ నుంచి టీజింగ్ మొదలు పెట్టింది
Honor X7c 5G: హానర్ యొక్క సక్సెస్ ఫుల్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ X సిరీస్ నుంచి కొత్త ఫోన్ ఇండియాలో లాంచ్ చేస్తోంది. అదే హానర్ ఎక్స్ 7సి స్మార్ట్ ఫోన్ మరియు ఈ స్మార్ట్ ఫోన్ కోసం కంపెనీ అమెజాన్ నుంచి టీజింగ్ మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 5 స్టార్ డ్రాప్ రెసిస్టెంట్ వంటి భారీ ఫీచర్స్ తో లాంచ్ అవుతుందిని హానర్ తెలిపింది. ఈ ఫోన్ డిజైన్ కూడా సరికొత్తగా మరియు మరింత ఆకట్టుకునేలా ఉంటుంది.
SurveyHonor X7c 5G: లాంచ్ డేట్ ఏమిటి?
హానర్ ఎక్స్ 7 సి స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ ను హానర్ ఇంకా చేయలేదు. అయితే, ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ తో మాత్రం టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకంగా అందించింది మైక్రో సైట్ నుంచి ఈ ఫోన్ కీలక ఫీచర్స్ విడుదల చేసింది. ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాత అమెజాన్ నుంచి ఈ ఫోన్ సేల్ అవుతుంది.
Honor X7c 5G: కీలక ఫీచర్స్
హానర్ ఎక్స్ 7c స్మార్ట్ ఫోన్ వెనుక ప్రీమియం లెథర్ బ్యాక్ ప్యానల్ కలిగి చాలా అందమైన డిజైన్ తో లాంచ్ అవుతుంది. కేవలం అందం మాత్రమే కాదు ఈ ఫోన్ 5 స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ తో చాలా పటిష్టమైన డిజైన్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డ్రాప్ అండ్ క్రాష్ రెసిస్టెన్స్ కోసం SGS ప్రీమియం పెర్ఫార్మన్స్ సర్టిఫికేషన్ అందుకుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ IP64 రేటింగ్ తో డస్ట్ ప్రూఫ్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా కలిగి ఉంటుంది.

ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ 4 జెన్ చిప్ సెట్ Snapdragon 4 Gen 2 తో పని చేసస్తోంది. మరింత అధిక పెర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్ లో 8 జీబీ ఫిజికల్ ర్యామ్, 8 జీబీ అదనపు ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ కూడా ఉంటుంది. మంచి బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన పెద్ద డిస్ప్లే ఈ ఫోన్ లో ఉంటుంది.
Also Read: కేవలం రూ. 7000 బడ్జెట్ లో లభించే ఏకైక Dolby Atmos Soundbar ఇదే. !
ఈ ఫోన్ యొక్క మరిన్ని ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 3x లాస్ లెస్ జూమ్ సపోర్ట్ కలిగిన 50MP అల్ట్రా క్లియర్ కెమెరా ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఇది క్లియర్ ఇమేజెస్ మరియు మంచి వీడియోలు అందించే సత్తా కలిగి ఉంటుందని హానర్ తెలిపింది. ఇది కాకుండా 300% హై వాల్యూమ్ సౌండ్ అందించే డ్యూయల్ స్టీరియో స్పీకర్ లను కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది.