అతి త్వరలో హానర్ వ్యూ 20 ఇండియాలో విడుదలకానుంది : అమేజాన్ ప్రత్యేకంగా

HIGHLIGHTS

అమేజాన్ ఈ హానర్ వ్యూ 20 లేదా V20 స్మార్ట్ ఫోన్ కోసం ఒక ప్రత్యేకమైన డెడికేటెడ్ మైక్రో సైట్ ని డిజైన్ చేసింది మరియు త్వరలో ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ కానున్నట్లు అందులో చెబుతోంది.

అతి త్వరలో  హానర్ వ్యూ 20 ఇండియాలో విడుదలకానుంది : అమేజాన్ ప్రత్యేకంగా

చైనాలో హానర్ వ్యూ 20, లేదా హానర్ V20 ప్రారంభమైన ఒకరోజు తర్వాత, అమెజాన్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్, భారతదేశ మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీ తన ప్రణాళికలను ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్, Amazon.in లో ఇచ్చిన ఒక ప్రత్యేక మైక్రోసాైట్ లో కనిపించింది, ఈ స్మార్ట్ ఫోన్  ఈ ఆన్లైన్ రిటైలరుకు ప్రత్యేకంగా ఉంటుంది మరియు భారతదేశంకు "త్వరలో రానుంది". హానర్ V20 ఒక పంచ్ హోల్ కెమెరా, ఒక 48MP వెనుక సెన్సార్ మరియు లింక్ టర్బో టెక్నాలజీని కలిగి ఉన్న ఒక ఆల్-వ్యూ డిస్ప్లేతో వస్తుంది, ఇది Wi-Fi మరియు సెల్యులార్ కనెక్టివిటీని రెండింటినీ పెంచుకోవడం ద్వారా వేగవంతమైన డౌన్లోడ్ వేగాలను సాధించగలదని పేర్కొంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon Honor V20.jpg

హానర్ వ్యూ 20, మొదటిగా హాంకాంగ్లో జరిగిన కార్యక్రమంలో ప్రదర్శించబడింది, ఇది సెల్ఫీ కెమెరా కోసం ఒక పంచ్-హోల్ డిస్ప్లే తో మరియు  48MP వెనుక కెమెరాతో కమర్షియల్ గా కంపెనీ ప్రారంభించిన మొట్టమొదటి స్మార్ట్ఫోన్. ఈ హానర్ వ్యూ 20, లేదా హానర్ V20, 6GB RAM మరియు 128GB స్టోరేజి  వేరియంట్  CNY 2999 (దాదాపు రూ. 30,000) ధరతో ఉంటుంది. అలాగే, 8GB RAM మరియు 128GB స్టోరేజి వేరియంట్ కోసం వినియోగదారులు CNY 3499 (సుమారు రూ 35,500) ధర చెల్లించాల్సివుంటుంది.  8GB RAM మరియు 256GB స్టోరేజితో,హానర్ ఒక ప్రత్యేకమైన V20 మోస్చినో ఎడిషన్ను CNY 3999 (సుమారు రూ .40,000) ధరతో ప్రారంభించింది.

హానర్ వ్యూ 20 ప్రత్యేకతలు

ఈ హానర్ వ్యూ 20,  2310×1080 పిక్సల్స్ యొక్క రిజల్యూషనుతో  ఒక పెద్ద 6.4 అంగుళాల Full HD + ఆల్-వ్యూ డిస్ప్లేని కలిగి ఉంది. ఆల్-వ్యూ డిస్ప్లే అనేది ఒక ప్యానెల్ రంధ్రంతో కూడిన డిస్ప్లేతో ఉంటుంది డిస్ప్లేలో కేవలం ఒక పానల్ రంధ్రం మాత్రమే ఉంటుంది, ఇది ఒక సెలి షూటర్ను కలిగివుంటుంది. ఎగువ ఎడమ మూలలో గుండ్రంగా 4.5mm వ్యాసంలో ఇది ఉంటుందని అని హువావే చెప్పింది.   గ్లాస్ క్రింద,  V- ఆకార నమూనాతో ఒక గ్లాస్ బ్యాక్ ప్యానెల్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్  బ్లూ, బ్లాక్ మరియు రెడ్ కలర్లలో అందుబాటులో ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ఒక ఆక్టా – కోర్ కిరిన్ 980 ప్రధాన చిప్సెట్ తో శక్తినిస్తుంది, ఇది 7nm ప్రాసెసుతో తయారు చేయబడుతుంది. అదే ప్రాసెసర్ Huawei యొక్క తాజా ఫ్లాగ్షిప్ అయినటువంటి, హువావే మేట్ 20 ప్రో లో చేర్చారు. ఈ పరికరం GPU టర్బో 2.0 తో వస్తుంది, ఇది గేమింగ్ సెషన్ల సమయంలో పనితీరు మరియు గ్రాఫిక్స్లను  మెరుగుపరిచే సాంకేతికత అని సంస్థ చెబుతోంది. CPU ఉష్ణోగ్రత పరిశీలనలో ఉంచడానికి ఒక లిక్విడ్ కూల్ టెక్నాలజీ వ్యవస్థ కూడా ఉంది.

కెమెరా విభాగంలో, హానర్ వ్యూ 20 వెనుక 48MP సోనీ IMX586 CMOS సెన్సార్ను కలిగి ఉంది. 1.6 మైక్రో పిక్సెల్ను అందించడానికి సెన్సార్ పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. డ్యూయల్ వెనుక కెమెరా యొక్క రెండవ సెన్సార్ డెప్త్ లను పట్టుకోవటానికి ఉపయోగపడుతుంది. డిస్ప్లేలోవున్న పంచ్ రంధ్రం f / 2.0 ఎపర్చరుతో 25MP సెన్సార్ను కలిగి ఉంటుంది. ఒక 4,000 mAh బ్యాటరీ సూపర్ ఫాస్ట్ ఛార్జ్ మద్దతుతో ఉంది. ఈ ఫోన్ Android 9.0 Pie  పైన ఆధారితమైన మేజిక్ UI 2.0 తో నడుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo