హానర్ 8X పైన Rs.7,000 రూపాయల డిస్కౌంట్

Updated on 09-Aug-2019
HIGHLIGHTS

SBI క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్ కొనుగోలు చేసినట్లయితే, 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.

ఆగష్టు 8 నుండి 10 వ తేదీ వరకు జరుగనున్న, అమేజాన్ ఫ్రీడమ్ సేల్ నుండి హానర్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ల పైన భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఇందులో భాగంగా, హానర్ 8X స్మార్ట్ ఫోన్ పైన ఏకంగా 7,000 రూపాయల డిస్కౌంట్ ని ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ మంచి డ్యూయల్ కెమేరా సెటప్పుతో పాటుగా పెద్ద స్క్రీన్ మరియు భారీ బ్యాటరీతో వస్తుంది.  

ఈ హానర్ 8X  స్మార్ట్ ఫోన్ యొక్క 4GB మరియు 64GB వేరియంట్ ఈ సేల్ ద్వారా కేవలం రూ. 10,999 ధరతో మరియు 6GB మరియు 64GB వేరియంట్ కేవలం రూ. 12,999 ధరతో ఈ సేల్ ద్వారా అందిస్తోంది. అధనంగా, SBI క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్ కొనుగోలు చేసినట్లయితే, 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ మొత్తాన్ని కూడా తగ్గిస్తే, 9,999 ధరకే ఈ ఫోన్ను మీ సొంతం చేసుకోవచ్చు.

Honor 8X ప్రత్యేకతలు

ఈ హానర్ 8X ఒక 6.5 అంగుళాల ఫుల్ – HD + TFT IPS డిస్ప్లే  1080×2340 రిజల్యూషనుతో మరియు 18.7: 9 ఆస్పెక్టు రేషియోతో ఉంటుంది. ఇది ఒక ఆక్టా – కోర్ HiSilicon కిరిన్ 710 SoC తో నడుస్తుంది. ఇది రెండు రకాలైన , 4GB RAM మరియు 64GB అంతర్గత స్టోరేజి మరియు 6GB RAM తో, 64GB లేదా 128GB వాటి స్టోరేజి ఎంపికలతో వస్తుంది.  ఆండ్రాయిడ్ 8.1 ఓరెయో తో కూడిన EMUI 8.2.0 స్కిన్ పై నడుస్తుంది, ఈ మొత్తం ప్యాకేజీకి 3750mAh బ్యాటరీ శక్తినందిస్తుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ ఒక ద్వంద్వ కెమెరా సెటప్ను కలిగి ఉంటుంది. ఇక్కడ, ప్రాధమిక కెమెరాకి f / 1.8 ఎపర్చరుతో కూడిన 20MP సెన్సార్ ఉంది మరియు 2MP సెకండరీ సెన్సార్ ఉంది. ముందు భాగంలో, ఇది f / 2.0 ఎపర్చరుతో ఒక16MP లెన్స్తో వస్తుంది. ఇది 3.5mm హెడ్ఫోన్ జాక్ కలిగి ఉంటుంది.        

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :