నోకియా 7.2 మరియు 6.2 ని విడుదల చేసిన HMD గ్లోబల్

నోకియా 7.2 మరియు 6.2 ని విడుదల చేసిన HMD గ్లోబల్
HIGHLIGHTS

అలాగే, కంపెనీ కొత్త ఇయర్‌బడ్స్‌ను కూడా ప్రకటించింది.

IFA 2019 లో HMD గ్లోబల్ నుండి నోకియా 7.2 మరియు నోకియా 6.2 తో సహా విస్తృత శ్రేణి నోకియా ఉత్పత్తులను విడుదల చేసింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను ఈ రోజు బెర్లిన్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ రెండు ఫోన్లు వృత్తాకార మాడ్యూల్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి. అలాగే, కంపెనీ కొత్త ఇయర్‌బడ్స్‌ను కూడా ప్రకటించింది.

నోకియా 7.2 : ప్రత్యేకతలు

ఈ నోకియా 7.2 గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో HDR 10  మద్దతు కలిగిన ఒక 6.3 "FHD + వాటర్‌డ్రాప్ ప్యూర్‌డిస్ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 చిప్‌సెట్‌తో తో పనిచేస్తుంది, ఇది 6 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్‌తో జతచేయబడుతుంది, ఒక మైక్రో SD కార్డ్ ద్వారా దీని స్టోరేజిని 512GB వరకూ పెంచుకోవచ్చు.

ఆప్టిక్స్ పరంగా, ఈ నోకియా 7.2 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది: f/ 1.79 అపర్చరుగల ఒక 48 MP  కెమెరా + 8 MP  వైడ్ యాంగిల్ లెన్స్ + జియస్  ఆప్టిక్స్‌తో 5 MP డెప్త్ కెమెరాని కలిగి ఉంటుంది. ముందు భాగంలో Zeiss ఆప్టిక్స్ ఉన్న 20 MP  కెమెరా ఉంది.

ఈ నోకియా 7.2 స్మార్ట్ ఫోన్ ఒక 3,500 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. దీనికి ఆడియో జాక్ మరియు టైప్-సి పోర్ట్ కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 9 తో వస్తుంది. అయితే, ఇది ఆండ్రాయిడ్ 10 కోసం వెనువెంటనే సిద్ధంగా ఉంది, ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ ఫోన్ కాబట్టి.

నోకియా 6.2 : ప్రత్యేకతలు

నోకియా 6.2 లో, గొరిల్లా గ్లాస్ 3 రక్షణలో HDR 10 సపోర్ట్‌తో ఒక 6.3 "FHD + వాటర్‌డ్రాప్ ప్యూర్‌డిస్ప్లే ఉంది. ఒక మైక్రో SD కార్డ్ ఉపయోగించి 512GB వరకూ స్టోరేజిని పెంచుకోవచ్చు.

ఆప్టిక్స్ కోసం, ఈ నోకియా 6.2 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది: F / 1.8 లీన్స్‌తో కూడిన 16 MP కెమెరా + 8 MP  వైడ్ యాంగిల్ లెన్స్ + 5 MP డెప్త్ సెన్సార్ తో వుంటుంది. ముందు భాగంలో 8 MP  కెమెరా ఉంది.

నోకియా 6.2 ఒక 3500 బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 9 తో వస్తుంది  మరియు ఇది ఆండ్రాయిడ్ 10 కోసం సిద్ధంగా ఉంది, ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ వన్ కుటుంబానికి చెందినది. ఇది సిరామిక్ బ్లాక్ మరియు ఐస్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

నోకియా కొత్త నోకియా పవర్ ఇయర్బడ్స్‌ను కూడా ప్రకటించింది. ఇవి 1 మీటరు లోతులో కూడా 30 నిమిషాల వరకు జలనిరోధితంగా ఉంటాయి. ఇయర్‌బడ్స్‌లో బ్లూటూత్ 5.0, టచ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇయర్‌బడ్‌లు 50 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తాయి, ఛార్జింగ్ కేసులో 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 150 గంటల బ్యాటరీ లైఫ్ ఉందని కంపెనీ పేర్కొంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo