Nokia 4.2 యూజర్లకు శుభవార్త : ఈ ఫోన్ కోసం ఆండ్రాయిడ్ 10 అప్డేట్ విడుదల

Nokia 4.2 యూజర్లకు శుభవార్త :  ఈ ఫోన్ కోసం ఆండ్రాయిడ్ 10 అప్డేట్ విడుదల
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ కోసం స్థిరమైన Android 10 అప్డేట్ ను విడుదల చెయ్యడం ప్రారంభించింది.

నోకియా-బ్రాండెడ్ స్మార్ట్‌ ఫోన్లను తయారుచేసే సంస్థ HMD గ్లోబల్ తన నోకియా 4.2 కోసం కొత్త అప్డేట్ ను విడుదల చేసింది.అంతేకాదు,  ఈ అప్డేట్ అన్ని నోకియా 4.2 ఫోన్లకు క్రమంగా అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం స్థిరమైన Android 10 అప్డేట్ ను విడుదల చెయ్యడం ప్రారంభించింది. అయితే, ఇది రోల్-అవుట్ అయిన ఆరు నెలల తర్వాత కనిపించింది. HMD  గ్లోబల్ ఇప్పటికే తన స్మార్ట్‌ ఫోన్ లైనప్‌ లో ఎక్కువ భాగాన్ని ఆండ్రాయిడ్ యొక్క తాజా వెర్షన్‌ కు అప్‌డేట్ చేసింది.

కంపెనీ అప్‌ డేట్ చేసిన ఆండ్రాయిడ్ 10 అప్‌గ్రేడ్ రోడ్ మ్యాప్‌ ను షేర్ చేసిన సరిగ్గా ఒక నెల తర్వాత ఈ కొత్త అప్‌ డేట్ వస్తుంది. HMD గ్లోబల్ నోకియా 3.2 స్మార్ట్ ఫోన్ను అప్‌గ్రేడ్ చేసిన కొద్ది రోజుల తరువాత, 4.2 మొబైల్ ఫోనుకు కూడా ఈ అప్డేట్ ఇవ్వడం ప్రారంభించింది. 

HMD గ్లోబల్ యొక్క చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ జుహో సర్వికాస్ తన ట్విట్టర్ ద్వారా ఈ అప్డేట్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది కాకుండా, నోకియా కమ్యూనిటీ ఫోరమ్‌ లోని అధికారిక ప్రకటన పేజీకి ఈ లింక్‌ ను కూడా షేర్ చేశారు. ఈ ప్రకటన పోస్ట్‌ ను పరిశీలించిన తర్వాత, అప్డేట్ యొక్క రోల్-అవుట్ గురించి మనకు ఒక అవగాహన వస్తుంది. ముందుగా, ప్రపంచవ్యాప్తంగా 43 దేశాలలో కంపెనీ మొదటి దశలో అప్డేట్ విడుదల చేసింది. తరువాత, హెచ్‌ఎండి గ్లోబల్ భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్‌ లో అప్డేట్ ను విడుదల చేస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo