వన్‌ప్లస్ 9R గురించి మీరు తెలుసుకోవాల్సిన టాప్ 10 ఫ్యాక్ట్స్

HIGHLIGHTS

వన్‌ప్లస్ 9R కెమెరాలు మరియు పెర్ఫార్మెన్స్ పరంగా చాలా గొప్పగా వుంటుంది

120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన ఫ్లూయిడ్ డిస్ప్లే

సాటిలేని క్లారిటీతో మంచి ఫోటోలు తీస్తుందనడంలో సందేహం లేదు.

వన్‌ప్లస్ 9R గురించి మీరు తెలుసుకోవాల్సిన టాప్ 10 ఫ్యాక్ట్స్

వన్‌ప్లస్ 9R స్మార్ట్ ఫోన్ వన్‌ప్లస్ ఇండియాలో లాంచ్ చేసిన 9 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలో కూడా తక్కువ ధరకే వస్తుంది. అయితే, ఈ ఫోన్ కూడా కెమెరాలు మరియు పెర్ఫార్మెన్స్ పరంగా చాలా గొప్పగా వుంటుంది. కేవలం ఇది మాత్రమే కాకుండా మరెన్నో గొప్ప స్పెక్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ విడుదలయ్యింది. ఏప్రిల్ 14 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి మొదటి సరిగా అమ్మకాలకు రానున్న ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసులుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు ఇక్కడ చూడవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. ఈ వన్‌ప్లస్ 9R పెద్ద 6.55 అంగుళాల FHD + (2400X1080) డిస్ప్లేతో అందించబడుతుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన ఫ్లూయిడ్ డిస్ప్లే. ఇది గొరిల్లా గ్లాస్ 6 రక్షణతో వస్తుంది మరియు మీరు అత్యధికంగా 800 nits బ్రైట్నెస్ తో మంచి పిక్చర్ క్వాలిటీని ఆస్వాదించవచ్చు.

2. ఈ స్మార్ట్ ఫోన్ అతి సన్నని అంచులు కలిగి ఉంటుంది మరియు sRGB కి సపోర్ట్ చెయ్యగల ఫ్లూయిడ్ డిస్ప్లేతో ఉంటుంది. అధనంగా, ఈ ఫోన్ ఒక సన్నని పంచ్ హోల్ తో వస్తుంది. 

3. వన్‌ప్లస్ 9R వెనుకభాగంలో  48MP + 16MP + 5MP + 2MP  క్వాడ్ కెమేరా సెటప్పుతో వస్తుంది. ఇందులోని 48MP ప్రధాన కెమేరా f /1.7 ఎపర్చరు గల SonyIMX586 సెన్సార్ తో వస్తుంది. ఈ కెమెరా OIS మరియు EIS కు మద్దతునిస్తుంది. అంటే, సాటిలేని క్లారిటీతో మంచి ఫోటోలు మరియు ఎటువంటి షేక్ ఎఫెక్ట్ లేని క్లియర్ వీడియోలను తీస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఇందులోని 16MP సూపర్ వైడ్ యాంగిల్ సెన్సార్ f /2.2 ఎపర్చరుతో వస్తుంది మరియు  5MP మ్యాక్రో కెమేరాకి జతగా 2MP మోనోక్రోమ్ సెన్సారుతో వస్తుంది. ఈ కెమెరా సెటప్ PDAF మరియు CAF వంటి మల్టి ఆటో ఫోకస్ సపోర్ట్ తో వస్త్తుంది.

4. ముందుభాగంలో ఒక గొప్ప 16MP సెల్ఫీ కెమేరాని SonyIMX471 సెన్సార్ తో వస్తుంది కాబట్టి మంచి సెల్ఫీలను తీసుకోవచ్చు.  అంతేకాకుండా, HDR తో కూడా వీడియోలను కూడా తీసుకోవచ్చు.  

5. ఈ ఫోన్ ఒక 4,500 mAh బ్యాటరీతో వస్తుంది మరియు ఇది వేగవంతంగా ఛార్జ్ చెయ్యగల 65W వ్రాప్ ఛార్జ్ టెక్నలాజితో వస్తుంది. ఈ టెక్నాలజీతో ఈ ఫోన్ను చాలా వేగంగా 100% ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఎంత వేగంగా అంటే కేవలం 39 నిముషాల్లో ఈ ఫోన్ 100% ఛార్జ్ చేసుకోవచ్చు.

6. వన్‌ప్లస్ 9R లేటెస్ట్ ఫాస్ట్ క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 870 ఆక్టా కోర్ ప్రాసెసరుతో వస్తుంది. ఇది గరిష్టంగా 3.2GHz వరకూ క్లాక్ స్పీడ్ అందిస్తుంది. అలాగే, స్పీడుగా పనిచేయగల RAM తో వస్తుంది. ఇది 7nm సాంకేతికతతో వస్తుంది మరియు జతగా 12GB ర్యామ్ తో వస్తుంది. అంతర్గతంగా, ఈ స్మార్ట్ ఫోన్ 256GB UFS 3.1 ఫాస్ట్ స్టోరేజిని అఫర్ చేస్తోంది.

7. ఈ ఫోన్ యొక్క స్క్రీన్ HDR10+ సపోర్ట్ తో వస్తుంది. ఇది మాత్రమే కాదు, ఈ స్క్రీన్ SGS Eye Care డిస్ప్లే సర్టిఫికేషన్ తో వస్తుంది.    దానితో మీరు ఉన్నతమైన మరియు ఉట్టిపడే కళాత్మకమైన రంగులను చూడవచ్చు. అధనంగా, మీ కళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తక్కువ బ్లూ కలర్ తో ఈ డిస్ప్లే వస్తుంది.

8.ఈ ఫోన్, 8.4MM మందంతో సన్నగా మరియు కార్బన్ బ్లాక్ ఐస్ మరియు లేక్ బ్లూ వంటి రెండు రంగులలో లభిస్తుంది. సౌండ్ పరంగా , ఇది Dolby Atmos  సౌండ్ టెక్నాలజీ తో వస్తుంది మరియు నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ గల డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. 

9. ఇందులో, సెక్యూరిటీ ఫీచర్లుగా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మరియు పేస్ అన్లాక్ ఫీచర్లను అందించారు. అంటే ఇది స్టైల్ మరియు సేఫ్టీ పరంగా గొప్పగా ఉంటుంది.

10. వన్‌ప్లస్ 9R వేరియంట్ ధర   

1. Oneplus 9R –  8GB RAM + 128 GB స్టోరేజి ధర – 39,999 

2. Oneplus 9R –  12GB RAM + 256 GB స్టోరేజి ధర – 43,999 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo