POCO X2 గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 07 Feb 2020
POCO X2 గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

New Vostro 14 5490 Laptop with 10th Generation Intel core process

It has a RAM of 8GB and 2GB GDDR5 graphics memory. Save Rs.17,000 on this deal

Click here to know more

HIGHLIGHTS

ఇండియ మార్కెట్లోకి మరోక అద్భుతమైన స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ను, POCO సంస్థ కేవలం మిడ్ రేంజ్ ధరలో విడుదల చెయ్యడం, అదీకూడా గొప్ప ప్రత్యేకతలో పాటుగా తీసుకురావడం, అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన విషయంగా చెప్పొచ్చు. ఈ ఫోన్ చాలా మంచి మరియు విలక్షణమైన ప్రత్యేకతలతో వస్తుంది. అయితే, వాటిలో నేను ఇప్పుడు చెప్పబోయే 5 ప్రత్యేకతల గురించి చూస్తే  మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ ఫోన్ కెమేరా, గేమింగ్ మరియు స్పీడ్ ఇవన్నీ వీటిలో అంశాలుగా ఉండనున్నాయి. అందుకే, ఇక ఈ ఫోన్ గురించి మనం తెలుసుకోవాల్సిన 5 టాప్ ఫీచర్లను ఇక్కడ తెలుసుకోండి.

1. డిస్ప్లే

ఈ POCO X2 స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లేని ప్రీమియం ఫోన్లలో మాత్రమే అందించే డిజైనుతో అందించింది. అదేమిటంటే, డ్యూయల్ ఇన్ డిస్ప్లే కెమేరా (పంచ్ హోల్)   ప్రస్తుతం ఈ ధరలో ఈ ఫీచరుతో వచ్చిన మొదటి స్మార్ట్ ఫోన్ ఇదొక్కటి మాత్రమే అవుతుంది. ఇది ఒక 6.67 అంగుళాల పరిమాణం డిస్ప్లేని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యొ క్క ప్రొటెక్షన్ తో మరియు 20:9 ఆస్పెక్ట్ రేషియాతో వస్తుంది. ఇక దీని డిస్ప్లే యొక్క స్పెషల్ ఫీచర్ విషయానికి వస్తే, ఇది HDR 10 కి సపోర్ట్ చేయగల 120Hz డిస్ప్లేతో వస్తుంది.                                       

2. ప్రాసెసర్

ఇది క్వాల్కామ్ యొక్క గేమింగ్ ప్రత్యేకమైన ప్రాసెసర్ అయినటువంటి, స్నాప్ డ్రాగన్ 730G  ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది Adreno 618 GPU తో మీకు మంచి గ్రాఫిక్స్ అందిస్తుంది మరియు PUBG వంటి గేమింగ్ అల్ట్రా హై డెఫీనేషన్ ఆడవచ్చు.  ఈ POCO X2 స్మార్ట్  ఫోనులో ఒక లిక్విడ్ కూలింగ్ టెకెబనాలజీని కూడా కలిగి ఉంటుంది. దీని విశేషం ఏమిటంటే, ఇది ఫోన్ను వేడికాకుండా చల్లబరచడంలో మంచి పాత్ర వహిస్తుంది. ఇక ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడితే, ఇది గరిష్ఠంగా 2.2 Ghz వరకూ క్లాక్ స్పీడ్ అందిస్తుంది. 

3. ర్యామ్ & స్టోరేజి

ఈ ఫోన్ను రెండు ర్యామ్ వేరియంట్ ఎంపికలతో ప్రకటించింది. అవి : 6GB ర్యామ్ +64GB స్టోరేజి, 6GB ర్యామ్ +128GB మరియు 8GB + 256GB స్టోరేజి వంటి రెండు వేరియంట్లు . వీటి ధరలు ఈ క్రింద చూడవచ్చు.

1. POCO X2 6GB ర్యామ్  + 64GB స్టోరేజి : Rs.15,999/-

2. POCO X2 6GB ర్యామ్  + 128GB స్టోరేజి : Rs.16,999/-

3. POCO X2 8GB ర్యామ్  + 256GB స్టోరేజి : Rs.19,999/-  

4. కెమేరా

ఈ ఫోన్ లో వెనుక క్వాడ్ కెమెరా సెటప్పును అందించింది. ఈ క్వాడ్ కెమెరాలో, f/1.89 ఎపర్చర్ కలిగిన ఒక 64MP ప్రధాన కెమెరాని Sony IMX686 సెన్సారుతో ఇంచింది. ఈ ధరలో ఈ కెమేరాతో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ కూడా ఇదే అవుతుంది. ఇక రెండవ కెమేరా గురించి చూస్తే, ఇది ఒక f/2.2 అపర్చరు కలిగిన 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, జతగా 2MP మ్యాక్రో మరియు నాలుగవ కెమేరాగా ఒక 2MP డెప్త్ సెన్సార్ ని కలిగి ఉంటుంది.  ఇక సెల్ఫీ కెమేరా కేమెరా విశాయిని వస్తే, ముందు డ్యూయల్ సెల్ఫీలే కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది. ఇందులో, ఒక 20MP మరియు 2MP  సెన్సార్లు జతగా గల డ్యూయల్ సెల్ఫీ కెమెరా ఇచ్చింది. ఈ కెమేరాతో 960fps వద్ద సూపర్ స్లో మోషన్ వీడియోలను తీయ్యోచ్చు మరియు ఫోటోలను అద్భుతంగా చిత్రీకరించవచ్చు.

5. బ్యాటరీ

ఈ పోకో X2 ని ఒక అతిపెద్ద 4,700mAh బ్యాటరీతో విడుదల చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క బ్యాటరీని అత్యంత వేగవంతమైన 27W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో పాటుగా, బాక్స్ లోనే ఒక 27W ఛార్జర్ కూడా అందించింది.  అలాగే, ఈ ఫోన్ మీకు రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో కూడా వస్తుంది.    

logo
Raja Pullagura

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

టాప్ -ప్రోడక్టులు

హాట్ డీల్స్

మొత్తం చూపించు

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.