చౌక ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు : కెమేరా, బ్యాటరీ మరియు ప్రాసెసర్ విభాగాల్లో
మంచి స్పెసిఫికేషన్లు కలిగిన స్మార్ట్ ఫోన్లు సైతం మనకు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి.
ముందుగా, ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనాలంటే చాలా డబ్బును సమర్పించుకోవాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు మారుతున్నా టెక్నలాజి మరియు మొబైల్ తయారీ కంపెనీల మధ్య పెరుగుతున్న పోటీ కారణముగా, మంచి స్పెసిఫికేషన్లు కలిగిన స్మార్ట్ ఫోన్లు సైతం మనకు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. అందుకోసమే, వాటిలో కొన్ని ఉత్తమైన స్మార్ట్ ఫోన్ల ఫోన్ల గురించి చుడనున్నాము.
Survey1. ఇన్ఫినిక్స్ హాట్ 8
ఈ INFINIX HOT 8 స్మార్ట్ ఫోన్ ఒక 6.52 అంగుళాల HD+ IPS డ్యూ డ్రాప్ నోచ్ మరియు 720X1520 p రిజల్యూషనుతో వస్తుంది మరియు .ఇది 450 నైట్స్ బ్రైట్నెస్ టి వస్తుంది. అంతేకాదు , ఇది ఒక Eye Care మోడ్ మరియు AI రీడ్ మోడ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ను ఆండ్రాయిడ్ 9 ఫై మీద ఆధారితంగా XOS 5.0 చీతా తో ప్రారంభించింది మరియు ఒక పెద్ద 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 2.0Ghz వరకూ క్లాక్ అందించగల ఒక Helio P22 Octa-core 64-bit ప్రాసెసరుతో వస్తుంది. దీనికి జతగా, 4GB ర్యామ్ మరియు 64GB అంతర్గత స్టోరేజ్ అనుసంధానంతో వస్తుంది.అధనంగా 256GB స్టోరేజిని ఒక మెమొరీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు మరియు డ్యూయల్ VoLTE కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ కేవలం రూ.6,999 ధరకే లభిస్తుంది .
వెనుకభాగంలో 13 మెగాపిక్సెల్ (f1.8) ప్రధాన కెమేరాకి జతగా మరొక 2MP డెప్త్ సెన్సార్ మరియు ఒక లో లైట్ సెన్సార్ జతగా కలిపిన ఒక ట్రిపుల్ రియర్ కెమేరాని ఇందులో అందించారు. ఆటో సీన్ డిటెక్షన్, AI పోర్ట్రైట్, AI HDR, AI బ్యూటీ, AI Bokeh మరియు నైట్ షాట్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. ముందుభాగంలో సెల్ఫీల కోసం ఒక 8-MP AI కెమెరాని ఒక ఫ్లాష్ ని కలిగి ఉంది, దీని ఎపర్చరు f2.0 గా ఉంటుంది.
2. అసూస్ జెన్ ఫోన్ మాక్స్ M2
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 8.1 OS తో పనిచేస్తుంది మరియు వెనుక భాగంలో ఒక ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది. ఇది స్నాప్ డ్రాగన్ 632(14nm)ప్రోసెసరుకి జతగా అడ్రినో 506 గ్రాఫిక్స్ మరియు 3GB ర్యామ్ తో శక్తివంతంగా ఉంటుంది. ఇది వెనుక 13+5MP డ్యూయల్ కెమేరా మరియు ముందు 8MP సెన్సారును కలిగి ఉంటుంది.
3. రియల్మీ C 2
ఈ రియల్మీ C 2 మొబైల్ ఫోన్ HD+ రిజల్యూషన్ కలిగిన ఒక 6.1-అంగుళాల డ్యూడ్రాప్ నాచ్‌తో లాంచ్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ 2.0GHz క్లాక్ స్పీడ్ తో పనిచేసే ఆక్టా-కోర్ Helio P 22 ప్రాసెసర్‌తో ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్‌లో మీకు 4000 mAh సామర్థ్యం గల బ్యాటరీ ఇవ్వబడింది. ఇది Color OS 6.0 స్కిన్ తో ఆండ్రాయిడ్ 9.0 తో లాంచ్ చేశారు. ఇక కెమేరా విభాగంలో, వెనుక డ్యూయల్ కెమేరా మరియు మంచి సెల్ఫీ కెమేరాతో వుంటుంది.
4. శామ్సంగ్ గెలాక్సీ M 10
శామ్సంగ్ నుండి సరికొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్, 13MP +5MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 5MP సెన్సార్ కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ ఒక 6.22 అంగుళాల వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే తో వస్తుంది మరియు దీనికి అదనంగా, 3400mAh బ్యాటరీ వంటి ఫిచర్లను కలిగివుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సంస్థ యొక్క ఎక్సినోస్ 7870 SoC చేత శక్తిని కలిగి ఉంది మరియు 16GB మరియు 32GB నిల్వతో 2GB లేదా 3GB RAM ఎంపికలలో కొనుగోలు చేయవచ్చు.
5. షావోమి రెడ్మి7
ఆరా స్మోక్ డిజైన్‌తో, ఈ రెడ్మి 7 స్మార్ట్‌ఫోన్ను కంపెనీ విడుదల చేసింది మరియు ఈ ఫోన్ను లూనార్ రెడ్, కామెట్ బ్లూ మరియు ఎక్లిప్స్ బ్లాక్ అనే మూడు రంగులలో విడుదల చేశారు. ఈ ఫోన్ ఒక 6.26-అంగుళాల డాట్ నాచ్ డిస్ప్లేను కలిగి ఉంది, ఇది 19: 9, HD + LCD IPS డిస్ప్లే మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణను కూడా పొందుతుంది.
ఒక క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 632 మరియు 4000 ఎంఏహెచ్ బ్యాటరీలతో ఈ రెడ్మి 7 లాంచ్ చేయబడింది, ఇది 2 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందించగలదని కంపెనీ తెలిపింది. ఇక కనెక్టివిటీ కోసం, 2 + 1 సిమ్ కార్డ్ స్లాట్‌లను కలిగి ఉంది మరియు మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజిని 512GB కి పెంచవచ్చు. ఇది కాకుండా, డివైస్ 3.5 హెడ్‌ఫోన్ జాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, IR బ్లాస్టర్ మరియు స్ప్లాష్ ప్రూఫ్‌ను P2i నానో కోటింగ్ కూడా ఇవ్వబడింది.