నెలకు రూ.188 చెల్లిస్తే చాలు ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మీ సొంతం

నెలకు రూ.188 చెల్లిస్తే చాలు ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మీ సొంతం
HIGHLIGHTS

చాలా తక్కువ EMI

నెలకు 200 కంటే తక్కువ చెల్లింపు

స్టాండర్డ్ EMI తో లభిస్తుంది

ఇటీవల జియోనీ ఇండియాలో విడుదల చేసిన Gionee Max చాలా తక్కువ ధరకే లభిస్తుంది. అయితే, నెల నెల వాయిదాల పద్దతిలో, అంటే EMI తో కొనాలనుకుంటే చాలా తక్కువ EMI తో ఈ ఫోన్ ను మీ సొంతం చేసుకోవచ్చు. ఎంత తక్కువ EMI అంటే నెలకు 200 కంటే తక్కువ చెల్లింపుతోనే ఈ ఫోన్ ను కొనుగోలు చెయవచ్చు. మరి దీని గురించి చూద్దామా..!                       

Gionee Max: ప్రస్తుత అఫర్ ధర

జియోనీ మాక్స్ 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ తో తీసుకురాబడింది మరియు దీని ప్రస్తుత అఫర్ ధర రూ .5,499. అయితే, Flipkart నుండి కేవలం రూ.188 రూపాయల ప్రారంభ స్టాండర్డ్ EMI తో లభిస్తుంది. ఈ ఫోన్ బ్లాక్, రెడ్ మరియు రాయల్ బ్లూ వంటి మూడు రంగులలో ప్రవేశపెట్టబడింది.

ఈ జియోనీ మాక్స్ స్మార్ట్ ఫోన్ ను అన్ని ప్రధాన బ్యాంక్స్ క్రెడిట్ కార్డుతో EMI పైన కొనుగోలు చెయ్యవచ్చు. అయితే, Flipkart Axis Bank EMI ప్లాన్ నుండి మాత్రమే అన్నింటి కంటే తక్కువ EMI తో 36 నెలల ఇన్స్టాల్మెంట్స్ తో కొనవచ్చు.  ఇక ఇతర బ్యాంకుల EMI విషయానికి వస్తే,  బ్యాంక్ వడ్డీ మరియు ఇన్స్టాల్ మెంట్ నెలలను బట్టి 267 లేదా 259 రూపాయల ప్రారంభ EMI తో కూడా పొందవచ్చు.

Gionee Max: స్పెసిఫికేషన్

ఈ జియోనీ మాక్స్ ఆండ్రాయిడ్ 10 లో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ లో 6.1-అంగుళాల హెచ్‌డి + డిస్ప్లే ఉంది, దీనికి 2.5 డి కర్వ్డ్ గ్లాస్ స్క్రీన్ రక్షణ ఇవ్వబడింది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ Unisoc 9863A SoC శక్తిని కలిగి ఉంది మరియు 2GB RAM తో జత చేయబడింది. ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా అందించబడింది, దీనిలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది.

జియోనీ మాక్స్ 32 జిబి స్టోరేజ్ కలిగి ఉంది, దీనిని మైక్రో ఎస్డి కార్డ్ నుండి 256 జిబి వరకు పెంచవచ్చు. ఈ ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది మరియు ఇది రివర్స్ ఛార్జింగ్ కి మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ కోసం, జియోనీ మాక్స్ 4 జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ 4.2, జిపిఎస్ / ఎ-జిపిఎస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ మరియు మైక్రో యుఎస్‌బి పోర్ట్‌ను కలిగి ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo