నెలకు రూ.669 చెల్లించి ఈ లేటెస్ట్ శామ్సంగ్ 5G మీ సొంతం చేసుకోవచ్చు. మనం మాట్లాడుకుంటోంది శామ్సంగ్ గెలాక్సీ M13 5G స్మార్ట్ ఫోన్ EMI అఫర్ గురించి. శామ్సంగ్ గెలాక్సీ M13 అమెజాన్ ప్లాట్ఫామ్ నుండి అతితక్కువ నెల వాయిదా (EMI) పద్దతిలో అందుబాటులో వుంది. వాస్తవానికి, ఇటీవల అమెజాన్ అందించిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ఈ శామ్సంగ్ గెలాక్సీ M13 స్మార్ట్ ఫోన్ 2,000 భారీ డిస్కౌంట్ అఫర్ తో అమ్ముడయ్యింది. అయితే, ఇప్పుడు ఈ ఫోన్ రూ.13,999 ధరతో లభిస్తోంది. కానీ ఈ ఫోన్ ను అతితక్కువ EMI అప్షన్ తో పొందే వీలుంది.
Survey
✅ Thank you for completing the survey!
శామ్సంగ్ గెలాక్సీ M13 సిరీస్: ధర మరియు ఆఫర్లు
శామ్సంగ్ గెలాక్సీ M13 5G స్టార్టింగ్ వేరియంట్ 4జీబీ మరియు 64జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.13,999 ధరతో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను పైన అన్ని ప్రధాన బ్యాంక్స్ క్రెడిట్/డెబిట్ కార్డ్ EMI ఆఫర్ అందుబాటులో వుంది. కేవలం రూ.669 రూపాయల అతితక్కువ EMI తో ఈ ఫోన్ ను మీ సొంతం చేసుకోవచ్చు. ఇది 24 నెలల EMI మరియు బ్యాంక్ ను బట్టి EMI అమౌంట్ లో మార్పులు ఉండవచ్చు. అంతేకాదు, అన్ని బ్యాంకులు కూడా స్టాండర్డ్ EMI పేమెంట్స్ పైన వడ్డీ వసూలు చేస్తాయి మరియు బ్యాంక్ ను బట్టి ఈ వడ్డీ రేట్లలో మార్పు ఉంటుంది. EMI అప్షన్ ద్వారా ఫోన్ తీసుకునే ముందుగా బ్యాంక్ కండిషన్ లను పూర్తిగా చదవడం మంచిది. Buy From Here
శామ్సంగ్ గెలాక్సీ M13 5G స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ 5G చిప్ సెట్ Dimensity 700 శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ కూడా ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది మరియు One UI 3.1 స్కిన్ తో వుంటుంది.
కెమెరాల పరంగా, ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. ఇందులో, 50ఎంపీ మైన్ కెమెరాకి జతగా డెప్త్ కెమెరా ఉంటుంది. ఇక సెల్ఫీల కోసం ఈ ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీని 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.