HIGHLIGHTS
Xiaomi మరోకొత్త ప్రయోగం
కొత్త ఫోన్ ను ఫోన్ నాలుగు వైపులా డిస్ప్లే ఉండేలా తీసుకురాబోతోంది.
క్వాడ్ కర్వ్డ్ వాటర్ ఫాల్ డిస్ప్లే
కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టడంలో షియోమి తన వంతు కృషి చేస్తుంది. ఇప్పటికే, షియోమి సంస్థ చాలా స్మార్ట్ ఫోన్ లను ఇండస్ట్రీ ఫస్ట్ ఫీచర్లతో లాంచ్ చేసింది. అతితక్కువ ధరలో మొదటి 48MP స్మార్ట్ ఫోన్ కెమెరాని షియోమినే ప్రకటించింది. అంతేకాదు, ఇటువంటి చాలా ఫీచర్లతో షియోమి సంస్థ అనేకమైన ఫోన్లను ప్రవేశపెట్టింది.
Surveyఇప్పుడు కూడా, షియోమి సంస్థ అదేబాటలో మరోకొత్త ప్రయోగం చెయ్యడానికి సిద్దమయ్యింది. అయితే, ఈసారి ప్రవేశపెట్టబోయే కొత్త ఫోన్ ను ఫోన్ నాలుగు వైపులా డిస్ప్లే ఉండేలా తీసుకురాబోతోంది. అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఫోన్ మొత్తం డిస్ప్లే వుంటుంది. ఇప్పటికే, 20,000 కంటే తక్కువ ధరకే 5G స్మార్ట్ ఫోన్స్ తీసుకొచ్చిన షావోమికి ఈ 2021 లో మరింత చాలంజింగ్ గా వుంటుంది.
ఇక ఈ కాన్సెప్ట్ ఫోన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ గురించిన టాపిక్ షోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ఫోన్ గురించి షియోమి విడుదల చేసిన టీజర్ లో క్వాడ్ కర్వ్డ్ వాటర్ ఫాల్ డిస్ప్లే అని చెబుతోంది మరియు ఈ ఫోన్ యొక్క మరే ఇతర వివరాలను తెలియపరచ లేదు. కానీ, ఈ షియోమి కాన్సెప్ట్ ఫోన్ మాత్రం నాలుగు వైపులా డిస్ప్లేతో, ఎటువంటి పోర్ట్స్ లేకుండా కనిపిస్తోంది.