Flipkart ఇయర్ ఎండ్ సేల్ : Moto E6s పైన భారీ డిస్కౌంట్
ఈ Sale ద్వారా కేవలం Rs.5,999 ధరకే అందుకోవచ్చు.
ఇండియాలోని బడ్జెట్ వినియోగదారులను ఆకట్టుకునేలా కేవలం రూ. 7,999 రూపాయల ధరలో మోటోరోలా తన Moto E6s స్మార్ట్ ఫోన్ను తీసుకొచ్చింది. ఈ స్మార్ ఫోనులో డ్యూయల్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.అయితే, Flipakrt లో డిసెంబర్ 21 నుండి డిసెంబర్ 23 వ తేదీ వరకూ నిర్వహించనున్న "ఇయర్ ఎండ్ సేల్" సందర్భంగా, ఈ స్మార్ట్ ఫోన్ పైన గరిష్టంగా 2,000 రుపాయల భారీ డిస్కౌంట్ ని ప్రకటించింది. అధనంగా, ICICI బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డు మరియు EMI తో కొనేవారికి 10% క్యాష్ బ్యాక్ కూడా డిస్కౌంట్ కూడా అందిస్తుంది. అంటే, ఈ Moto E6s స్మార్ట్ ఫోన్ను ఈ Sale ద్వారా కేవలం Rs.5,999 ధరకే అందుకోవచ్చు.
SurveyMoto E6s ప్రత్యేకతలు
Moto E6s మొబైల్ ఫోన్ ఒక 6.1-అంగుళాల HD + మాక్స్ విజన్ డిస్ప్లేని కలిగి ఉంది మరియు ఈ డిస్ప్లే 19.5: 9 యాస్పెక్ట్ రేషియోని అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోనులో వెనుక ఒక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో, ఒక ప్రధాన 13 MP కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ వంటివి ఉన్నాయి. ఈ కెమెరాలో బోకె మోడ్ మరియు ల్యాండ్‌స్కేప్ మోడ్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీ ప్రియుల కోసం, ఈ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాని అందించారు.
ముఖ్యంగా, ఈ స్మార్ట్ ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ తో ప్రారంభించబడింది మరియు ఇది కొత్త అప్డేట్ లను ముందుగా అందుకుంటుంది. ఇది కాకుండా, మీడియాటెక్ హెలియో పి 22 SoC శక్తితో ఈ స్మార్ట్ ఫోన్ నడుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ తో వస్తుంది, వీటికి తోడు మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 512 జీబీకి వరకూ మెమోరిని పెంచవచ్చు.
ఇక ఫోన్ భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్‌లాక్ కలిగి ఉంది మరియు తొలగించగల బ్యాక్ కవర్ మరియు బ్యాటరీతో ఈ ఫోన్‌ను తీసుకువచ్చారు. సంస్థ ప్రకారం, త్వరలో ఈ ఫోను యొక్క వెనుక కవర్ ఫ్లిప్‌కార్ట్‌లో వేరే డిజైన్‌లో అందించబడుతుంది. రిచ్ క్రాన్బెర్రీ మరియు పాలిష్ గ్రాఫైట్ కలర్లో ఈ ఫోన్ ప్రారంభించబడింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile