Flipkart Sasa Lele Sale బిగ్గెస్ట్ డీల్ గా iPhone 17: నెవర్ బిఫోర్ ధరలో ఫోన్ అందుకోండి.!

HIGHLIGHTS

Flipkart Sasa Lele Sale బిగ్గెస్ట్ డీల్ గా iPhone 17 డీల్ ని అనౌన్స్ చేసింది

ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి నెవర్ బిఫోర్ ధరలో ఐఫోన్ 17 అందుకోండని ఫ్లిప్ కార్ట్ భారీ టీజర్ విడుదల

యూజర్ల కోసం సేల్ స్టార్ట్ కావడానికి ముందే ఈ ఫోన్ సేల్ ను రివీల్ చేసింది

Flipkart Sasa Lele Sale బిగ్గెస్ట్ డీల్ గా iPhone 17 డీల్ ని అనౌన్స్ చేసింది. ఐఫోన్ లేటెస్ట్ సిరీస్ అయిన ఐఫోన్ 17 సిరీస్ బేసిక్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి నెవర్ బిఫోర్ ధరలో ఫోన్ అందుకోండని ఫ్లిప్ కార్ట్ భారీ టీజర్ విడుదల చేసింది. ఈ కొత్త సేల్ టీజర్ తో ఈ అప్ కమింగ్ సేల్ పై అంచనాలు పెంచింది. అంతేకాదు, యూజర్ల కోసం సేల్ స్టార్ట్ కావడానికి ముందే ఈ ఫోన్ సేల్ ను రివీల్ చేసింది.

Flipkart Sasa Lele Sale : iPhone 17 Deal

ఫ్లిప్ కార్ట్ 2026 అప్ కమింగ్ బిగ్ సేల్ సాసా లేలే సేల్ 2026 ప్రకటించింది. ఈ సేల్ మే 9వ తేదీ నుంచి ప్రారంభం చేస్తుంది. అయితే, బ్లాక్ మరియు ప్లస్ యూజర్లకు ఒకరోజు ముందే ఈ సేల్ యాక్సెస్ అందిస్తుంది. ఫ్లిప్ కార్ట్ యొక్క ఈ అప్ కమింగ్ సేల్ బిగ్గెస్ట్ డీల్ గా iPhone 17 డీల్ ని అనౌన్స్ చేసింది. రూ. 82,900 ప్రారంభ ధరతో లభించే ఈ ఫోన్ ను ఈ సేల్ నుంచి కేవలం రూ. 71,900 రూపాయల అతి తక్కువ ధరలో అందుకోవచ్చని తెలిపింది.

అంతేకాదు, ఈ రోజు నుంచి ఈ డీల్ ను కూడా తీసుకొచ్చింది. డీల్ విషయానికి వస్తే, ఐఫోన్ 17 బేసిక్ వేరియంట్ రూ. 82,900 రూపాయల ఆఫర్ ధరతో ఉండగా ఈ ఫోన్ పై రెండు బిగ్ డీల్స్ అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ పై గరిష్టంగా రూ. 5,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ అందించింది.

ఇది కాకుండా ఈ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ Axis మరియు ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డ్స్ రూ. 6,995 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఫోన్ పై రూ . 11,995 భారీ డిస్కౌంట్ మీకు లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ లేటెస్ట్ ఐఫోన్ ని కేవలం రూ. 70,995 ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ ఆఫర్ ధరలో ఐఫోన్ 17 స్మార్ట్ ఫోన్ ను ఎన్నడూ చూడలేదు.

Also Read: భారీ ఆఫర్స్ తో Amazon Great Summer Sale అనౌన్స్ చేసిన అమెజాన్.!

iPhone 17 : ఫీచర్స్

ఐఫోన్ 17 ఫోన్ 6.3 ఇంచుల సూపర్ రెటీనా XDR OLED స్క్రీన్ ను 120Hz ప్రో మోషన్ రిఫ్రెష్ రేట్ మరియు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆపిల్ యొక్క లేటెస్ట్ A19 chip తో నడుస్తుంది మరియు iOS 26 లేటెస్ట్ సాఫ్ట్ వేర్ తో వస్తుంది. ఈ ఫోన్ 48MP డ్యూయల్ ఫ్యూజన్ రియర్ కెమెరా మరియు 18MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్, అల్యూమినియం బాడీ మరియు గ్లాస్ బ్యాక్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :