LG 55 ఇంచ్ AI Smart Tv పై ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది.!

HIGHLIGHTS

LG 55 ఇంచ్ AI Smart Tv పై ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్

ఈరోజు లభిస్తున్న 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ డీల్

ఈ స్మార్ట్ టీవీ 7 AI Processor 4K Gen8 ప్రొసెసర్ తో పని చేస్తుంది

మంచి ఆఫర్ ధరలో పెద్ద స్మార్ట్ టీవీ కొనాలని సెర్చ్ చేస్తున్నారా, అయితే, మీకోసమే ఈ గుడ్ న్యూస్. ఎందుకంటే, LG 55 ఇంచ్ AI Smart Tv పై ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన బిగ్ డిస్కౌంట్ ఆఫర్ తో లేటెస్ట్ బ్రాండెడ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీని మంచి ఆఫర్ ధరలో మీ సొంతం చేసుకోవచ్చు. మరి ఈరోజు లభిస్తున్న ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేద్దామా.

LG 55 ఇంచ్ AI Smart Tv: డీల్

ఎల్ జి గత సంవత్సరం విడుదల చేసిన 55 ఇంచ్ UA8200 మోడల్ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ స్మార్ట్ టీవీ 38% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 40,990 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ చేసిన ఫ్లిప్ కార్ట్ ఈ టీవీ పై Axis, HDFC, SBI మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు రూ. 2,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 38,990 రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది.

Also Read: LPG Cylinder New Rules: మే 1వ తేదీ నుంచి సిలిండర్ బుకింగ్ మరియు ప్రైస్ లో మార్పులు.!

LG 55 ఇంచ్ AI Smart Tv: ఫీచర్స్

ఇది ఎల్ జి లేటెస్ట్ గా అందించిన స్మార్ట్ టీవీ మరియు స్టన్నింగ్ కలర్స్ మరియు బ్రైట్నెస్ అందించే 7 AI Processor 4K Gen8 ప్రొసెసర్ తో పని చేస్తుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు UHD 4K (3840 x 2160) రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10, HLG మరియు 4K అప్ స్కేలింగ్ వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ 2 జీబీ ర్యామ్ మరియు 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ముఖ్యంగా, ఈ టీవీ AI మ్యాజిక్ రిమోట్ తో వస్తుంది. ఇది Ai సెర్చ్, ఏఐ చాట్ బాట్ మరియు ఏఐ వాయిస్ ఐడి వంటి గొప్ప ఏఐ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

సౌండ్ పరంగా, ఈ లేటెస్ట్ ఎల్ జి స్మార్ట్ టీవీ రెండు స్పీకర్లు కలిగి 20W సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ డాల్బీ అట్మోస్, AI Sound Pro (వర్చువల్ 9.1.2) సపోర్ట్ మరియు క్లియర్ వాయిస్ ప్రో వంటి సౌండ్ ఫీచర్స్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ బిల్ట్ ఇన్ Wi-Fi, USB, బ్లూటూత్, HDMI, ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :