flipkart offers rs 18000 big discount on iPhone 17 Pro from goat sale
ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ సేల్ GOAT Sale నుంచి ఈరోజు iPhone 17 Pro ఫోన్ పై రూ. 18,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ చేసింది. ఇది ఆపిల్ నుంచి వచ్చిన హై ఎండ్ ఫోన్ మరియు గొప్ప ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. డిజైన్ మొదలుకొని కెమెరా మరియు ఏఐ వరకు ఈ ఫోన్ అనేక ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఆపిల్ ఫోన్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి మంచి ఆఫర్ ధరలో అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది.
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో ఇండియాలో రూ. 1,34,900 రూపాయల బేసిక్ ప్రైస్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ నుంచి రూ. 8,000 రూపాయల డిస్కౌంట్ అందించింది రూ. 1,26,900 ఆఫర్ ధరలో లిస్ట్ చేసింది. ఇది కాకుండా ఈ ఫోన్ పై రూ. 10,000 రూపాయల Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ఈ రోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 1,16,900 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.
ఐఫోన్ 17 ప్రో ప్రీమియం డిజైన్ మరియు శక్తివంతమైన పెర్ఫార్మెన్స్ అందించే చోయ్ప్ తో పాటు అత్యాధునిక కెమెరా సిస్టమ్ కలిగి ఉంటుంది. ఈ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ లో 6.3 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే ఉంది. ఈ స్క్రీన్ 120Hz ప్రో మోషన్ రిఫ్రెష్ రేట్, అత్యధిక బ్రైట్ నెస్ తో అద్భుతమైన విజువల్ అనుభవాన్ని అందిస్తుంది.
ఈ ఫోన్ ను ఆపిల్ యొక్క తాజా A19 Pro చిప్ 256 GB స్టోరేజ్ తో అందించింది. ఈ ఫోన్ హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్ మరియు వీడియో ఎడిటింగ్ వంటి పనులు సునాయాసంగా నిర్వహిస్తుంది. ఈ ఫోన్ Ceramic Shield 2 రక్షణ, USB-C పోర్ట్, Wi-Fi 7, Bluetooth 6, ఫేస్ ID, యాక్షన్ బటన్ మరియు 5G కనెక్టివిటీ వంటి ఆధునిక ఫీచర్లను కలిగి ఉంటుంది.
Also Read: Amazon Prime Day సేల్ బెస్ట్ 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ డీల్ మీకోసం ఎదురు చూస్తోంది.!
ఈ ఫోన్ లో 48MP ప్రధాన కెమెరా, 48MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 48MP టెలిఫోటో కెమెరా కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇది 8x ఆప్టికల్ క్వాలిటీ జూమ్, Pro RAW, Pro Res వీడియో రికార్డింగ్, నైట్ మోడ్, మాక్రో ఫోటోగ్రఫీ, LiDAR స్కానర్ వంటి ఫీచర్లు కలిగి ఉంటుంది. ఈ ఫీచర్స్ తో ప్రొఫెషనల్ స్థాయి ఫోటోలు మరియు వీడియోలు ఈ ఫోన్ అందిస్తుంది. ఈ ఫోన్ ముందు భాగంలో 18MP True Depth కెమెరా ఉంది. ఇది నాణ్యమైన సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కు మద్దతు ఇస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్, MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్, మెరుగైన బ్యాటరీ బ్యాకప్, iOS 26 మరియు Apple Intelligence ఫీచర్లతో ఈ ఫోన్ అత్యుత్తమ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని అందిస్తుంది.