Flipkart బ్యాక్ టు క్యాంపస్ సేల్ నుంచి Google Pixel 10 ఫోన్ పై రూ.12,000 డిస్కౌంట్ ప్రకటించింది.!
Flipkart బ్యాక్ టు క్యాంపస్ సేల్ బిగ్ డీల్ అందించింది
Google Pixel 10 ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ రూ.12,000 డిస్కౌంట్ ప్రకటిచింది
భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ ఫోన్ రీజనబుల్ ప్రైస్ లో లభిస్తుంది
Flipkart బ్యాక్ టు క్యాంపస్ సేల్ నుంచి Google Pixel 10 ఫోన్ పై రూ.12,000 డిస్కౌంట్ ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ కంటే ముందే ప్రకటించిన బ్యాక్ టు క్యాంపస్ సేల్ నుంచి ఈ డీల్ అందించింది. భారీ ఫీచర్స్ తో గూగుల్ అందించిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ ఫోన్ రీజనబుల్ ప్రైస్ లో లభిస్తుంది.
SurveyGoogle Pixel 10 : ఆఫర్
గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్ ఫోన్ రూ. 69,999 ప్రైస్ ట్యాగ్ తో ఫ్లిప్ కార్ట్ నుంచి ఈరోజు లిస్ట్ అయ్యింది. అయితే, ఫ్లిప్ కార్ట్ యొక్క బ్యాక్ టు క్యాంపస్ సేల్ నుసి ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 5,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ ఆఫర్ మరియు రూ. 7,000 రూపాయల భారీ HDFC బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

ఫ్లిప్ కార్ట్ బ్యాక్ టు క్యాంపస్ సేల్ నుంచి అందించిన ఈ రెండు ఆఫర్స్ తో గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్ ఫోన్ రూ. 57,999 రూపాయల ఆఫర్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఇది రీజనబుల్ డీల్ అవుతుంది.
Also Read: Nothing Phone (4b) : డిజైన్ మరియు కెమెరా గురించి హింట్ ఇచ్చిన కొత్త టీజర్.!
Google Pixel 10 : ఫీచర్స్
Google Pixel 10 స్మార్ట్ ఫోన్ 6.3 ఇంచ్ కాంపాక్ట్ Actua OLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ వంటి ఫ్లాగ్ షిప్ ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ Google Tensor G5 ప్రాసెసర్ శక్తితో నడుస్తుంది. పిక్సెల్ 10 ఫోన్ Android 16 OS తో వస్తుంది. ఈ ఫోన్ లో Gemini AI, జెమినీ లైవ్, సర్కిల్ టు సెర్చ్, మ్యాజిక్ క్యూ మరియు Live Translate వంటి అధునాతన AI ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
కెమెరా విభాగంలో ఈ ఫోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులో 48MP మెయిన్ కెమెరా, 10.8MP టెలిఫోటో కెమెరా (5x ఆప్టికల్ జూమ్), 13MP అల్ట్రా-వైడ్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం 10.5MP ఫ్రంట్ కెమెరాని గూగుల్ అందించింది. ఈ ఫోన్ లో 4K వీడియో రికార్డింగ్, నైట్ సైట్, మ్యాజిక్ ఎరేజర్, బెస్ట్ టేక్, Zoom Enhance వంటి AI కెమెరా ఫీచర్లు ఉన్నాయి. ఇది 4,970mAh బ్యాటరీ, 30W ఫాస్ట్ ఛార్జింగ్, Qi2 ఆధారిత పిక్సెల్ స్నాప్ వైర్ లెస్ ఛార్జింగ్, IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
