Nothing Phone (4b) : డిజైన్ మరియు కెమెరా గురించి హింట్ ఇచ్చిన కొత్త టీజర్.!
నథింగ్ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం కంపెనీ భారీగా టీజింగ్ చేస్తోంది
వివరాలు తెలిసీ తెలియనట్లు తెలియ చేసే టీజర్ వీడియోలతో ఈ ఫోన్ టీజింగ్ చేస్తోంది
Nothing Phone (4b) లాంచ్ కోసం కంపెనీ కొత్త టీజర్ ను విడుదల చేసింది
Nothing Phone (4b) : నథింగ్ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం కంపెనీ భారీగా టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు ఇతర వివరాలు తెలిసీ తెలియనట్లు తెలియ చేసే టీజర్ వీడియోలతో ఈ ఫోన్ టీజింగ్ చేస్తోంది. నథింగ్ ఫోన్ a సిరీస్ కొత్త ఫోన్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ ఫోన్ ను అనుకోకుండా నిర్మించినట్లు నథింగ్ తెలిపింది. అయితే, ఈ రోజు కొత్తగా అందించిన టీజర్ ద్వారా ఈ అప్ కమింగ్ ఫోన్ డిజైన్ మరియు కెమెరా వివరాలు తెలిసేలా చేసింది.
SurveyNothing Phone (4b) : కొత్త టీజర్ ఏమిటి?
నథింగ్ ఫోన్ 4బి స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం కంపెనీ అఫీషియల్ X అకౌంట్ నుంచి కొత్త టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ లో ఈ అప్ కమింగ్ ఫోన్ స్కెచ్ గా చెబుతున్న కొన్ని స్కెచ్ లను చూపించింది. ఇందులో చూపిన అన్ని ఇమేజెస్ లో ఒక మూడు విషయాలు చాలా కామన్ గా ఉన్నాయి. జూలై 7వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఈ ఫోన్ ను ఆవిష్కరించనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఇది Nothing యొక్క కొత్త B-Series లో తొలి ఫోన్ గా రానుంది.

కొత్త టీజర్ ప్రకారం, ఈ అప్ కమింగ్ నథింగ్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ డిజైన్ తో అందించిన మూడు స్కెచ్ లలో కూడా ఇది కామన్ గా కనిపించింది. అంతేకాదు, కెమెరా కోసం నిర్మించిన పెద్ద బంప్ మరియు వాల్యూమ్ అండ్ పవర్ కమ్ AI బటన్ ఉన్నట్లు కూడా కనిపిస్తోంది.మూడో కామన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో కూడా నథింగ్ సిగ్నేచర్ ట్రాన్స్పరెంట్ బ్యాక్ ప్యానల్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఆఫ్ కోర్స్, ఈ ఫోన్ ఫీచర్స్ ఇంకా అఫీషియల్ గా రిలీజ్ చేయలేదు.
Also Read: GOAT Sale కంటే ముందే 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై గ్రేట్ డీల్ రివీల్ చేసిన Flipkart
Nothing Phone (4b) : లీక్స్
లీకైన స్కెచ్ లు మరియు టీజర్ చిత్రాల ప్రకారం ఫోన్ (4b) లో ప్రత్యేకమైన ట్రాన్స్‌పరెంట్ డిజైన్ ఉన్నట్లు తెలుస్తోంది. అనధికారిక లీక్స్ ప్రకారం, ఈ అప్ కమింగ్ నథింగ్ ఫోన్ లో 6.59 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది 1.5K రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది.
ఈ ఫోన్ బ్యాటరీ గురించి కూడా కొన్ని రూమర్లు నెట్టింట్లో చెక్కర్లు కొడుతున్నాయి. సుమారు 5,500mAh బ్యాటరీతో ఈ ఫోన్ రావచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పుడు చెప్తున్న ఫీచర్స్ ఇంకా అధికారికంగా నిర్ధారించబడలేదు.
గమనిక: ఈ అప్ కమింగ్ ఫోన్ ఫీచర్స్ గురించి కంపెనీ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. కాబట్టి, పైన తెలిపిన వివరాలు అధికారిక వివరాలు కావని గమనించాలి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
