Flipkart నేషనల్ షాపింగ్ డేస్ సేల్ : స్మార్ట్ ఫోన్ల పైన భారీ డిస్కౌంట్లు

Flipkart నేషనల్ షాపింగ్ డేస్ సేల్ : స్మార్ట్ ఫోన్ల పైన భారీ డిస్కౌంట్లు

ఫ్లిప్ కార్ట్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన " నేషనల్ షాపింగ్ డేస్ సేల్ " ని ప్రకటించింది. ఈ సేల్ ఆగష్టు 8 వ తేదీ నుండి ఆగష్టు 10 వ తేదీ వరకూ జరగనుంది. ఈ సేల్ నుండి అనేక బ్రాండ్స్ కి సంబంచిందించిన చాలా మొబైల్స్ పైన మంచి ఆఫర్లను ప్రకటిస్తోంది. అలాగే, ఈ సేల్ నుండి ఈ మొబైల్ ఫోన్లను ICICI బ్యాంక్ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డులతో కొనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ సేల్ నుండి మంచి ఆఫర్లతో కొనగల బెస్ట్ కెమేరా ఫోన్లను ఒక జాబితాగా ఇచ్చాను. ఈ క్రింద చూడండి.        

1.XIAOMI REDMI NOTE 7 PRO 

ఇండియాలో మిడ్ రేంజ్ ధరలో ఒక 48MP ప్రధాన కెమేరా, అదీకూడా SONYIMX586 సెన్సారుతో ఒక స్మార్ట్ ఫోన్ను తీసుకొచ్చిన ఘనత, కేవలం షావోమి మాత్రమే సొంతం అని చెప్పొచ్చు. కేవలం, కెమేరా మాత్రమే కాదు ఒక స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసరుతో మంచి స్పీడ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 4GB మరియు 6GB వంటి ర్యామ్ ఎంపికలతో కూడా లభిస్తుంది. అలాగే, ఒక 4,000 బ్యాటరీతో ఒక రోజంతా కూడా చక్కగా సరిపోయేలా అందించారు. ఈ ఫోన్ పైన 1000 రుపాయల అధిక ఎక్స్చేంజి ప్రైస్ ని అఫర్ చేస్తోంది.  

2. REALME 3 PRO

రియల్మీ 3 ప్రో  స్మార్ట్ ఫోన్, 1080 x 2340 రిజల్యూషన్ కలిగిన ఒక 6.3 అంగుళాల వాటర్ నోచ్ డిస్ప్లేతో ఉంటుంది. ఇది 90.8%  స్క్రీన్-టూ-బాడీ రేషియో మరియు FHD+ రిజల్యూషన్ అందిస్తుంది. ఒక క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రొసెసరుకి జతగా అడ్రినో 616 మరియు 4GB మరియు 6GB ర్యామ్ శక్తితో వస్తుంది. 16MP కెమేరాకు జతగా f/2.4 అపర్చరు కలిగిన మరొక 5MP సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమేరాతో ఉంటుంది. ఈ ప్రాధాన 16MP కెమెరా ఒక SonyIMX519  సెన్సారుతో వస్తుంది. ఈ ఫోన్ పైన 1,000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది.  

3. NOKIA 6.1 PLUS 

ఈ నోకియా 6.1 స్మార్ట్ ఫోన్ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.4 అంగుళాల FHD+ నోచ్ డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది ఒక స్నాప్ డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఒక 3060 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ వేరియంట్తో వస్తుంది. వెనుక భాగంలో 16MP +5MP డ్యూయల్ రియర్ కెమేరా సేటప్పుతో మరియు ముందు 16MP సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ముందుగా, రూ. 15,999 ధరతో అమ్ముడైన ఈ స్మార్ట్ ఫోన్ను కేవలం రూ.12,999 ధరతో కొనవచ్చు.    

4. XIAOMI MI A2

షావోమి నుండి ముందుగా వచ్చిన ఈ కెమేరా ఫోన్, స్మార్ట్ ఫోన్ 2160 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.4 FHD+ ఫుల్ వ్యూ డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది ఒక స్నాప్ డ్రాగన్ 660AIE ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఒక 3010 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ జతగా 128GB వేరియంట్తో వస్తుంది. వెనుక భాగంలో 12MP +20MP  డ్యూయల్  కెమేరా సేటప్పుతో మరియు ముందు 20MP సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ఇది ప్రస్తుతం రూ.11,999 ప్రారంభదరతో లభిస్తోంది.కానీ ఈ సేల్ నుండి కేవలం రూ.9,999 ధరతో కాయనుగోలు చేయవచ్చు.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo