Flipkart Sale నుండి వివో లేటెస్ట్ 5G పైన బిగ్ డీల్స్.!
Flipkart Mobiles Bonaza సేల్ నుండి వివో లేటెస్ట్ 5G పైన బిగ్ డీల్స్
వివో బడ్జెట్ 5G ఫోన్ ను మరింత చవక ధరకే పొందేవీలుంది
No Cost EMI లేదా అతి తక్కువ EMI అప్షన్ తో కూడా కొనే వీలుంది
Flipkart Mobiles Bonaza సేల్ నుండి వివో లేటెస్ట్ 5G పైన బిగ్ డీల్స్ అఫర్ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన ఈ లేటెస్ట్ సేల్ నుండి వివో బడ్జెట్ 5G ఫోన్ ను మరింత చవక ధరకే లేదా ఈజీ EMI అప్షన్ తో కూడా మీరు పొందేవీలుంది. భారతీయ బడ్జెట్ యూజర్లను లక్ష్యంగా చేసుకొని తీసుకోసిన ఈ వివో బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ పైన ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ సేల్ మొబైల్స్ బొనాంజా సేల్ నుండి అందించిన ఆ డీల్స్ ఏమిటో తెలుసుకోండి.
Surveyఅఫర్ విషయానికి వస్తే vivo T1 5G స్మార్ట్ ఫోన్ Flipkart Mobiles Bonaza సేల్ నుండి మంచి బ్యాంక్ ఆఫర్లలతో లభిస్తోంది. అఫర్ వివరాలను క్రింద చూడవచ్చు.
vivo T1 5G: ధర మరియు ఆఫర్లు
వివో ఇటీవల vivo T1 5G బేసిక్ వేరియంట్ కేవలం రూ.15,990 ప్రారంభ ధరతో లభిస్తోంది మరియు ఇది 4GB మరియు 128GB స్టోరేజ్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను Fedral బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 1,500 భారీ తగ్గింపు లేదా PNB క్రెడిట్ కార్డ్ తో కొనేవారు 1,250 భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్ పైన అన్ని ప్రముఖ బ్యాంక్స్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ అప్షన్ కొనుగోలు పైన 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ అఫర్ కూడా అందించింది. ఈ ఫోన్ ను ఎటువంటి వడ్డీ లేకుండా No Cost EMI లేదా అతి తక్కువ EMI అప్షన్ తో కూడా కొనే వీలుంది.
vivo T1 5G: స్పెక్స్
Vivo T1 5G స్మార్ట్ ఫోన్ 6.58 ఇంచ్ FHD+ LCD డిస్ప్లేని కలిగివుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో సెల్ఫీ కెమెరా కోసం నోచ్ కటౌట్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకూ మెమోరిని మరింతగా విస్తరించవచ్చు.
ఇక కెమెరాల విభాగంలో, వివో T1 5జి ఫోన్ 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ మరియు 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. అలాగే, సెల్ఫీల కోసం ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితమైన Funtouch OS 12 స్కిన్ పైన నడుస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile