flipkart మొబైల్ ఫెస్టివ్ అఫర్ చివరి రోజు సేల్ నుండి రియల్మీ 3 ప్రో పైన భారీ డిస్కౌంట్
HDFC డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే, అది కేవలం రూ. 9,000 రూపాయలకే మీకు దొరుకుతుంది
దీపావళి సందర్భంగా, ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన బిగ్ దివాళి సేల్ ముగిసింది. అయితే, ఫ్లిప్ కార్ట్ మొబైల్ ప్రియుల కోసం మరొక సేల్ అయినటువంటి 'మొబైల్ ఫెస్టివ్ అఫర్' సేల్ ని ప్రకటించింది మరియు ఈ సేల్ ద్వారా అనేకమైన స్మార్ట్ ఫోన్ల పైన గొప్ప డిస్కౌంట్ ప్రకటించింది. అయితే, ముందుగా మిడ్ రేంజ్ ధరలో అమ్ముడైన రియల్మీ 3 ప్రో మీద మంచి డిస్కౌంట్ ప్రకటించినట్లు చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఇప్పటి వరకు 13,999 ధరతో అమ్ముడవుతున్న ఈ స్మార్ట్ ఫోన్ పైన 4000 రుపాయ డిస్కౌంట్ తో కేవలం రూ. 9,999 రూపాయల ధరకే అమ్ముడు చేస్తోంది. వాస్తవానికి, దీపావళి సేల్ నుండి కూడా ఇదే డిస్కౌంట్ ప్రకటించగా, ఈ సేల్ ద్వారా మరొక రోజు తక్కువ ధరకే ఈ ఫోన్ సేల్ అయినట్లు చూడవచ్చు.
Surveyఅంతేకాదు, మీరు గనుక HDFC డెబిట్ కార్డు నుండి అంటే ATM కార్డు ఉపయోగించి ఈ ఫోన్ను కొనుగోలు చేస్తే కనుక మరొక 10% డిస్కౌంట్ దొరుకుతుంది. అంటే, 9,999 రూపాయల ఫోన్ను HDFC డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే, అది కేవలం రూ. 9,000 రూపాయలకే మీకు దొరుకుతుంది. ఇప్పటి వరకూ మనం చెప్పుకుంది కేవలం ఈ ఫోన్ కొనడానికి మనల్ని ప్రోత్సహించే ఆఫర్లు.
అయితే, వాస్తవానికి ఈ ఫోన్ గురించి చూస్తే ఫోన్ కూడా చాలా మంచి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది ఒక స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రాసెసర్, హైపర్ బూస్ట్ 2.0 తో వస్తుంది కాబట్టి, PUBG మొబైల్ వంటి గేమ్స్ చక్కగా ఆడుకోవచ్చు. గేమ్ మరియు కెమేరా బాగా పనిచేయాలంటే దాని ప్రాసెసర్ కూడా ఒక ప్రధానమైన విషయం అని గుర్తుంచుకోండి.
REALME 3 PRO – ధరలు
రియల్మీ 3 ప్రో (4GB ర్యామ్ + 64GB స్టోరేజి) – Rs. 9,999
రియల్మీ 3 ప్రో (6GB ర్యామ్ + 64GB స్టోరేజి) – Rs. 11,999
రియల్మీ 3 ప్రో (6GB ర్యామ్ + 128GB స్టోరేజి) – Rs. 12,999
REALME 3 PRO ప్రత్యేకతలు
రియల్మీ 3 ప్రో స్మార్ట్ ఫోన్, 1080 x 2340 రిజల్యూషన్ కలిగిన ఒక 6.3 అంగుళాల వాటర్ నోచ్ డిస్ప్లేతో ఉంటుంది. ఇది 90.8% స్క్రీన్-టూ-బాడీ రేషియో మరియు FHD+ రిజల్యూషన్ అందిస్తుంది. ఇది ఒక వాటర్ డ్రాప్ నోచ్ మరియు వెనుక ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అంతేకాదు,ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 2.2GHz వేగంతో క్లాక్ చేయబడిన, ఒక క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రొసెసరుకి జతగా అడ్రినో 616 మరియు 4GB మరియు 6GB ర్యామ్ శక్తితో వస్తుంది.ఇది 64GB మరియు 128GB స్టోరేజితో వస్తుంది. అలాగే డ్యూయల్ SIM కార్డులతో పాటుగా ఒక SD మెమొరీ కార్డును కూడా ఒకేసారి వాడుకునేలా ట్రిపుల్ SIM స్లాట్ ఇందులో అందించారు.
కెమేరాల విషయానికి వస్తే, వెనుక f /1.7 అపర్చరు కలిగిన 16MP కెమేరాకు జతగా f/2.4 అపర్చరు కలిగిన మరొక 5MP సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమేరాతో ఉంటుంది. ఈ ప్రాధాన 16MP కెమెరా ఒక SonyIMX519 సెన్సారుతో వస్తుంది. ఇక సెల్ఫీ కెమేరా విషయానికి వస్తే, ముందుభాగంలో ఒక 25MP AI సెల్ఫీ కెమెరాతో ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారితంగా కలర్ OS 6 పైన నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక పెద్ద 4045mAh బ్యాటరీతో వస్తుంది మరియు ఇది బాక్స్ నుండి 20వాట్స్ వేగవంతమైన చార్జరుతో వస్తుంది. ఇందులో వేగవంతమైన ఛార్జింగ్ కోసం VooC 3.0 ఛార్జింగ్ సాంకేతికతను అందిచారు, దీనితో అత్యంత వేగవంతంగా ఛార్జ్ చెయ్యవచ్చని సంస్థ చెబుతోంది.
ఇక ఇందులో అందించిన ప్రత్యేకమైన ఫీచరుగా 960fps స్లో మోషన్ మరియు 4K వీడియో రికార్డింగ్ వంటి వాటిని గురించి చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో అందించిన కెమెరాతో 64MP రిజల్యూషన్ అందించగల అల్ట్రా HDR ఫోటోలను తీసుకోవచ్చని రియల్మీ ప్రకటించింది.అలాగే, లైటనింగ్ పర్పల్ , నైట్రో బ్లూ మరియు కార్బన్ గ్రే వంటి రెండు రంగుల ఎంపికలతో లభిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile