Apple iPhone 16 పై రూ. 15,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించిన ఫ్లిప్ కార్ట్ GOAT Sale
Apple iPhone 16 కొనాలని ఎదురు చూస్తున్న వారికి ఫ్లిప్ కార్ట్ GOAT Sale గొప్ప శుభవార్త
ఐఫోన్ 16 ఫోన్ గొప్ప కెమెరా మరియు లేటెస్ట్ A18 చిప్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది
ఈ ఫోన్ ను ఈ రోజు ఫ్లిప్ కార్ట్ నుంచి డిస్కౌంట్ ధరకే అందుకోవచ్చు
Apple iPhone 16 స్మార్ట్ ఫోన్ కొనాలని ఎదురు చూస్తున్న వారికి ఫ్లిప్ కార్ట్ GOAT Sale గొప్ప శుభవార్త అందించింది. యాపిల్ యొక్క లేటెస్ట్ ఫోన్ సిరీస్ ఐఫోన్ 16 సిరీస్ సెండ్ బేసిక్ ఫోన్ ఐఫోన్ 16 ఫోన్ గొప్ప కెమెరా మరియు లేటెస్ట్ A18 బయోనిక్ చిప్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి డిస్కౌంట్ ధరకే అందుకోవచ్చు.
SurveyApple iPhone 16 : ఆఫర్
యాపిల్ ఐఫోన్ 16 ఫోన్ యొక్క మూడు వేరియంట్స్ పై కూడా ఈ బిగ్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఐఫోన్ 16 ఫోన్ కంపెనీ వెబ్సైట్ నుంచి రూ. 79,990 ధరతో సేల్ అవుతుంటే, ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 10,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 69,990 ధరతో సేల్ అవుతోంది. ఈ ఫోన్ యొక్క 256 జీబీ వేరియంట్ రూ. 79,999 ధరతో మరియు హై ఎండ్ 512 జీబీ వేరియంట్ రూ. 99,999 ధరలో లభిస్తుంది. అంటే, అన్ని వేరియంట్స్ పైన కూడా 10 వేల రూపాయల తగ్గింపు అందించింది. ఇది కాకుండా ఈ ఫోన్ పై రూ. 2,000 అదనపు డిస్కౌంట్ కూపన్ / క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ కూడా ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది.

అదనంగా, ఈ ఫోన్ స్టార్టింగ్ 128 జీబీ వేరియంట్ పై రూ. 3000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఫోన్ ను Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నాన్ EMI ఆప్షన్ తో తీసుకునే వారికి ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ ఫోన్ పై టోటల్ 15,000 రూపాయల తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 64,990 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చు.
Also Read: ఇండియన్ స్టూడెంట్స్ కోసం Google Gemini AI ఉచిత ఆఫర్ ప్రకటించిన గూగుల్.!
Apple iPhone 16 : ఫీచర్స్
యాపిల్ ఈ ఫోన్ ను A18 Chip తో అందించింది మరియు ఈ ఫోన్ 128 జీబీ, 256 జీబీ మరియు 512 జీబీ స్టోరేజ్ తో లభిస్తుంది. ఈ ఫోన్ iOS 18 తో నడుస్తుంది మరియు యాపిల్ ఇంటెలిజెన్స్ తో వస్తుంది. ఈ ఫోన్ 6.1 ఇంచ్ సూపర్ రెటినా XDR డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే డైనమిక్ ఐల్యాండ్, హ్యప్టిక్ టచ్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు (2556 x 1179) రిజల్యూషన్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో గొప్ప కెమెరా సిస్టం మరియు ప్రత్యేకమైన యాక్షన్ బటన్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 48MP ఫ్యూజన్ మరియు 12MP అల్ట్రా వైడ్ కెమెరాలు కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 12MP ట్రూ డెప్త్ సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4x ఆప్టికల్ జూమ్ రేంజ్, స్మార్ట్ HDR 5 మరియు 60 FPS వద్ద 4K Dolby Vision వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
యాపిల్ ఐఫోన్ 16 లో 27 వీడియో ప్లే బ్యాక్ అందించే పవర్ ఫుల్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ ఎమర్జెన్సీ SOS మరియు క్రాష్ డిటెక్షన్ వంటి స్పెషల్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.