Flipkart ఎలక్ట్రానిక్స్ సేల్ నుండి VIVO T1 5G పైన బిగ్ డీల్..!!

HIGHLIGHTS

Flipkart ఎలక్ట్రానిక్స్ సేల్ నుండి vivo T1 5G పైన బిగ్ డీల్ అందించింది

వివో T సిరీస్ నుండి వచ్చిన ఈ లేటెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్

Flipkart ఎలక్ట్రానిక్స్ సేల్ జూన్ 23వ తేదీ నుండి జూన్ 26వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది

Flipkart ఎలక్ట్రానిక్స్ సేల్ నుండి VIVO T1 5G పైన బిగ్ డీల్..!!

Flipkart ఎలక్ట్రానిక్స్ సేల్ నుండి vivo T1 5G పైన బిగ్ డీల్ అందించింది.  వివో T సిరీస్ నుండి వచ్చిన ఈ లేటెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ ఈ రోజు ఫ్లిప్ కార్ట్  సేల్ నుండి భారీ బ్యాంక్ అఫర్ తో లభిస్తోంది. Flipkart ఎలక్ట్రానిక్స్ సేల్ జూన్ 23వ తేదీ నుండి జూన్ 26వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. VIVO T1 5G  స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ FHD+ డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన బిగ్ బ్యాటరీ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

vivo T1 5G: ధర మరియు ఆఫర్లు

వివో ఇటీవల vivo T1 5G సార్ట్ ఫోన్ ను కేవలం రూ.15,999 ప్రారంభ ధరతో ప్రకటించింది మరియు ఇది 4GB మరియు 128GB స్టోరేజ్ తో ఉంటుంది. మరొక వేరియంట్ 6GB మరియు 128GB స్టోరేజ్ ధర రూ.16,999 మరియు హై ఎండ్ వేరియంట్ 8GB మరియు 128GB స్టోరేజ్ తో రూ.19,999 ధరతో వస్తుంది.

Vivo T1 Pro 5G and Vivo T1 44W.jpg

ఇక ఈ ఫోన్ పైన Flipkart ఎలక్ట్రానిక్స్ సేల్ నుండి నుండి అందించిన ఆఫర్ల గురించి చూస్తే, ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ డెబిట్/క్రెడిట్  కార్డ్ తో కొనేవారికి 1,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనేవారికి కూడా 1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అయితే, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో కొనేవారికి 1,500 డిస్కౌంట్ లభిస్తుంది.

vivo T1 5G: స్పెక్స్

Vivo T1 5G స్మార్ట్ ఫోన్ 6.58 ఇంచ్ FHD+ LCD డిస్ప్లేని కలిగివుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో సెల్ఫీ కెమెరా కోసం నోచ్ కటౌట్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకూ మెమోరిని మరింతగా విస్తరించవచ్చు.

ఇక కెమెరాల విభాగంలో, వివో T1 5జి ఫోన్ 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ మరియు 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. అలాగే, సెల్ఫీల కోసం ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితమైన Funtouch OS 12 స్కిన్ పైన నడుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo