Fliapkart బిగ్ షాపింగ్ డేస్ సేల్ : డిసెంబరు 1 నుండి 5 వ తేదీ వరకూ జరగనుంది

Fliapkart బిగ్ షాపింగ్ డేస్ సేల్ : డిసెంబరు 1 నుండి 5 వ తేదీ వరకూ జరగనుంది
HIGHLIGHTS

ఈ సేల్ HDFC యొక్క భాగస్వామ్యంతో జరుగుతోంది.

Fliapkart తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన బిగ్ షాపింగ్ డేస్ సేల్ ను డిసెంబరు 1 నుండి డిసెంబరు 5 వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ నుండి అన్ని ప్రధాన బ్రాండ్స్ కి సంభందించిన స్మార్ట్ ఫోన్ల పైన మంచి డిస్కౌంట్, No Cost EMI మరియు ఎక్స్చేంజి అఫర్ లను కూడా అందించనున్నట్లు చెబుతోంది. ఇక ఈ సేల్ HDFC యొక్క భాగస్వామ్యంతో జరుగుతోంది. కాబట్టి, HDFC యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డులతో ప్రొడక్స్ కోనుగోలు చేసే వారికి 10% తక్షణ డిస్కౌంట్ అఫర్ ని ప్రకటించింది.

ఇక సేల్ ద్వారా అమ్ముడవనున్న మొబైల్ ఫోన్ల వివరాల్లోకి వెళితే, ఈ సేల్ నుండి ఇటీవల మంచి ప్రత్యేకతలతో ప్రధాన బ్రాండ్స్ నుండి వచ్చినటువంటి స్మార్ట్ ఫోన్లు కూడా ఈ సేల్ ద్వారా అమ్మడవనున్నట్లు తెలుస్తోంది. ఈ సేల్ డిసెంబరు 1 వ తేదికి మొదలవుతుండగా, Flipkart Plus వినియోగదారులు మాత్రం 4 గంటలు ముందుగానే, అంటే నవంబరు 30 వ తేదీ సాయంత్రం 8 గంటల నుండే సేల్ కోసం యాక్సెస్ ను పొందుతారు.

ఈ సేల్ నుండి, ఒక అతిపెద్ద 6,000mAh బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమేరా మరియు 4GB ర్యామ్ తో కేవలం రూ.8,499 రూపాయల ధరలో Tecno సంస్థ ఇండియాలో ఈ రోజు లాంచ్ చేసినటువంటి Spark Power  యొక్క మొదటి సేల్ ను కూడా అదే రోజున, అంటే డిసెంబర్ 1 వ తేదికి నిర్వహించనుంది. అలాగే, రియల్మీ, ఆపిల్ , అసూస్, నోకియా మరియు శామ్సంగ్ వంటి అన్ని ప్రధాన కంపెనీల స్మార్ట్ ఫోన్లను సేల్ ద్వారా మంచి డిస్కౌంట్లతో అందించనునట్లు తెలుస్తోంది.                                           

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo