Flipkart బిగ్ ధమాకా డేస్ సేల్ నుండి iPhone 12 పైన బిగ్ డీల్ ను ప్రకటించింది. ఈ ధమాకా ఆఫర్ ద్వారా బడ్జెట్ ధరలో ఐఫోన్ కొనాలనుకునే వారికి గొప్ప అవకాశం అందించింది. డిసెంబర్ 1 వ తేదీ నుండి డిసెంబర్ 3 వ తేదీ వరకూ నిర్వహింహిస్తున్న ఫ్లిప్ కార్ట్ ధమాకా సేల్ నుండి ఈ ఆఫర్ ను అందించింది. ఈ ఫ్లిప్ కార్ట్ ఆఫర్ ద్వారా ఐఫోన్ 12 ఫోన్ ను చాలా తక్కువ ధరకే అందుకునే అవకాశం మీ ముందుండి.
Survey
✅ Thank you for completing the survey!
Flipkart Big deal on iPhone 12
ఫ్లిప్ కార్ట్ బిగ్ ధమాకా సేల్ నుండి ఈరోజు ఐఫోన్ 12 ఫోన్ పైన గొప్ప డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. నిన్న మొన్నటి వరకు రూ. 49,999 రూపాయల ధరలో లభించిన ఐఫోన్ 12 ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి 17% డిస్కౌంట్ తో రూ. 40,999 ఆఫర్ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఐఫోన్ 12 ఫోన్ ను కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కొనే వారికి రూ. 1,000 అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే, ఈ ఫోన్ పైన భారీ అధనపు ఎక్స్ చేంజ్ ను డిస్కౌంట్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది.
ఐఫోన్ ఫోన్ 6.1 ఇంచ్ Super Retina XDR డిస్ప్లేని సిరమిక్ షీల్డ్ మరియు 1200 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ యాపిల్ ఐఫోన్ iOS 14 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ A14 Bionic తో పనిచేస్తుంది మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఇది 5జి ఫోన్ మరియు మరిన్ని కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.
ఐఫోన్ 12 ఫోన్ ప్రత్యేకతలు
ఐఫోన్ 12 ఫోన్ వెనుక 12MP + 12MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు ముందు కూడా 12MP సెల్ఫీ కెమేరాని కూడా కలిగి వుంది. ఈ రియర్ కెమేరా 24fps, 30 fps లేదా 60 fps వద్ద కూడా 4K Video లను షూట్ చెయ్యగలదు. ఈ ఫోన్ తో 30fps వద్ద Dolby Vision వీడియోలను కూడా చిత్రీకరించగలదు.
ఈ ఫోన్ IP68 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ మరియు Dolby Vision, HDR10 సపోర్ట్ లను కూడా కలిగి వుంది.