గూగుల్ లేటెస్ట్ ఫోన్ Rs.5,000 భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది
గూగుల్ పిక్సెల్ 4 ఎ పైన 5,000 రూపాయల భారీ డిస్కౌంట్
Flipkart Big Saving Days సేల్ బెస్ట్ మొబైల్ అఫర్
గూగుల్ లేటెస్ట్ ఫోన్ పైన భారీ డిస్కౌంట్ లభిస్తోంది. నిన్నటి నుండి మొదలైన Flipkart Big Saving Days సేల్ మంచి డిస్కౌంట్ తో ఈ ఫోన్ సేల్ అవుతోంది. అధనంగా, అనేక ఇతర ఆఫర్లను కూడా ఈ గూగుల్ స్మార్ట్ ఫోన్ పైన పొందవచ్చు. గూగుల్ పిక్సెల్ 4 ఎ పైన 5,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో పాటుగా SBI బ్యాంక్ 10% డిస్కౌంట్ అఫర్ మరియు భారీ ఎక్సేంజి అఫర్ ను కూడా అఫర్ చేస్తోంది.
Google Pixel 4a: అఫర్ ధర
గూగుల్ పిక్సెల్ 4 ఎ 6GB + 128GB వేరియంట్ తో భారతదేశంలో రూ. 31,999 రూపాయల ధరతో వచ్చింది. అయితే, ఈ ఫోన్ Flipkart Big Saving Days సేల్ నుండి 5000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ .26,999 అఫర్ ధర వద్ద లభిస్తోంది. Click Here To BUY
Google Pixel 4a: ప్రత్యేకతలు
గూగుల్ పిక్సెల్ 4 ఎ సాఫ్ట్-టు-టచ్ ప్లాస్టిక్ బ్యా క్‌తో కొత్త డిజైన్ ను కలిగి ఉంది. కాని, Pixel 3a లో ఉన్నట్లుగా డ్యూయల్ టోన్ స్టైల్ మాత్రం ఇవ్వలేదు. ఇది 8.2 మిల్లీమీటర్ల మందంతో మరియు పాలికార్బోనేట్ తో నిర్మించడం వలన ఇది చాలా తేలికగా వుంటుంది, ఇది 143 గ్రాముల బరువు ఉంటుంది. స్పీడ్ అన్ లాక్ తో ఫోన్ మధ్యలో వేలిముద్ర రీడర్ ఉంది. ఈ ఫోన్ యొక్క ధరను దృష్టిలో ఉంచుకొని ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వలేదు.
Google Pixel 4a: డిస్ప్లే
Pixel 4a ఒక 5.8-అంగుళాల F HD + (2340 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది OLED ప్యానెల్‌ను ఉపయోగిస్తుంది. ఈ స్క్రీన్ సెల్ఫీ కెమెరాను ఉంచడానికి ఎగువ-ఎడమ మూలలో పంచ్-హోల్ కటౌట్ కలిగి ఉంది మరియు అంచులు చాలా తక్కువగా వుండే విధంగా, బెజెల్ లెస్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇది 19.5: 9 ఎస్పెక్ట్ రేషియోని ఇస్తుంది. అదనంగా, ఈ డిస్ప్లే HDR + సర్టిఫైడ్ కాబట్టి, ఇది ఫోన్ లో వీడియో-వీక్షణ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది, మరియు స్టీరియో స్పీకర్లతో ఆడియో కూడా మంచిగా వుంటుంది.
Google Pixel 4a: Performance
పిక్సెల్ 4 ఎ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730 జి యొక్క శక్తితో నడుస్తుంది. ఇది ఆక్టా-కోర్ సిపియు మరియు 2.2GHz మరియు అడ్రినో 618 GPU జతగా వస్తుంది. ఇది 6GB RAM మరియు 128GB స్టోరేజ్ తో జత చేయబడింది. పిక్సెల్ ఫోన్ కావడంతో, గూగుల్ ఫోటోలలో అన్లిమిటెడ్ ఫోటో మరియు వీడియో స్టోరేజ్ ను అధిక నాణ్యతతో ఉచితంగా అందిస్తుంది. పిక్సెల్ 4 ఎ అనేది పిక్సెల్ 4 యొక్క కొద్దిగా టోన్-డౌన్ వెర్షన్, ఇది గత సంవత్సరం చివర్లో ప్రారంభమైంది. ఇది Soli radar chip లేదా Pixel Neural Core తో రాదు, కానీ Titan M security chip తో వస్తుంది, ఇది మీ డేటాను మూడు సంవత్సరాల పాటు నమ్మకంగా కొత్త అప్డేట్ లతో పాటు సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది.
Google Pixel 4a: Camera
గూగుల్ పిక్సెల్ 4 ఎ, కేవలం సింగిల్ 12 MP కెమెరాతో వస్తుంది, ఇది పిక్సెల్ 4 వలె అదే సోనీ IMX363 సెన్సార్‌ను OIS మరియు EIS లకు మద్దతుగా ఉపయోగిస్తుంది. పిక్సెల్ 4 ఎ యొక్క కెమెరా తన కెమెరా నుండి Live HDR+, నైట్ సైట్, ఆస్ట్రో ఫోటోగ్రఫీ, సూపర్ రెస్ జూమ్ మరియు మరిన్ని ఫీచర్లతో పిక్సెల్ 4 లాంటి చిత్రాలను ఉత్పత్తి చేయగలదని గూగుల్ పేర్కొంది. ఈ ఫోన్ వెనుక కెమెరా 30Kps వద్ద 4K, 3080/30/60fps వద్ద 1080p మరియు 240fps వరకు 720p రికార్డ్ చేయగలదు, సెల్ఫీ కెమెరా పూర్తి HD వీడియోలను 30fps వద్ద షూట్ చేయగలదు. ఈ ఫోన్ లోని ముందు కెమెరా 84 డిగ్రీల ఫీల్డ్-ఆఫ్ వ్యూతో 8 MP కెమెరాతో పిక్సెల్ 3 ఎ వలె ఉంటుంది.
Google Pixel 4a: Battery
Pixel 4 a, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ తో వస్తుంది మరియు గూగుల్ అసిస్టెంట్‌తో ముందే లోడ్ చేయబడి, కొత్త రికార్డర్ యాప్ వంటి కొత్త ఫీచర్లతో పాటు AI మరియు మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్ లను ఉపయోగించి మాటలను టెక్స్ట్ గా మారుస్తుంది. అదనంగా, ఫోన్ లైవ్ ట్రాన్స్క్రిప్ట్ మరియు లైవ్ క్యాప్షన్ వంటి వాటికీ యాక్సెస్ ను కలిగి ఉంది.
పిక్సెల్ 4 ఎ లో 3,140 ఎమ్ఏహెచ్ బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వబడింది. ఈ 4a 24 గంటల బ్యాటరీ బ్యాకప్ ను అందించగలదని గూగుల్ పేర్కొంది మరియు మీరు మీ ఫోన్ ను ఎలా ఉపయోగిస్తారనే దాని పైన ఆధారపడి బ్యాటరీ జీవితాన్ని నిర్వహించే అడాప్టివ్ బ్యాటరీ ఫీచర్‌తో వస్తుంది.