నోకియా 5.1 ప్లస్ రూ. 6,999 మరియు నోకియా 6.1 ప్లస్ 8,999 ధరలకే సేల్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది Sep 25 2019
నోకియా 5.1 ప్లస్ రూ. 6,999 మరియు నోకియా 6.1 ప్లస్ 8,999 ధరలకే సేల్

Make your home smarter than the average home

Make your life smarter, simpler, and more convenient with IoT enabled TVs, speakers, fans, bulbs, locks and more.

Click here to know more

HIGHLIGHTS

అత్యంత తక్కువ ధరతో ఈ నోకియా స్మార్ట్ ఫోన్లు అమ్ముడవడం ఆశ్చర్యకరమైన విషయం.

దీపావళి సందర్భంగా Flipkart తీసుకొచ్చినటువంటి,బిగ్బిలియన్ డేస్ సేల్ ద్వారా అనేకమైన స్మార్ట్ ఫోన్ల పైన గొప్ప డిస్కౌంట్లను పాటించింది. వీటిలో,  NOKIA 5.1 PLUS మరియు NOKIA 6.1 PLUS స్మార్ట్ ఫోన్ల పైన నిజంగా చెప్పుకోదగిన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. మంచి బిల్డ్ క్వాలిటీ మరియు ప్రత్యేకతలు కలిగినటువంటి ఫోన్లను ఈ సేల్ ద్వారా చాల చౌక ధరకే విక్రయించనుంది. ఈ సేల్ సెప్టెంబర్ 29 వ తేదీ నుండి అక్టోబర్ 4 వ తేదీ వరకూ జరగనుంది.     

ఈ నోకియా ఫోన్ల ధరలు

1. NOKIA 5.1 PLUS (3GB + 32GB )  సేల్ అఫర్ ధర - Rs.6,999 

2. NOKIA 6.1 PLUS (4GB + 64GB )  సేల్ అఫర్ ధర - Rs.8,999 

ఇప్పటివరకూ అనేక సేల్స్ జరుగగా, అత్యంత తక్కువ ధరతో ఈ నోకియా స్మార్ట్ ఫోన్లు అమ్ముడవడం ఆశ్చర్యకరమైన విషయం.      

అధనంగా, ICICI  యొక్క డెబిట్ & క్రెడిట్ కార్డులతో ఈ స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేసే వారికి 10% తక్షణ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంటుంది. అధనంగా, NO Cost EMI, యొక్క డెబిట్ & క్రెడిట్ కార్డులతో కూడా 10% డిస్కౌంట్ మరియు ఎక్స్చేంజి ఆఫర్లు వంటివి అందించింది.       

నోకియా 5.1 ప్లస్ : స్పెసిఫికేషన్స్

ఈ నోకియా 5.1 ప్లస్ ఒక 5.86 అంగుళాల HD + డిస్ప్లేను 19: 9 యొక్క యాస్పెక్ట్ రేషియాతో మరియు 84 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో కలిగి ఉంటుంది . ఈ ఫోన్ ఒక 3 జీబి ర్యామ్ కలిగి ఒక మీడియా టెక్ హీలియో P60 చిప్సెట్తో శక్తిని కలిగి ఉంది మరియు 32GB అంతర్గత స్టోరేజితో లభిస్తుంది, ఇది 256GB వరకు మెమోరిని పెంచుకునే ఎంపికను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ఒక f / 2.0 ఎపర్చరుతో 13MP + 5MP లెన్సులతో డ్యూయల్ - రియర్ కెమెరా సెటప్ ఉంటుంది మరియు ముందు భాగంలో, f / 2.2 ఎపర్చర్ మరియు 80.4- డిగ్రీ యాంగిల్ గల 8MP యూనిట్ ఉంది.

ఈ సంస్థ అందించే ఇతర స్మార్ట్ఫోన్ల మాదిరిగానే, నోకియా 5.1 ప్లస్ కూడా Android One వన్ కార్యక్రమం కింద వస్తుంది, దీని అర్థం స్మార్ట్ఫోన్ సకాలంలో భద్రత మరియు OS అప్డేట్లను పొందుతుంది. HMD గ్లోబల్ తెలిపిన ప్రకారం, నోకియా 5.1 ప్లస్ ఆండ్రాయిడ్ 9 పైకి అప్డేట్ చేయబడే మొట్టమొదటి పరికరాల్లో ఒకటిగా ఉంటుంది. ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్ఫోన్ను 3060 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సమర్థిస్తుంది. ఇది 12 గంటల వీడియో ప్లేబ్యాక్ను అందిస్తుందని సంస్థ పేర్కొంది      

Nokia 6.1 Plus : స్పెసిఫికేషన్స్

నోకియా 6.1 ప్లస్  డ్యూయల్ - సిమ్  స్మార్ట్ ఫోన్, బాక్స్ నుండి బయటకు వస్తూనే ఆండ్రాయిడ్ ఒరెయో తో పనిచేస్తుంది. ఈ ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ కావడం వలన మనకి టైం ప్రకారం అప్డేట్స్ అందుతాయి. ఈ డివైజ్ 19: 9 యాస్పెక్ట్ రేషియో తో కూడిన 1080 x 2280 పిక్సల్స్ రిజల్యూషన్ గా కలిగిన 5.8 అంగుళాల పూర్తి హెచ్ డి +  డిస్ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 3  రక్షణతో  అందించబడింది.

 నోకియా 6.1 ప్లస్ స్నాప్ డ్రాగన్ 636 SoC, 6జీబీ LPDDR 4X ర్యామ్ మరియు 64జీబీ స్టోరేజి  తో అనుసంధానమవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుకవైపు 16MP + 5MP తో డ్యూయల్ - కెమెరా సెటప్ ఉంటుంది, ఇంకా ముందు భాగంలో సెల్ఫీల కోసం  16MP  కెమెరా ఉంటుంది. 64జీబీ  అంతర్గత మెమొరీలతో పాటుగా (దాదాపు 400జీబీ వరకు) స్టోరేజీ విస్తరించగల స్మార్ట్ ఫోన్. ఒక 3060mAh బ్యాటరీ మొత్తం ప్యాకేజీకి అవసరమైన  శక్తినందిస్తుంది

logo
Raja Pullagura

నోకియా 5.1 Plus 4 GB

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

టాప్ -ప్రోడక్టులు

హాట్ డీల్స్

మొత్తం చూపించు

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.