Lava Virat Curve ఫస్ట్ సేల్ నుంచి రూ. 19,999 ధరకే లభిస్తుంది.. ఛాన్స్ రేపు ఒక్క రోజు మాత్రమే.!

HIGHLIGHTS

Lava Virat Curve ఫస్ట్ సేల్ నుంచి రూ. 19,999 ధరకే లభిస్తుంది

లావా ఈ కొత్త కర్వుడ్ స్మార్ట్ ఫోన్ ని రూ. 23,999 ధరతో లాంచ్ చేసింది

ఈ ఛాన్స్ రేపు ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉంటుందని గుర్తుంచుకోండి

Lava Virat Curve ఫస్ట్ సేల్ నుంచి రూ. 19,999 ధరకే లభిస్తుంది. వాస్తవానికి, లావా ఈ కొత్త కర్వుడ్ స్మార్ట్ ఫోన్ ని రూ. 23,999 రూపాయల ధరతో కేవలం సింగల్ వేరియంట్ తో లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ లాంచ్ సందర్భంగా ఈ ఫోన్ పై భారీ ఫస్ట్ డే సేల్ డీల్ ని ప్రకటించింది. అదేమిటంటే, సెప్టెంబర్ 28న జరిగే ఈ ఫోన్ ఫస్ట్ సేల్ నుంచి ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికి ఏకంగా రూ. 4,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ఫస్ట్ డే సేల్ నుంచి మీకు కేవలం రూ. 19,999 ఆఫర్ ధరకే లభిస్తుంది. అయితే, ఈ ఛాన్స్ రేపు ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉంటుందని గుర్తుంచుకోండి.

Lava Virat Curve: ప్రైస్

లావా ఈ ఫోన్ ను కేవలం 6GB +128GB వేరియంట్ తో మాత్రమే అందించింది మరియు ఈ ఫోన్ రెగ్యులర్ ప్రైస్ నిరూ. 23,999 గా ప్రకటించింది. పైన తెలిపిన విధంగా ఈ ఫోన్ ను ఫస్ట్ డే సేల్ నుంచి తీసుకునే వారికి రూ. 19,999 ధరకే లభిస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతుంది. ఇది ఎల్లోరా స్లేట్, హెరిటేజ్ ఇండిగో మరియు మకరాణా ఐవరీ అనే మూడు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ రేపు రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం అవుతుంది.

Lava Virat Curve: ఫీచర్స్

ఈ ఫోన్ వేగాన్ లెథర్ బ్యాక్ తో గొప్ప ప్రీమియం అండ్ స్లీక్ లుక్ తో ఉంటుంది. ఇందులో 6.67 ఇంచ్ 3D కర్వుడ్ AMOLED డిస్ప్లే మరియు వెనుక మిని డిస్ప్లే కూడా ఉంటుంది. మెయిన్ డిస్ప్లే FHD + రిజల్యూషన్, 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. వెనుక మిని డిస్ప్లే బ్యాటరీ, ఎమోజీ, నోటిఫికేషన్, మ్యూజిక్, వాల్యూమ్ వంటి వివరాలు చూపెడుతుంది.

లావా ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7100 చిప్ సెట్ జతగా 6GB ఫిజికల్ ర్యామ్ అండ్ 6GB వర్చువల్ ర్యామ్ తో టోటల్ 12GB ఫీచర్ తో అందించింది. ఈ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ గా ఉన్నా కూడా లావా ఈ ఫోన్ ను MIL-STD 810H మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో అందించడం విశేషం. ఇది ఆండ్రాయిడ్ 16 OS తో నడుస్తుంది మరియు 2 ఇయర్స్ OS అప్‌గ్రేడ్ మరియు 3 ఇయర్స్ రెగ్యులర్ సెక్యూరిటీ అప్‌డేట్స్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Also Read: ఐఫోన్ డీల్స్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్.. iPhone 15 పై జబర్దస్త్ డిస్కౌంట్ అందుకోండి.!

ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 50MP SONY IMX 752 మెయిన్ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా మరియు 13MP సెల్ఫీ కెమెరాని ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ కెమెరా 30FPS తో 2K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 4K వీడియో రికార్డింగ్ లేదని గమనించాలి మరియు ఇది ఈ ఫోన్ లో ఉన్న ఏకైక లోటుగా చెప్పవచ్చు. కానీ, ఈ ఫోన్ లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :