Lava Virat Curve ఫస్ట్ సేల్ నుంచి రూ. 19,999 ధరకే లభిస్తుంది.. ఛాన్స్ రేపు ఒక్క రోజు మాత్రమే.!
Lava Virat Curve ఫస్ట్ సేల్ నుంచి రూ. 19,999 ధరకే లభిస్తుంది
లావా ఈ కొత్త కర్వుడ్ స్మార్ట్ ఫోన్ ని రూ. 23,999 ధరతో లాంచ్ చేసింది
ఈ ఛాన్స్ రేపు ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉంటుందని గుర్తుంచుకోండి
Lava Virat Curve ఫస్ట్ సేల్ నుంచి రూ. 19,999 ధరకే లభిస్తుంది. వాస్తవానికి, లావా ఈ కొత్త కర్వుడ్ స్మార్ట్ ఫోన్ ని రూ. 23,999 రూపాయల ధరతో కేవలం సింగల్ వేరియంట్ తో లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ లాంచ్ సందర్భంగా ఈ ఫోన్ పై భారీ ఫస్ట్ డే సేల్ డీల్ ని ప్రకటించింది. అదేమిటంటే, సెప్టెంబర్ 28న జరిగే ఈ ఫోన్ ఫస్ట్ సేల్ నుంచి ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికి ఏకంగా రూ. 4,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ఫస్ట్ డే సేల్ నుంచి మీకు కేవలం రూ. 19,999 ఆఫర్ ధరకే లభిస్తుంది. అయితే, ఈ ఛాన్స్ రేపు ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉంటుందని గుర్తుంచుకోండి.
SurveyLava Virat Curve: ప్రైస్
లావా ఈ ఫోన్ ను కేవలం 6GB +128GB వేరియంట్ తో మాత్రమే అందించింది మరియు ఈ ఫోన్ రెగ్యులర్ ప్రైస్ నిరూ. 23,999 గా ప్రకటించింది. పైన తెలిపిన విధంగా ఈ ఫోన్ ను ఫస్ట్ డే సేల్ నుంచి తీసుకునే వారికి రూ. 19,999 ధరకే లభిస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతుంది. ఇది ఎల్లోరా స్లేట్, హెరిటేజ్ ఇండిగో మరియు మకరాణా ఐవరీ అనే మూడు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ రేపు రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం అవుతుంది.
Lava Virat Curve: ఫీచర్స్
ఈ ఫోన్ వేగాన్ లెథర్ బ్యాక్ తో గొప్ప ప్రీమియం అండ్ స్లీక్ లుక్ తో ఉంటుంది. ఇందులో 6.67 ఇంచ్ 3D కర్వుడ్ AMOLED డిస్ప్లే మరియు వెనుక మిని డిస్ప్లే కూడా ఉంటుంది. మెయిన్ డిస్ప్లే FHD + రిజల్యూషన్, 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. వెనుక మిని డిస్ప్లే బ్యాటరీ, ఎమోజీ, నోటిఫికేషన్, మ్యూజిక్, వాల్యూమ్ వంటి వివరాలు చూపెడుతుంది.

లావా ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7100 చిప్ సెట్ జతగా 6GB ఫిజికల్ ర్యామ్ అండ్ 6GB వర్చువల్ ర్యామ్ తో టోటల్ 12GB ఫీచర్ తో అందించింది. ఈ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ గా ఉన్నా కూడా లావా ఈ ఫోన్ ను MIL-STD 810H మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో అందించడం విశేషం. ఇది ఆండ్రాయిడ్ 16 OS తో నడుస్తుంది మరియు 2 ఇయర్స్ OS అప్‌గ్రేడ్ మరియు 3 ఇయర్స్ రెగ్యులర్ సెక్యూరిటీ అప్‌డేట్స్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: ఐఫోన్ డీల్స్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్.. iPhone 15 పై జబర్దస్త్ డిస్కౌంట్ అందుకోండి.!
ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 50MP SONY IMX 752 మెయిన్ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా మరియు 13MP సెల్ఫీ కెమెరాని ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ కెమెరా 30FPS తో 2K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 4K వీడియో రికార్డింగ్ లేదని గమనించాలి మరియు ఇది ఈ ఫోన్ లో ఉన్న ఏకైక లోటుగా చెప్పవచ్చు. కానీ, ఈ ఫోన్ లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
