ఇండియాలో విడుదలైన COOLPAD COOL 5

ఇండియాలో విడుదలైన COOLPAD COOL 5
HIGHLIGHTS

కూల్‌ప్యాడ్ కూల్ 5 ను భారతదేశంలో కేవలం రూ .7,999 ధరకు విడుదల చేశారు.

స్మార్ట్‌ ఫోన్ తయారీ సంస్థ అయిన,  కూల్‌ప్యాడ్ తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ ఫోన్ కూల్‌ప్యాడ్ కూల్ 5 ను భారతదేశంలో విడుదల చేసింది. లాంచ్ సమయంలో ఈ ఫోన్   యొక్క లక్షణాలు, ధర మరియు లభ్యత గురించి కంపెనీ హైలైట్ చేసింది. కూల్‌ప్యాడ్ కూల్ 5 ను భారతదేశంలో కేవలం రూ .7,999 ధరకు విడుదల చేశారు. ధరను చూస్తే, షావోమి, రియల్మీ, మోటరోలా మరియు శామ్సంగ్ మొదలైన ఫోన్లు ఈ స్మార్ట్ ఫోనుకు ఫొటోగా ఉన్నాయని  చెప్పవచ్చు.

కూల్‌ప్యాడ్ కూల్ 5 ఫీచర్లు

ఈ కూల్‌ప్యాడ్ కూల్ 5 యొక్క స్పెసిఫికేషన్ల గురించి చూస్తే, ఈ ఫోన్ ఒక 6.2-అంగుళాల HD + డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది ఒక 19: 9 యాస్పెక్ట్ రేషియో మరియు ఫోన్  పైభాగంలో ఒక డ్యూడ్రాప్ నోచ్ తో వస్తుంది మరియు ఈ ఫోన్‌కు 2.5 D కర్వ్డ్ గ్లాస్ ఇవ్వబడుతుంది. ఇది ఒక మీడియాటెక్ హిలియో MT 6762 SoC శక్తితో వస్తుంది, ఇది ఆక్టా కోర్ CPU మరియు 2GHz వద్ద క్లాక్ చేయబడింది. ఈ కూల్‌ ప్యాడ్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ ఉన్నాయి మరియు శక్తివంతమైన 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా అందించబడింది.

కెమెరా విభాగంలో, ఈ ఫోన్ వెనుక భాగంలో ఒక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. కెమెరా సెటప్‌లో 13 మెగాపిక్సెల్ ప్రాధమిక సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది.

కనెక్టివిటీ కోసం, ఫోన్‌లో మైక్రో యుఎస్‌బి పోర్ట్, బ్లూటూత్, వై-ఫై, జిపిఎస్, ఎఫ్‌ఎం రేడియో, 3.5-మీ ఆడియో సాకెట్ మొదలైనవి ఉన్నాయి. కలర్ ఆప్షన్స్ గురించి మాట్లాడితే, గ్రేడియంట్ బ్లూ, గ్రేడియంట్ గోల్డ్ మరియు మిడ్నైట్ బ్లూ ఆప్షన్లలో కూల్ ప్యాడ్ కూల్ 5 ప్రవేశపెట్టబడింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo