CMF Phone 2 Pro: ప్రోసెసర్ మరియు స్క్రీన్ వివరాలు వెల్లడించింది.!
నథింగ్ సబ్ బ్రాండ్ సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో కొత్త అప్డేట్ ఈరోజు అందించింది
ఈ ఫోన్ ప్రోసెసర్ మరియు డిస్ప్లే వివరాలు ఈరోజు కంపెనీ వెల్లడించింది
ఈ ఫోన్ తో పాటు మూడు ఆడియో ప్రొడక్ట్స్ కూడా లాంచ్ చేస్తున్నట్లు ముందే ప్రకటించింది
CMF Phone 2 Pro: నథింగ్ సబ్ బ్రాండ్ సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ యొక్క కొత్త అప్డేట్ ఈరోజు అందించింది. ఈ ఫోన్ ప్రోసెసర్ మరియు డిస్ప్లే వివరాలు ఈరోజు కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ తో పాటు మూడు ఆడియో ప్రొడక్ట్స్ కూడా లాంచ్ చేస్తున్నట్లు ముందే ప్రకటించింది. ఇప్పుడు వాటిలో ప్రీమియం బడ్స్ వివరాలు కూడా బయట పెట్టింది.
SurveyCMF Phone 2 Pro : లాంచ్
సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ మరియు ఫోన్ తో పాటు మూడు ఆడియో ప్రొడక్ట్స్ కూడా ఏప్రిల్ 28వ తేదీ సాయిరాం`సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు ఇండియాలో లాంచ్ చేయబడతాయి. ఈ కొత్త ప్రోడక్ట్స్ కోసం కంపెనీ చేపట్టిన టీజర్ లో భాగంగా ఈరోజు సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ కలిగిన చిప్ సెట్ ను వెల్లడించింది.

సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7300 ప్రో చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు సిఎంఎఫ్ వెల్లడించింది. కంపెనీ అధికారిక X అకౌంట్ నుంచి ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు, ఈ ఫోన్ ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ Flipkart అందించిన ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజీ నుంచి కూడా ఈ విషయాన్ని లిస్ట్ చేసింది. సిఎంఎఫ్ ఫోన్ 1 ప్రో స్మార్ట్ ఫోన్ తో పోలిస్తే ఈ ఫోన్ మరింత వేగంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.
కేవలం చిప్ సెట్ మాత్రమే కాదు ఈ ఫోన్ కలిగిన డిస్ప్లే గురించి కూడా చెప్పకనే చెప్పింది. అదేమిటంటే, ఈ ఫోన్ 120 FPS BGMI గేమింగ్ మరియు 1,000 Hz టచ్ శాంప్లింగ్ ఆఫర్ చేస్తుందని తెలిపింది. అంటే, ఇందులో గొప్ప రెస్పాన్స్ కలిగిన డిస్ప్లే ఉంటుందని చెప్పకనే చెప్పింది. అంతేకాదు, ఈ ఫోన్ ఫై ఇప్పటి వరకు వచ్చిన రూమర్లు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
ఈ ఫోన్ ను చాలా స్లీక్ డిజైన్ తీసుకొస్తున్నట్లు కూడా కంపెనీ తెలిపింది. ఇది కాకుండా ఈ ఫోన్ తక్కువ అంచులు కలిగి ఎక్కువ స్క్రీన్ ను ఆఫర్ చేసే డిస్ప్లే తో ఉంటుంది. ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్స్ కూడా త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.
Also Read: రూ. 6,000 బడ్జెట్ లో బెస్ట్ 5.1 ఛానల్ Soundbar డీల్స్ పై ఒక లుక్కేద్దామా.!
CMF Buds 2
ఈ ఫోన్ తో పాటు బడ్స్ 2 గురించి కూడా టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ బడ్స్ గొప్ప క్లారిటీ అందించే విధంగా ఉంటాయని కంపెనీ టీజింగ్ చేస్తోంది. ఈ కంపెనీ నుంచి ముందుగా వచ్చిన బడ్స్ తో పోలిస్తే ఈ అప్ కమింగ్ బడ్స్ సిమిలర్ డిజైన్ లో కొత్త పారదర్శక వాల్యూమ్ రింగ్ తో కనిపిస్తోంది. అయితే, ఈ అప్ కమింగ్ బడ్స్ ఎలాంటి ఫీచర్స్ కలిగి ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
