BSNL Satellite Phone: ఎక్కడి నుంచైనా ఫోన్ చేసే శాటిలైట్ ఫోన్ లాంచ్ చేసిన బిఎస్ఎన్ఎల్.!

HIGHLIGHTS

శాటిలైట్ తో పని చేసే కొత్త శాటిలైట్ మొబైల్ ఫోన్ ని బిఎస్ఎన్ఎల్ లాంచ్ చేసింది

అడ్వంచర్స్ చేసే వారికి ఇది నిజంగా గొప్ప ఆప్షన్ అవుతుంది

అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో ఉపయోగించేందుకు ప్రత్యేకంగా రూపొందించారు

BSNL Satellite Phone: ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ సంప్రదాయ మొబైల్ నెట్వర్క్ తో పని చేసే మొబైల్ మాదిరిగా కాకుండా శాటిలైట్ తో పని చేసే కొత్త శాటిలైట్ మొబైల్ ఫోన్ ని లాంచ్ చేసింది. సెల్యులార్ నెట్ వర్క్ లేని ప్రాంతాల్లో మరియు సమయంలో కూడా కమ్యూనికేషన్‌ ను కొనసాగించేందుకు బిఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ ఒక విశ్వసనీయ పరిష్కారంగా నిలుస్తుంది. అడ్వెంచర్ చేసే వారికి ఇది నిజంగా గొప్ప ఆప్షన్ అవుతుంది.

BSNL Satellite Phone: ఏమిటి ఇది?

అడవులు, సముద్ర ప్రాంతాలు, పర్వతాలు, గనుల ప్రాంతాలు లేదా ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో సెల్యులార్ నెట్‌ వర్క్ పూర్తిగా పనిచేయకపోవచ్చు. అటువంటి సమయాల్లో కూడా ఈ బిఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ చాలా చక్కగా పని చేస్తుంది. ఎందుకంటే, ఈ శాటిలైట్ ఫోన్‌ ను ముఖ్యంగా నెట్‌ వర్క్ అందుబాటులో లేని లేదా అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో ఉపయోగించేందుకు ప్రత్యేకంగా రూపొందించారు.

ఇది ముఖ్యంగా ఉపయోగపడే రంగాలు:

  • రక్షణ దళాలు (Defence)
  • సముద్ర రవాణా (Maritime)
  • విపత్తు సహాయక చర్యలు (Disaster Response)
  • మైనింగ్ మరియు గనుల పరిశ్రమ
  • మారుమూల ప్రాంతాల్లో పనిచేసే సంస్థలు
  • ట్రెక్కింగ్, అడ్వెంచర్ ట్రావెల్ చేసే ప్రయాణికులు

BSNL Satellite Phone : ప్రధాన ఫీచర్లు

సాధారణ మొబైల్ టవర్లు అందుబాటులో లేకపోయినా ఉపగ్రహ నెట్‌వర్క్ ద్వారా యూజర్ కు కనెక్టివిటీ లభిస్తుంది. ఈ ఫోన్ తో నెట్‌వర్క్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఎటువంటి సమస్య లేకుండా చాలా క్లియర్ వాయిస్ కాల్ చేయడానికి వీలుంటుంది. ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితులు లేదా దూర ప్రాంతాల్లో చిక్కుకున్నప్పుడు కమ్యూనికేషన్ కొనసాగించడానికి ఇది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది.

ఈ ఫోన్ ను చాలా ఎక్కువ సమయం నిలిచి ఉండే దీర్ఘకాల బ్యాటరీ బ్యాకప్ తో రూపొందించారు. తరచుగా ఛార్జింగ్ చేసే అవకాశం లేని ప్రాంతాల్లో ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ధర ఎంత?

బిఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ ను రూ. 1,34,166 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ప్రైస్ అన్ని పన్నులు (Inclusive of all Taxes) కలిపి ఉన్నాయని కూడా తెలిపింది.

ఎవరు కొనుగోలు చేయాలి?

ఈ ఫోన్ సాధారణ వినియోగదారుల కోసం కాకుండా ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తులు మరియు సంస్థల కోసం అనువుగా ఉంటుంది.

  • ప్రభుత్వ సంస్థలు
  • అత్యవసర సేవల విభాగాలు
  • రక్షణ రంగం
  • సముద్ర రవాణా సంస్థలు
  • మైనింగ్ కంపెనీలు
  • అడ్వెంచర్ ఎక్స్‌పెడిషన్ టీమ్‌లు
  • నెట్‌వర్క్ అందుబాటులో లేని ప్రాంతాల్లో పనిచేసే సంస్థలు

పైన తెలిపిన రంగాల వారు ఈ ఫోన్ ను కొనుగోలు చేయడానికి అనుమతి ఉంటుంది.

Also Read: చైనీస్ యాప్‌ తో ATM Shut Down చేయొచ్చా .. వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఏమిటి.!

కొనుగోలు చేసే ముందు తెలుసుకోవాల్సిన విషయం

శాటిలైట్ ఫోన్ మనం ఉపయోగించే సాధారణ స్మార్ట్‌ ఫోన్‌ మాదిరిగా మొబైల్ టవర్ల ద్వారా పనిచేయదు. అలాగే శాటిలైట్ సేవలను ఉపయోగించడానికి సంబంధిత నిబంధనలు, సేవా ప్లాన్‌లు మరియు అనుమతులు వర్తించవచ్చు. కాబట్టి, ఈ ఫోన్ కొనుగోలు చేసే ముందు BSNL అందించే సర్వీస్ వివరాలు, టారిఫ్‌ లు మరియు అందుబాటులో ఉన్న ప్రాంతాల గురించి తెలుసుకోవడం మంచిది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :