చైనీస్ యాప్ తో ATM Shut Down చేయొచ్చా .. వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఏమిటి.!
ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది
ATM Shut Down చేసి మళ్ళీ ఆన్ చేస్తున్నట్లు వైరల్ వీడియో
సాంకేతికంగా ఇలాంటిది సాధ్యమేనా? ఫ్యాక్ట్ చెక్ ఏమి చెబుతోంది
ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్ లోని ఒక చైనీస్ యాప్ ను ఉపయోగించి ATM ను ఆఫ్ చేసి, మళ్ళీ ఆన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోతో పాటు “చైనీస్ యాప్ లు భారతదేశానికి పెద్ద ముప్పు” మరియు ఇవి “ATM లను కూడా రిమోట్ గా నియంత్రించగలవు” అనే ట్యాగ్ లైన్ మరియు వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ వాదనలో ఎంత వరకు నిజం ఉంది? అని సాంకేతికంగా ఇలాంటిది సాధ్యమేనా? అని ఈ అంశాన్ని ఫ్యాక్ట్ చెక్ చేద్దాం.
Surveyవైరల్ వీడియో లో ఏముంది?
వీడియోలో ఒక వ్యక్తి మొబైల్ యాప్ లో కొన్ని బటన్లు నొక్కిన వెంటనే ATM స్క్రీన్ ఆఫ్ అయినట్లు మరియు మళ్లీ యాప్ ద్వారా ఆన్ అయినట్లు కనిపిస్తోంది. అయితే వీడియో లో అతను ఉపయోగించిన యాప్ పేరు, అది ATM తో ఎలా కనెక్ట్ అయింది లేదా వీడియో ఎక్కడ చిత్రీకరించబడింది అనే వివరాలు మాత్రం ఎక్కడా స్పష్టంగా లేదు. కాబట్టి, కేవలం ఈ వీడియోను చూసి ఇది నిజంగా యాప్ వల్ల జరిగిందని నిర్ధారించడం సాధ్యం కాదు.

అయితే, ఇందులో ఉపయోగించిన యాప్ BAT BMS అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాప్ ఇప్పటికే e-Rickshaw లకు చిక్కులు తెచ్చే యాప్ గా దేశంలో చాలా చెడ్డ పేరు తెచ్చుకుంది.
BAT BMS యాప్ అంటే ఏమిటి?
BAT BMS (Battery Management System) యాప్ గా చెబుతారు. ఈ BMS యాప్ లు ప్రధానంగా లిథియం అయాన్ బ్యాటరీలను పర్యవేక్షించడానికి ఉపయోగిస్తారు. వాటి ద్వారా సాధారణంగా బ్యాటరీ ఛార్జ్ శాతం చూడటం, బ్యాటరీ ఉష్ణోగ్రతను పర్యవేక్షించడం మరియు ఛార్జింగ్ స్థితిని కూడా తెలుసుకోవచ్చు. అంతేకాదు, కొన్ని అనుకూల బ్యాటరీల్లో ఛార్జింగ్ లేదా డిశ్చార్జింగ్ ను కూడా నియంత్రించవచ్చు.
ఈ యాప్ లు వాటికి అనుసంధానమైన ప్రత్యేక BMS హార్డ్ వేర్ తో మాత్రమే పనిచేస్తాయి. ఇవి ఇతర పరికరాలను నియంత్రించలేవు. అయితే, e-Rickshaw లను ఈ యాప్ తో ఎక్కడ బడితే అవుతున్నట్లు వచ్చిన ఒక వైరల్ వీడియోతో ఈ యాప్ వార్తల్లోకెక్కింది.
మరి ATM లను మొబైల్ యాప్ తో నియంత్రించవచ్చా?
మరి ATMలను మొబైల్ యాప్‌తో నియంత్రించవచ్చా? అని అడిగితే ఇలా జరగడం ఎట్టి పరిస్థితుల్లో జరగని పని అని నిపుణులు చెబుతున్నారు. ATM లు అత్యంత భద్రత తో రూపొందించబడిన బ్యాంకింగ్ వ్యవస్థ. ఇందులో అనేక భద్రతా వ్యవస్థలు ఉంటాయి.
సురక్షిత నెట్ వర్క్ ల ద్వారా బ్యాంక్ సర్వర్లతో అనుసంధానమై ఉంటాయి.
మల్టీ లేయర్ భద్రతా విధానాలు అనుసరిస్తాయి.
అనధికారిక మొబైల్ యాప్ లకు యాక్సెస్ ఇవ్వవు.
ప్రత్యేక సాఫ్ట్ వేర్, హార్డ్‌వేర్ మరియు భద్రతా ప్రమాణాలపై ఆధారపడి పనిచేస్తాయి.
అందువల్ల ఒక సాధారణ మొబైల్ యాప్ తో ATM ను రిమోట్ గా ఆఫ్ లేదా ఆన్ చేయడం అసాధ్యం.
Also Read: Motorola Edge 70 Max: పవర్ ఫుల్ వైర్లెస్ ఛార్జ్ వంటి ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ కి సిద్ధం.!
సైబర్ నిపుణులు ఏమంటున్నారు?
ఈ విషయంగా మేము సైబర్ మీడియా రీసెర్చ్ (CMR) ను సంప్రదించాము. ఈ విషయం గురించి సైబర్ మీడియా రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ (VP), ప్రభు రామ్ మాట్లాడుతూ,
“సోషల్ మీడియా యుగంలో ధృవీకరణ కంటే వైరల్ అయ్యే విషయానికే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. వైరల్ అవుతున్న ఈ ఏటీఎం వీడియోలో యాప్ కు మరియు మెషీన్ కు మధ్య ధృవీకరించబడిన సాంకేతిక సంబంధం ఏదీ కనిపించడం లేదు. ఈ దశలో, దీనిని ఒక నిజమైన హ్యాకర్ చర్యకు సాక్ష్యంగా కాకుండా, ధృవీకరించబడని ఒక ప్రదర్శనగా పరిగణించడం ఉత్తమం. ఏటీఎం లు వినియోగదారుల బ్లూటూత్ లేదా ఓపెన్ వై ఫైపై కాకుండా, సురక్షితమైన, ఎన్‌క్రిప్టెడ్ బ్యాంకింగ్ నెట్ వర్క్ లపై పనిచేస్తాయి. అందువల్ల, అటువంటి రిమోట్ కంట్రోల్ జరిగే అవకాశం చాలా తక్కువ. స్వతంత్ర సాంకేతిక విశ్లేషణ దీనికి విరుద్ధంగా నిర్ధారించే వరకు, వినియోగదారులు ఈ వాదనను సందేహంతో చూడాలి”
అని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.
ఫ్యాక్ట్ చెక్
ఈ వీడియో గురించి వినిపించిన వాదన ఫ్యాక్ట్ చెక్ చేస్తే, చైనీస్ మొబైల్ యాప్ తో ATM ను షట్ డౌన్ చేయవచ్చు అనేది తప్పుడు వాదన (False).
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
