సరికొత్త టాప్ 5 బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు : రూ. 10,000 కంటే తక్కువ ధరలో

HIGHLIGHTS

బడ్జెట్ ధర కొనుగోలుదారులను టార్గెట్ చేసుకొని విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లు.

సరికొత్త టాప్ 5 బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు : రూ. 10,000 కంటే తక్కువ ధరలో

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైయ్యే స్మార్ట్ ఫోనులు, మిడ్ రేంజ్ మరియు బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చినవే కావడం వలన, అన్ని ప్రధాన స్మార్ట్ ఫోన్ తయారీదారు కంపెనీలు ఈ ధర పరిధిలోనే అత్యధికంగా తమ ఫోన్లను అందిస్తుంటాయి. అంతేకాదు, ధర తక్కువగా ఉంది కదా దీంట్లో ప్రత్యేకతలు ఏముంటాయి? అని మీరు అస్సలు అనుమానం పెట్టుకోవాల్సిన పనిలేదు, వీటిలో ప్రస్తుతం మార్కెట్లో ట్రెండీగా నడుస్తున్న వాటర్ డ్రాప్ మొదలుకొని డ్యూయల్ AI కెమేరాలు వరకు అన్నింటిని కలిగి ఉంటాయి. మరి అటువంటి వాటిలో ఉత్తమైన 5 స్మార్ట్ ఫోన్లను ఇక్కడ జాబితాలో అందిస్తున్నాము.   

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. షావోమి రెడ్మి నోట్ 7

ఈ స్మార్ట్ ఫోన్ను షావోమి సరికొత్తగా ఇండియాలో విడుదల చేసింది మరియు దీని అమ్మకాలు కూడా మొదలయ్యాయి. ఈ ఫోన్ను మంచి డిజైన్ మరియు స్పెక్స్ తో అందించింది షావోమి సంస్థ. ఇది ముందు మరియు వెనుక కూడా ఒక కొర్ణింగ్ గోరిల్లా గ్లాస్ 5 రక్షణతో ఉంటుంది. ఇది డిస్ప్లే పైన వాటర్ డ్రాప్ నోచ్ తో ఒక 19.5:9 యాస్పెక్ట్ రేషియాతో  2340×1080 పిక్సెళ్ళు అందించగల ఒక 6.3-అంగుళాల FHD +డిస్ప్లే తో వస్తుంది. వేనుక 12MP + 2MP డ్యూయల్ కెమేరా సెటప్ తో పాటుగా ముందు 13MP సెల్ఫీ కెమేరాని ఇందులో అందించారు.

2. రియల్మీ 3

 రియల్మీ 3 స్మార్ట్ ఫోన్ను రియల్మీ సరికొత్తగా ఇండియాలో విడుదల చేసింది మరియు దీని అమ్మకాలు మొదలవ్వనున్నాయి. ఈ ఫోన్ను మంచి డిజైన్ మరియు స్పెక్స్ తో అందించింది రియల్మీ సంస్థ. ఇది ఒక 19: 9 డిస్ప్లే యాస్పెక్ట్ రేషియాతో మరియు ఒక వాటర్ డ్రాప్ నోచ్ రూపకల్పనతో గల ఒక 6.3-అంగుళాల HD + స్క్రీన్ కలిగి ఉంటుంది. వేనుక 13MP + 2MP డ్యూయల్ కెమేరా సెటప్ తో పాటుగా ముందు 13MP సెల్ఫీ కెమేరాని ఇందులో అందించారు.

3. శామ్సంగ్  గెలాక్సీ M10   

ఈ శామ్సంగ్  గెలాక్సీ M10 స్మార్ట్ ఫోన్ను శామ్సంగ్ సరికొత్తగా ఇండియాలో విడుదల చేసింది మరియు దీని అమ్మకాలు కూడా ముందుగానే మొదలయ్యాయి. ఈ ఫోన్ను మంచి డిజైన్ మరియు స్పెక్స్ తో అందించింది శామ్సంగ్. ఇది ఒక 19: 9 డిస్ప్లే యాస్పెక్ట్ రేషియాతో మరియు ఒక వాటర్ డ్రాప్ నోచ్ రూపకల్పనతో గల ఒక 6.22 -అంగుళాల HD + స్క్రీన్ కలిగి ఉంటుంది. వేనుక 13MP + 5MP డ్యూయల్ కెమేరా సెటప్ తో పాటుగా ముందు 5MP సెల్ఫీ కెమేరాని ఇందులో అందించారు.

4. అసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2                    

ఈ అసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2 స్మార్ట్ ఫోన్ను అసూస్ గతసంవత్సరం ఇండియాలో విడుదల చేసింది మరియు ఇది గొప్ప అమ్మకాలను కూడా సాధించింది. ఈ ఫోన్ను మంచి డిజైన్ మరియు స్పెక్స్ తో అందించింది అసూస్. ఇది ఒక సాధారణ నోచ్ రూపకల్పనతో గల ఒక 6.26 -అంగుళాల FHD + స్క్రీన్ కలిగి ఉంటుంది. వేనుక 12MP + 5MP డ్యూయల్ కెమేరా సెటప్ తో పాటుగా ముందు 13MP సెల్ఫీ కెమేరాని ఇందులో అందించారు.

5. హానర్ 9N 

ఈ హానర్ 9N స్మార్ట్ ఫోన్ను హానర్ గతసంవత్సరం ఇండియాలో విడుదల చేసింది మరియు ఇది గొప్ప అమ్మకాలను కూడా సాధించింది. ఈ ఫోన్ను మంచి డిజైన్ మరియు స్పెక్స్ తో అందించింది హానర్. ఇది ఒక సాధారణ నోచ్ రూపకల్పనతో గల ఒక 5.84 -అంగుళాల FHD + డిస్ప్లే కలిగి ఉంటుంది. వేనుక 13MP + 2MP డ్యూయల్ కెమేరా సెటప్ తో పాటుగా ముందు 16MP సెల్ఫీ కెమేరాని ఇందులో అందించారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo