ఆఫర్ ఈ రోజు మాత్రమే: బోల్ట్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ boltt Evo ఫస్ట్ డే స్పెషల్ ప్రైస్ ఆఫర్ ఈ రోజుతో ముగుస్తుంది.!

HIGHLIGHTS

బోల్ట్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ boltt Evo ఫస్ట్ డే స్పెషల్ ప్రైస్ ఆఫర్ ఈ రోజుతో ముగుస్తుంది

ఈ ఫోన్ లాంచ్ స్పెషల్ ప్రైస్ లో ఈరోజు లభిస్తుంది

ఈ ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది

ఆఫర్ ఈ రోజు మాత్రమే: బోల్ట్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ boltt Evo ఫస్ట్ డే స్పెషల్ ప్రైస్ ఆఫర్ ఈ రోజుతో ముగుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను రీసెంట్ గా బోల్ట్ విడుదల చేసింది మరియు బోల్ట్ విడుదల చేసిన మొదటి ఫోన్ కూడా ఇదే అవుతుంది. ఈ ఫోన్ ఫస్ట్ డే సేల్ రోజు స్టార్ట్ అయ్యింది మరియు ఈ ఫోన్ లాంచ్ స్పెషల్ ప్రైస్ లో ఈరోజు లభిస్తుంది. అయితే, ఈ ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

boltt Evo ఫస్ట్ డే స్పెషల్ ప్రైస్ ఆఫర్

బోల్ట్ ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 9999 రూపాయల లాంచ్ ప్రైస్ లో విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ రేట్లు బాగా పెరిగిన విషయం అందరికీ తెలుసు. అయితే, ఈ హైక్ రోజుల్లో కూడా బొల్ట్ ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో అందించడం విశేషం.

అయితే, ఈ లాంచ్ ఆఫర్ ఈ రోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ Axis క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి రూ. 500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది.

Also Read: Vivo T5 స్మార్ట్ ఫోన్ ఈ టాప్ 5 టర్బో ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది.!

boltt Evo: ఫీచర్స్

ఈ బోల్ట్ ఈవో స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో బిగ్ డిస్ప్లే మరియు బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.79 ఇంచ్ బిగ్ స్క్రీన్ ని HD+ రిజల్యూషన్ మరియు 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ తక్కువ బెజెల్స్ మరియు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Unisoc T7250 ఆక్టా కోర్ 4G చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ కూడా అందించింది.

ఈ ఫోన్ లో ఆటో ఫోకస్ సపోర్ట్ కలిగిన 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది 30 FPS FHD వీడియో రికార్డింగ్ మరియు ఏఐ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6000 mAh భారీ బ్యాటరీతో అందించింది మరియు ఇందులో ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 OS పై నడుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :