Vivo Z1 Pro మరియు Vivo Z1 X ఫోన్ల పైన మరొకసారి భారీ తగ్గింపు : లేటెస్ట్ ధరల కోసం ఇక్కడ చూడండి

HIGHLIGHTS

కొత్త ధరలతో బడ్జెట్ ధరలో మరింత పోటీ ఫోన్లుగా నిలిచాయి.

Vivo Z1 Pro మరియు Vivo Z1 X ఫోన్ల పైన మరొకసారి భారీ తగ్గింపు : లేటెస్ట్ ధరల కోసం ఇక్కడ చూడండి

వివో జెడ్ 1 ప్రో మరియు వివో జెడ్ 1 ఎక్స్ స్మార్ట్‌ ఫోన్లను గత ఏడాది జూలై, సెప్టెంబర్‌ నెలలో భారతదేశంలో విడుదల చేసింది. ఈ మిడ్-రేంజ్ హ్యాండ్‌ సెట్లు రెండూ కూడా  స్నాప్‌డ్రాగన్ 712 AIE 10nm చిప్‌ సెట్ యొక్క శక్తిని కలిగి ఉన్నాయి మరియు షావోమి, రియల్మీ మరియు మరిన్ని ఇటువంటి కంపెనీల స్మార్ట్ ఫోన్లకు నేరుగా పోటీదారులుగా ఉంటాయి. వివో జెడ్ 1 ప్రో మరియు వివో జెడ్ 1 ఎక్స్ ఇప్పుడు భారతదేశంలో ప్రైస్ కట్ (తగ్గింపును) అందుకున్నాయి మరియు అవి వాటి  మునుపటి ధర కంటే రూ .1,000 తక్కువతో లభిస్తాయి. వివో జెడ్ 1 ప్రోకు ఇది రెండవ ధర తగ్గింపు, ఇది గతంలో రూ .2,000 తగ్గింపును నవంబరులో అందుకుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

వివో జెడ్ 1 ప్రో మరియు వివో జెడ్ 1 ఎక్స్ పై డిస్కౌంట్

వివో జెడ్ 1 ప్రో యొక్క 4 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ వెర్షన్ ఇప్పుడు రూ .12,990 గా ఉంది, ఇది రూ .13,990 నుండి తగ్గింపు పొందింది. ఈ ఫోన్ యొక్క 6 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ వెర్షన్ కూడా రూ .1000 తగ్గింపుతో, ఇప్పుడు రూ .13,990 కు లభిస్తుంది. వివో జెడ్ 1 ప్రో మిర్రర్ బ్లాక్, సోనిక్ బ్లూ మరియు సోనిక్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది.

వివో జెడ్ 1 ఎక్స్ యొక్క 4 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ వెర్షన్ గతంలో రూ .15,990 గా ఉండేది. అయితే, ఇది 1000 రుపాయల్ తగ్గిపును అందుకున్న తరువాత  ఇప్పుడు ఇది రూ .14,990 కు లభిస్తుంది. ఈ హ్యాండ్‌ సెట్ యొక్క 6 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ మోడల్ రూ .17,990 నుండి తగ్గించబడి రూ .16,990 కు లభిస్తుంది.  

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile