Redmi 10: ఫ్లిప్ కార్ట్ నుండి భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది.!
Redmi 10 ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ నుండి భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది
Redmi 10 పైన ఫ్లిప్ కార్ట్ అందించిన బెస్ట్ డీల్
10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది
షియోమి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Redmi 10 ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ నుండి భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. బడ్జెట్ ధరలో రెడ్ మి బడ్జెట్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికీ ఇదే సరైన సమయం. Redmi 10 స్నాప్ డ్రాగన్ 680 చిప్ సెట్, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.10,000 కంటే తక్కువ ధరకే లభిస్తోంది. Redmi 10 పైన ఫ్లిప్ కార్ట్ అందించిన బెస్ట్ డీల్ వివరాలు తెలుసుకోండి.
SurveyRedmi 10: ధర
ఇక రెడ్ మీ 10 ప్రో యొక్క 4GB+64GB వేరియంట్ రూ.10,999 ధరతో లాంచ్ కాగా, ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి రూ.9,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి BoB, IndusInd మరియు IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ ను కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
Redmi 10: స్పెక్స్
ముందుగా ఈ ఫోన్ కంప్లీట్ స్పెక్స్ షీట్ ను చూస్తే, రెడ్ మీ 10 పెద్ద 6.71 ఇంచ్ HD రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేతో వస్తుంది. ఇది Widevine L1 సపోర్ట్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో ఉంటుంది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 6nm స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వస్తుంది మరియు జతగా 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. అంతేకాదు, మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్ విస్తరణతో పాటుగా 2GB వరకూ వర్చువల్ RAM ను కూడా పొందుతారు.
కెమెరాల పరంగా, ఈ ముసార్ట్ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50 MP ప్రైమరీ కెమెరాకి జతగా 2MP డెప్త్ సెన్సార్ వుంది. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ 18W ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 6000 mAh బిగ్ బ్యాటరీని కూడా కలిగి వుంది (కానీ బాక్స్‌లో 10W అడాప్టర్ మాత్రమే వస్తుంది). ఈ షియోమీ లేటెస్ట్ బడ్జెట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా MIUI 12 సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile