నోకియా 5.1 ప్లస్ పైన భారీ డిస్కౌంట్ : నమ్మకశక్యం కానీ ధరకే

Updated on 13-Aug-2019
HIGHLIGHTS

Flipkart తన నేషనల్ షాపింగ్ డేస్ సేల్ సందర్భంగా NOKIA 5.1 PLUS స్మార్ట్ ఫోన్ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది.

 Flipkart తన నేషనల్ షాపింగ్ డేస్ సేల్ సందర్భంగా  NOKIA 5.1 PLUS స్మార్ట్ ఫోన్ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ముందుగా, రూ.10,999 ధరతో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ పైన ఇప్పటివరకూ ఎన్నడూ చూడనటువంటి డిస్కౌంట్ ని ప్రకటించింది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ను 3,000 రుపాయల్ డిస్కౌంట్ తో ఫ్లిప్ కార్ట్ నుండి ఈ సేల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

  NOKIA 5.1 PLUS (3GB + 32GB )  అఫర్ ధర – Rs.7,999       

అధనంగా, ICICI  యొక్క డెబిట్ & క్రెడిట్ కార్డులతో ఈ స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేసే వారికి 10% తక్షణ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంటుంది. అధనంగా, NO Cost EMI, Axis BUZZ కార్డుతో 5% డిస్కౌంట్ మరియు ఎక్స్చేంజి ఆఫర్లు వంటివి అందించింది.        

నోకియా 5.1 ప్లస్ స్పెసిఫికేషన్స్

ఈ నోకియా 5.1 ప్లస్ ఒక 5.86 అంగుళాల HD + డిస్ప్లేను 19: 9 యొక్క యాస్పెక్ట్ రేషియాతో మరియు 84 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో కలిగి ఉంటుంది . ఈ ఫోన్ ఒక 3 జీబి ర్యామ్ కలిగి ఒక మీడియా టెక్ హీలియో P60 చిప్సెట్తో శక్తిని కలిగి ఉంది మరియు 32GB అంతర్గత స్టోరేజితో లభిస్తుంది, ఇది 256GB వరకు మెమోరిని పెంచుకునే ఎంపికను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ఒక f / 2.0 ఎపర్చరుతో 13MP + 5MP లెన్సులతో డ్యూయల్ – రియర్ కెమెరా సెటప్ ఉంటుంది మరియు ముందు భాగంలో, f / 2.2 ఎపర్చర్ మరియు 80.4- డిగ్రీ యాంగిల్ గల 8MP యూనిట్ ఉంది.

ఈ సంస్థ అందించే ఇతర స్మార్ట్ఫోన్ల మాదిరిగానే, నోకియా 5.1 ప్లస్ కూడా Android One వన్ కార్యక్రమం కింద వస్తుంది, దీని అర్థం స్మార్ట్ఫోన్ సకాలంలో భద్రత మరియు OS అప్డేట్లను పొందుతుంది. HMD గ్లోబల్ తెలిపిన ప్రకారం, నోకియా 5.1 ప్లస్ ఆండ్రాయిడ్ 9 పైకి అప్డేట్ చేయబడే మొట్టమొదటి పరికరాల్లో ఒకటిగా ఉంటుంది. ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్ఫోన్ను 3060 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సమర్థిస్తుంది. ఇది 12 గంటల వీడియో ప్లేబ్యాక్ను అందిస్తుందని సంస్థ పేర్కొంది       

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :