iQOO లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పైన రూ.5,000 భారీ తగ్గింపు.!

HIGHLIGHTS

iQOO Neo 6 5G స్మార్ట్ ఫోన్ ను అతితక్కువ ధరలో అందుకోండి

ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది

ఈ స్మార్ట్ ఫోన్ అఫర్ ధర మరియు స్పెక్స్ గురించి తెలుసుకోండి

iQOO Neo 6 5G స్మార్ట్ ఫోన్ ను అతితక్కువ ధరలో కొనాలని చూస్తున్నట్లయితే, ఇదే సరైన సమయం.  ఎందుకంటే, ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. అమెజాన్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం రూ.5,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ అఫర్ ధర మరియు స్పెక్స్ గురించి తెలుసుకోండి.  

iQOO Neo 6 5G: ధర మరియు ఆఫర్లు

ఐకూ నియో 6 5జి స్మార్ట్ ఫోన్ యొక్క 8GB+128GB వేరియంట్ ధర రూ.29,999 ధరతో వచ్చింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు 5,000 రూపాయల భారీ తగ్గింపుతో రూ.24,999 అఫర్ ధరతో సేల్ అవుతోంది. అలాగే, 12GB+256GB హై ఎండ్ వేరియంట్ ధర రూ.28,999. Buy From Here    

iQOO Neo 6 5G: స్పెక్స్

ఐకూ నియో 6 5జి స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200Hz ఇన్స్టాంట్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగిన 6.62 ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ రిజల్యూషన్ E4 AMOLED డిస్ప్లే ని కలిగి వుంది.ఈ డిస్ప్లే 1300 పీక్ బ్రైట్నెస్ అందించ గలదు మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా గరిష్టంగా 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది అలాగే, ఫోన్ ను నిరంతరం చల్లగా ఉంచడానికి 36907 mm² క్యాస్ కేడ్ కూలింగ్ సిస్టం ను కూడా కలిగి ఉంటుంది.

ఆప్టిక్స్ విభాగంలో, ఈ లేటెస్ట్ ఐ కూ 5G ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పు ఉంది. ఈ ట్రిపుల్ కెమెరాలో 64MP OIS ప్రధాన కెమెరాకి జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ తో వస్తుంది. ముందుభాగంలో, 16MP సెల్ఫీ కెమెరాని సెల్ఫీల కోసం అందించింది. ఈ 5G స్మార్ట్ ఫోన్ లో 4,700mAh బ్యాటరీని 80W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. మొబైల్ గేమర్‌ లను ఆకర్షించడానికి, ఈ ఫోన్ లో 4D గేమ్ వైబ్రేషన్ ని లీనియర్ వైబ్రేషన్ మోటార్ తో జతచేసింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :