complete guide to How to Create Professional Videos Using AI in 10 Minutes
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ కొత్త టెక్ తో అనేక పనులు చిటికెలో చేసే అవకాశం లభిస్తుంది. ఇందులో ముఖ్యమైనది వీడియో క్రియేషన్. ఒకప్పుడు ప్రొఫెషనల్ వీడియో తయారు చేయాలంటే కెమెరా, ఎడిటింగ్ సాఫ్ట్ వేర్, అనుభవం కలిగిన ప్రొఫెషనల్ ఎడిటర్ మరియు గంటల సమయం అవసరం అయ్యేది. కానీ, ఇప్పుడు AI టూల్స్ సహాయంతో కేవలం 10 నిమిషాల్లో ఆకర్షణీయమైన మరియు నాణ్యమైన వీడియోలను రూపొందించవచ్చు.
AI వీడియో క్రియేషన్ అంటే మీరు ఇచ్చిన టెక్స్ట్, స్క్రిప్ట్ లేదా మీ ఐడియాను ఆధారంగా చేసుకుని వీడియో, వాయిస్, సబ్ టైటిల్స్, యానిమేషన్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సహా ఆటోమేటిక్‌గా వీడియోను రూపొందించే ప్రక్రియ.
ఏదైనా ప్రొఫెషన్ వీడియో క్రియేట్ చేయాలంటే ముందుగా మీరు మీకు తగిన టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే, మీరు ఏ అంశంపై వీడియో చేయాలనుకుంటున్నారో నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే, ఒక స్పష్టమైన టాపిక్ ఉంటే మీ వీడియో మరింత ప్రభావవంతంగా ఉంటుంది. మీ టాపిక్ నిర్ణయించుకున్న తర్వాత ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.
మీ వీడియో కోసం 150 నుంచి 300 పదాలతో చిన్న స్క్రిప్ట్ రాయండి. ఇందులో ఆకర్షణీయమైన పరిచయం, ప్రధాన సమాచారం, ముఖ్యమైన పాయింట్లు మరియు చివరలో ముగింపు లేదా కాల్ టు యాక్షన్ వంటివి ఉండాలి. ఈ స్క్రిప్ట్ ను మీరు ఏఐ టూల్స్ సహాయంతో క్రియేట్ చేయవచ్చు.
మీ అవసరానికి అనుగుణంగా AI వీడియో టూల్ ను ఉపయోగించండి. ఈ టూల్ లో టెక్స్ట్‌ను వీడియోగా మార్చడం, AI వాయిస్ ఓవర్, AI అవతార్, స్టాక్ వీడియోలు, చిత్రాలు, AI అవతార్ మరియు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వంటివి ఉండాలి.
మీరు మీకు తగిన టూల్ ఎంచుకున్న తర్వాత మీ స్క్రిప్ట్ ను ఇక్కడ పేస్ట్ చేయండి. చాలా AI ప్లాట్ ఫామ్స్ స్క్రిప్ట్ ను విశ్లేషించి దానికి తగిన విజువల్స్, ట్రాన్సిషన్ మరియు సీన్లను కూడా సూచిస్తాయి.
ఇక్కడ మీ వీడియోకు తగిన లేదా సరిపోయే AI వాయిస్ ను ఎంపిక చేయండి. ఇందులో స్పష్టమైన ఉచ్చారణ, సహజమైన టోన్ మరియు సరైన వేగం వంటివి ఉండాలి. కొన్ని టూల్స్ మల్టీ లాంగ్వేజ్ లకు కూడా సపోర్ట్ చేస్తాయి. కాబట్టి, మీకు తగిన వాయిస్ ఎంచుకోవడం మంచిది.
మీ వీడియోను మరింత ప్రొఫెషనల్‌గా కనిపించేలా సరిచేయడం మంచిది. దీనికోసం మీ లోగో జోడించడం, బ్రాండ్ రంగులను ఉపయోగించడం, ఫాంట్ ను మార్చడం, సబ్ టైటిల్స్ జత చేయడం మరియు అవసరాన్ని బట్టి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని చేంజ్ చేయడం వంటివి చేయండి.
మీరు క్రియేట్ చేసిన ఫైనల్ వీడియోను ఒకసారి పూర్తిగా చూడండి. ఇందులో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నాయో లేదో చూడాలి. అలాగే, వాయిస్ సరిగ్గా వినిపిస్తుందా లేదా, విజువల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో, సబ్ టైటిల్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చాలా క్షణ్ణంగా పరిశీలించండి.
Also Read : Realme 16x 5G: మరో బిగ్ బ్యాటరీ బడ్జెట్ ఫోన్ లాంచ్ చేస్తున్న రియల్‌మీ.!
మీ వీడియో లో అన్నీ వివరాలు సరిగ్గా ఉన్నాయనిపిస్తే HD లేదా FHD నాణ్యతలో వీడియోను ఎక్స్‌పోర్ట్ చేయండి. ఈ వీడియో వచ్చిన తర్వాత దాన్ని YouTube, Instagram, Facebook, LinkedIn లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో ప్రచురించవచ్చు.
ఉదాహరణ: “మరిన్ని టెక్ అప్‌డేట్స్ కోసం మా ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి.