Asus ROG Phone 2 కోసం ఆండ్రాయిడ్ 10 అప్డేట్

Asus ROG Phone 2 కోసం ఆండ్రాయిడ్ 10 అప్డేట్

గేమింగ్ కోసం అసూస్ ప్రత్యేకంగా తీసుకోచ్చినటువంటి గేమింగ్ ఫోన్ Asus ROG Phone 2 ఇప్పటి వరకూ ఆండ్రాయిడ్ 9 పై ఆధారితంగా నడుస్తుండగా ఈరోజు నుండి ఈ ఫోన్ కోసం ఆండ్రాయిడ్ 10 అప్డేట్ ని ప్రపంచవ్యాప్తంగా వున్నా ఫోన్లన్నింటికీ కోసం విడుదల చేసినట్లు సంస్థ అధికారికంగా తెలిపింది. గేమింగ్ లో మంచి పెర్ఫార్మెన్క్ అందించే ఈ స్మార్ట్ ఫోన్ ఈ కొత్త అప్డేట్ తో మరింత ఆకట్టుకునేలా ఉంటుందని సంస్థ ఈ సందర్భంగా పేర్కొంది.

ఈ అప్డేటుతో, డార్క్ మోడ్ అందుతుంది మరియు జెశ్చర్ మరింత శులభతరం అవుతుంది మరియు  గూగుల్ అసిస్టెంట్ ని లాంచ్ చేయడనికి కేవలం స్వైప్ చెయ్యడం లేదా పుల్ తో చెయవచ్చు. అంతేకాదు, ప్రైవసీ ని కూడా మరింతగా పటిష్టం చేసుకోవచ్చు. ఇప్పటికే, దాదాపుగా 200 కి పైగా గేమ్స్ కి సపోర్ట్ చేసే అవకాశంతో ఈ ఫోన్ గేమర్స్ కి మంచి ఎంపికగా ఉంటుందని తెలిపింది.

అసూస్ ROG 2 ప్రత్యేకతలు

ఈ ఫోన్ ఒక 6.59 అంగుళాల పరిమాణం గల OLED డిస్ప్లేతో వస్తుంది. ఇది అత్యధికంగా, 120Hz రిఫ్రెష్ రేటుతో వస్తుంది. తద్వారా ఇది 10-Bit HDR10 కి సపోర్ట్ చేస్తుంది. అలాగే, ఈ డిస్ప్లేలో ఒక ఇంటిగ్రేటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కూడా అందించారు. ఇందులో, గేమింగ్ కోసం క్వాల్కమ్ కొత్తగా ప్రకటించిన స్నాప్ డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ ని అందించినది. ఈ ప్రాసెసరుకు జతగా గరిష్టంగా ఒక 12GB ర్యామ్ కూడా అందించడంతో అవధులు లేని స్పీడ్ ఈ స్మార్ట్ ఫోన్ సొంతమని చెప్పొచ్చు.  ఈ గొప్ప ర్యామ్ కి తగ్గట్టుగానే 512GB స్టోరేజిని కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఇంత స్పీడ్ కలిగిన ఈ ఫోనుకు తగినట్లుగా ఒక పెద్ద 6,000 mAh  బ్యాటరీని కూడా ఇచ్చింది.

ఇక కెమేరాల విషయానికి వస్తే, ఇందులో ఒక 48MP కెమెరాని కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోనుతో నిరంతరంగా 7 గంటలు PUBG గేమ్ ఆడుకోవచ్చని అసూస్ పేర్కొంది. అధనంగా, ఈ ఫోనుతో పాటుగా మూడు కొత్త రకం కన్సోల్ లను కూడా అందించింది. వాటిలో, ఒకటి ఏరో – యాక్టివ్ కునాయ్ కూలర్ ఫ్యాన్ వస్తుంది. దీన్ని కునాయ్ గా కంపెనీ పిలుస్తోంది. అలాగే, ఫోనుకు ఇరువైపులా ఏర్పాటు చేసుకునేలా రెండు JoyPad లను కూడా అందిస్తుంది. మొత్తంగా చూస్తే, ఇది ఒక స్మార్ట్ ఫోనుగా కాకుండా ఒక చిన్న సైజు కంప్యూటర్ లాగా అనిపిస్తుంది.                                    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo