హై ఎండ్ ఫీచర్లతో Asus 6Z ఈరోజు ఇండియాలో విడుదలకానుంది

HIGHLIGHTS

ASUS Z6 వేగవంతమైన స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసరు మరియు మరెన్నో ప్రత్యేకతలతో వస్తుంది.

అసూస్ 6Z వెనుక మరియు ముందుకు మార్చుకోగలిగేలా ఉండే ఒక 48MP + 13MP డ్యూయల్ కెమెరాతో వస్తుంది.

ఈ ప్రొసెసరుకు జతగా 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజి వరకూ అందించబడింది.

ప్రస్తుతం అన్ని స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు కూడా కెమేరా డిస్ప్లే మరియు ప్రాసెసర్ పైన ద్రుష్టి సారించాయి. అసూస్, ఈ విభాగాలలో పూర్తిగా హై ఎండ్ ఫీచర్లతో తీసుకొచ్చినటువంటి తన 6Z స్మార్ట్ ఫోన్ను ఈ రోజు ఇండియాలో లాంచ్ చేయనుంది. ఈ లాంచ్ ఈవెంట్ మధ్యాహ్నం 12:30 నిమిషాలకు మొదలవుతుంది. ఈ ఫోన్,  వేనుక మరియు ముందుకు మార్చుకునేలా ఒక ఏర్పాటుగాల ప్రధాన 48MP కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే, ఈ 48MP కెమెరా Sony IMX సెన్సారుతో ఉంటుంది.ఇది వేగవంతమైన స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసరు మరియు మరెన్నో ప్రత్యేకతలతో వస్తుంది. 

అసూస్ 6Z ప్రత్యేకతలు

ఈ స్మార్ట్ ఫోన్, అత్యధికంగా 92% బాడీ టూ స్క్రీన్ రేషియో కలిగి 2340X1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.4 అంగుళాల FHD + నానో ఎడ్జ్ డిస్పీలతో వస్తుంది. ఈ ఫోన్ ఒక స్నాప్ డ్రాగన్ 855 7nm ఆక్టా కోర్ ప్రోసెసరుతో అందించబడింది. ఈ ప్రొసెసరుకు జతగా 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజి వరకూ అందించబడింది. ఈ అసూస్ 6Z,  మరింత ఛార్జింగ్ వేగాన్ని అందించగల Quick Charge 4.0 సపోర్టు కలిగిన ఒక పెద్ద 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఇక కెమెరా విభాగానికి వస్తే, అసూస్ 6Z వెనుక మరియు ముందుకు మార్చుకోగలిగేలా ఉండే ఒక 48MP + 13MP డ్యూయల్ కెమెరాతో వస్తుంది. ఇంకా ఈ ఫోను కెమెరా ఒక పెద్ద F1.79 ఎపర్చరు లెన్స్ తో ఉంటుంది. ఇది చీకటిలో కూడా ప్రకాశవంతమైన ఫోటోలను తీసుకోవడానికి, దానిలో ముందుగా అందించిన అల్ట్రా నైట్ మోడ్ తో  దాని భారీ 48MP  సెన్సార్ను కలుపుతుంది. ఈ 48MP కెమెరా ఒక Sony IMX586 సెన్సారుతో వస్తుంది. ఇక రెండవ కెమేరా విషయానికి వస్తే, ఇది 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమేరా ని ఇచ్చారు. ఈ కెమేరా సెటప్పును 'ఫ్లిప్ కెమేరా' కంపెనీ పిలుస్తోంది.    

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :