టాప్-5 స్మార్ట్ ఫోన్స్!! 10 వేల బడ్జెట్ ధరలో మీ అప్షన్..!

టాప్-5 స్మార్ట్ ఫోన్స్!! 10 వేల బడ్జెట్ ధరలో మీ అప్షన్..!
HIGHLIGHTS

ఒక మంచి స్మార్ట్ ఫోన్

కేవలం 10 వేల బడ్జెట్ ధరలో

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లలో టాప్-5

భారతీయ మార్కెట్ లో కేవలం 10 వేల బడ్జెట్ ధరలో ఒక మంచి స్మార్ట్ ఫోన్ కోసం వెతుకుతున్నారా? అయితే, మార్కెట్ లో లభిస్తున్న లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లలో టాప్-5 స్మార్ట్ ఫోన్స్ గురించి ఈ రోజు పరిశీలిద్దాం. ఈ స్మార్ట్ ఫోన్స్, డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా మరియు పర్ఫార్మెన్స్ పరంగా బాగుంటాయి మరియు వీటి దగరకు తగిన పర్ఫార్మెన్స్ ను అందించగలవు. అవేమిటో చూసేద్దామా….!                     

1. రియల్మీ నార్జో 30A

Latest Price : Rs.8,499

రియల్మీ నార్జో 30A స్మార్ట్‌ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ గల డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే గరిష్టంగా 570 నిట్స్ బ్రైట్నెస్ అందిస్తుంది. నార్జో 30A మీడియా టెక్ హీలియో G85 చిప్సెట్ తో పనిచేస్తుంది. ఇది ఆక్టా కోర్ ప్రొసెసర్ మరియు మాలి -G52 GPU తో వుంటుంది. ఈ ప్రాసెసర్ 3GB/4GB ర్యామ్ మరియు 32GB/64GB స్టోరేజ్ మద్దతును కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్పును కలిగివుంది. ఇందులో, 13MP ప్రధాన కెమెరా బ్లాక్ & వైట్ సెన్సార్ లను కలిగివుంది. సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరాని ముందుభాగంలో అందించారు. ఈ ఫోన్ ఫేస్ అన్లాక్ మరియు బ్యాక్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలివుంది. రియల్మీ నార్జో 30A పెద్ద 6,000 mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో కలిగి వుంటుంది. ఈ ఫోన్, లేజర్ బ్లూ మరియు లేజర్ బ్లాక్ అనే రెండు రంగులలో లభిస్తుంది. ఈ ఫోన్ గేమింగ్ చిప్ సెట్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఆకట్టుకుంటుంది. 

2. షియోమి రెడ్‌మి 9 ప్రైమ్

Latest Price : Rs.9,499

షియోమి రెడ్‌మి 9 ప్రైమ్ ‌ఒక 6.53-అంగుళాల FHD + (2340 x 1080 పిక్సెల్స్) డిస్ప్లేతో వస్తుంది. ఇది మీడియా టెక్ హెలియో G 80 చిప్ ‌సెట్ ‌తో ఆక్టా-కోర్ సిపియు మరియు మాలి-జి 52 జిపియుతో పనిచేస్తుంది మరియు ఇది ఆండ్రాయిడ్ 10 పై ఆధారపడిన MIUI 12 పై నడుస్తుంది. ఇది 4 జిబి ర్యామ్‌ తో జతచేయబడుతుంది. ఇందులో క్వాడ్-కెమెరా సెటప్‌ని  కలిగి ఉంది: ప్రాధమిక 13 MP కెమెరా, 8 MP  అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా , 5MP మాక్రో కెమెరా మరియు 2 MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. . ముందు వైపు, వాటర్‌ డ్రాప్ నాచ్ కటౌట్ లోపల 8MP సెల్ఫీ కెమెరా ఉంది. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్ కి మద్దతుతో 5,020 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

3. పోకో M2

Latest Price : Rs.9,999

పోకో M2 లో పెద్ద 6.53-అంగుళాల FHD + (2340 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లే, సెల్ఫీ కెమెరా కోసం వాటర్ ‌డ్రాప్ నాచ్ కటౌట్‌తో ఉంటుంది. వేలిముద్ర సెన్సార్ కెమెరా మాడ్యూల్ క్రింద ఉంది. పోకో M2 లో P2i స్ప్లాష్ మరియు రస్ట్ ప్రొటెక్షన్ కూడా అందించారు. M2 స్మార్ట్ ఫోన్, MediaTek Helio G80 ప్రాసెసర్ ఆక్టా-కోర్ సిపియు మరియు మాలి-జి 52 GPU తో కలిగి ఉంది. ఇది 6GB RAM మరియు 128GB స్టోరేజ్  ఎంపికలతో జతచేయబడుతుంది. పోకో M2 వెనుక భాగంలో నాలుగు కెమెరాల సెట్ అంటే క్వాడ్ కెమేరా ఇవ్వబడింది. ఇందులో, 13MP ప్రాధమిక కెమెరా, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 5MP మాక్రో కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఇక ముందు వైపు, 8MP సెల్ఫీ కెమెరా నాచ్ కటౌట్ లోపల ఉంది. M2 లో 5,000WAh బ్యాటరీ అమర్చబడి వుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. POCO M2 కేవలం పదివేల కంటే తక్కువ ధరలో 6GB ర్యామ్ తో వస్తుంది.    

4. రియల్మీ C3

Latest Price : Rs.8,999

రియల్మీ C3 ఒక 6.5 అంగుళాల HD+ డిస్ప్లే తో వస్తుంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ మరియు 89.9% స్క్రీన్-టూ-బాడీ రేషియాతో వస్తుంది. ఈ ఫోన్ మీడియా టెక్ హీలియో ఎంట్రీ లెవాల్ గేమింగ్ ప్రాసెసర్ MediaTek Helio G70 ఆక్టా కోర్ ప్రాసెసర్ తోపనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ తో విడుదలైన  మొట్ట మొదటి స్మార్ట్ ఫోన్ జాబితాలో Realme C3 మొదటి ఫోనుగా నిలుస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ కెమెరాని అందించింది. ఇందులో 12MP ప్రధాన కెమెరా మరియు జతగా మరొక 2MP డెప్త్ సెన్సారుతో వుంటుంది. ఇందులో ఒక 5MP సెల్ఫీ కెమేరాని అందించింది. రియల్మీ C3 ని ఒక అతిపెద్ద 5,000mAh బ్యాటరీతో విడుదల చేసింది. ఈ రియల్మీ ఫోన్ కూడా గేమింగ్ ప్రాసెసర్ మరియు పెద్ద బ్యాటరీతో వస్తుంది.  

5. శామ్సంగ్ గెలాక్సీ M11

Latest Price : Rs.10,499

శామ్సంగ్ గెలాక్సీ M11 ఒక 6.4-అంగుళాల LCD డిస్ప్లేను కలిగి ఉంది మరియు HD + రిజల్యూషన్‌తో వస్తుంది. డిస్ప్లేలో పంచ్-హోల్ డిజైన్ ఇవ్వబడింది. ఈ పంచ్ హోల్ ఫోన్, సెల్ఫీ కెమెరాను ఎడమ అంచున కలిగిఉంది. ఈ ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది, ఇది ఫిక్స్‌డ్ ఫోకస్‌తో వస్తుంది మరియు దాని ఎపర్చరు ఎఫ్ / 2.0 గా ఉంటుంది. ఇక ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉన్నాయి. ఇందులో ప్రాధమిక కెమెరా 13 మెగాపిక్సెల్స్ మరియు దాని ఎపర్చరు ఎఫ్ / 1.8, రెండవ కెమెరా 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా మరియు దాని ఎపర్చరు ఎఫ్ / 2.2 మరియు మూడవ డెప్త్ సెన్సార్ పోర్ట్రెయిట్ షాట్స్ తీయడం కోసం ఇవ్వబడింది. ఈ ఫోన్ 1080p వీడియోను 30fps వద్ద రికార్డ్ చేయగలదు. ఆక్టా-కోర్ చిప్‌సెట్ ద్వారా శక్తినిస్తుంది, ఇది 1.8GHz వద్ద క్లాక్ చేయబడుతుంది. ఇది 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌ తో వుంటుంది. మైక్రో ఎస్‌డి కార్డు ద్వారా కూడా దీని స్టోరేజిని పెంచవచ్చు. ఈ ఫోన్ 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ఉంటుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo