లేటెస్ట్ ఐఫోన్ కొనాలని చూస్తున్న ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. Apple iPhone 13 ఫోన్ ను ఈరోజు గొప్ప డిస్కౌంట్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లతో అమెజాన్ సేల్ చేస్తోంది. ఈ ఆఫర్ల ద్వారా ఈ లేటెస్ట్ ఐఫోన్ ను చాలా తక్కువ ధరకే మీసొంతం చేసుకోవచ్చు. మీరు కూడా లేటెస్ట్ ఐఫోన్ ను తక్కువ ధరకే కొనాలని చూస్తున్నట్లయితే ఈ అఫర్ పైన ఒక లుక్కేయండి.
Survey
✅ Thank you for completing the survey!
Apple iPhone 13: ధర & ఆఫర్స్
Apple iPhone 13 యొక్క 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ రూ. 79,900 ధరతో లాంచ్ చేయబడింది. అయితే, ఈరోజు అమెజాన్ నుండి ఈ ఫోన్ 19,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ.60,900 ధరతో లభిస్తోంది. అంతేకాదు, Yes బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ కొనేవారికి రూ.1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఒకవేళ మీరు EMI అప్షన్ తో కొనాలనుంకుంటే కూడా మంచి ఆఫర్లు అంధుబాటులో వున్నాయి. Buy From here
ఐఫోన్ 13 IP68 రేటింగ్ తో వస్తుంది. అంటే, ఇది దుమ్ము మరియు నీటి నిరోధకతను కలిగి ఉన్నాయి. ఐఫోన్ 13 ఫోన్ 6.1 ఇంచ్ సూపర్ రెటినా XDR డిస్ప్లేని కలిగి ఉంది. ఈ డిస్ప్లేకి స్క్రాచ్-రెసిస్టెంట్ సిరామిక్ గ్లాస్ ని కూడా ఆపిల్ ఈ ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ లేటెస్ట్ యాపిల్ A15 బయోనిక్ చిప్ శక్తితో పనిచేస్తాయి.
ఇక కెమెరా పరంగా, ఐఫోన్ 13 OIS(ఆప్టిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) f/1.5 ఎపర్చర్‌తో 12MP ప్రధాన కెమెరా మరియు 12 MP అల్ట్రా-వైడ్ కెమెరాని కలిగివుంది. ఈ రియర్ కెమెరా 4K UHD, Dolby Vision HDR రికార్డింగ్ వంటి మరియు మరిన్ని ఫీచర్లను కలిగివుంది. ముందు భాగంలో, ఫేస్ ఐడితో పాటు 12MP సెల్ఫీ కెమెరా ఉంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile